పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజయదశమి 'ఆడ్యేఆత్మని వాసనిత్యరసికే ఆనందమాధత్స్వమే” అనియు, 'రమ్యేరమ్యత రే రనేరసకలే రక్తాంశు కేరంజకే' అనియు మధురముగా కాళిదాసు దేవినుపాసించెను. అధ్యయనము నిత్యబ్రాహ్మణవిధిగా నంగీకరించుసరికి శ్లో. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభంకరిష్యామి | సిద్ధిర్భవతు మేసదా. అను సులభసూక్తిధ్యానవాచికముగా నల్లికొనియెను. 'ఆధునిక కాలమందు మానవస్వభావమునందున్న సంగీత సాహిత్యములును, కళాకాంతులును, భాషాభావములును, దీపింపఁజేయు మధురార్ద్రశక్తుల కన్నిటికిని సరస్వతి అధిష్ఠాన దేవతగా భావించి అర్చింపఁబడుచున్నది. ఈక్రింది పద్యము లిందులకు దార్కాణములు. "ఉ. పాలును నీరు వేఱుపఱు పంగలమావుల వేదవీధివా హ్యాళియొనర్చు నే యలికు లాలక, తాసితవర్ణయయ్యు నే బాలసువగ దేహమున ణ భాసిలు, నానలు మోము వేల్పుప్రో యాలు, వలంతిపల్కు జవ రాలునటించుత నాదు నాలుకక్. "శా. తల్లీ! నిన్ను దలంచి పుస్తకముచే తంబూనితి నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో భిల్లంబల్కుము నాదు వాక్కునను సం ప్రీతి౯ జగన్మోహినీ! ఫుల్లాబ్జాక్షి; సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా! జైత్రయాత్ర క్షత్రియులకు దిగ్జిగీపాతృవ తీండ్రించు దినములి వియె. వానలాగిపోయి, త్రోవలెండుటచే సేనాగమన ము సుగమమగును. రఘువు దిగ్విజయ యాత్ర శభివర్ణిం చుచు కాళిదాను “గీ దాటుటకు నర్హముగ నదుల్ దనరఁ జేసి అడుసు లేనట్లు త్రోవల నలరఁజేసి. తచ్ఛరత్కాలమాతని . దండయాత్ర కరుగఁ బురికో ల్పెనతఁ డను కొనకమున్నె. అని కాలయోగ్యతను నిరూపించెను. రాజులు సా మాన్యముగా నీఋతువును విజయ యాత్రాకాలము గాఁ బూజించిరనుట నిర్వివాదము. అప్పటినుండియే ఆయుధ. పూజ ప్రారంభ మైయుండవచ్చును. జరిగెను. శ్రీహర్షుని సత్రయాగము శరదృతువునందు బౌద్ధులత్రివేణీ పరిషత్తు కార్తిక జ్యో త్స్నలలో సనుకూ డెను. శ్రీకృష్ణుని రాసక్రీడనము శర త్తునందేరాణించెను. ధర్మజుఁడు రాజనూయమును ఈ శుభదినములలో నే జరిపించెను; ఇంకెందుకు మహభారత యుద్ధమె కార్తికబహుళమున జరిగినది. కాని విజయఁఁడీ శరత్ర్పారంభమునకు స్థాయిపూజను గల్పించెను. లేనిచో నిది భారతవషీ౯యులకు జాతీయోత్సవ కాలము గాఁ భా దుకొనియుండదు. భారతవీరులలో అర్జునకుఁగల పూజ్య పదవి యనన్యమయిన దనక తప్పదు. ఒక పక్షమున భారతక ధారచనకు నాయకుఁడే అర్జునుఁడని చెప్పవచ్చు ను. రధానురధికులు ప్రాణవిసజనము చేసి యశోమా జ౯న మొనర్చిన మహాభారత రణనాయకత్వము అర్జును నకు గట్టి పెట్టుట నిర్వివాద విషయముకాదు. కాని త త్వజ్ఞులీ నిణ౯యమునకు విరుద్ధులు కారు. భారతపాఠకుల కు మొట్ట మొదట రంగమందు మహత్తరమగు భీష్మ తేజస్సు పరిస్ఫుటము గాఁ గానవచ్చును; కాని భీష్ముడు వీరుఁడు గా కంటెనాచార్యుఁడుగా నధిక ప్రశంసనీయుఁడయ్యెను. అదిగాక ధర్మాధ౯ కామమోక్షములు నాల్గింటను నీకురు కులతిలకుని జీవితము యధాపూణ పరిణామమును బొం ద లేదు. భీష్ముని మహాసంగ్రామమందు నాయకుఁడనుట కంటే, ఆ వీరకుటుంబమందు రాజషి యనుట సమంజ సము. తరువాత వస్త్రధారులలో ద్రోణకృపాశ్వద్ధామ లు వత్తురు. వారందఱును బ్రాహ్మణులు. ఆచార్య పీఠ స్ధులు. పాలితులుగాని పాలకులుగారు. వీరు సుయో ధన నియోగమందుండిరి కావున యుద్ధమునం దంజవేసి పోరాడిరి; అంతేకాని వీరుండినందువలన యుద్ధము దాప రింపలేదు. వీరి జీవితములు వృత్తిధర్మమునం దుత్తమపురు .