పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/44

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

ఒక్కొక్కప్పుడు వారలకు వేతనము దొరకకుండ చేయు టయు తటస్థించును. ఇది సంభవించుట శోచనీయము. అధర్మము. ఇందు చేత నే నిరుద్యోగ సమస్య ఏర్పడుచున్నది. నిరుద్యోగులు ప్రభుత్వమునకును ప్రజలకును ప్రమాద కారకులు. బుద్ధి మంతులైనచో, మానమునకు మగ్గి, బిచ్చగాండ్రై,అవసరములుతీరక రోగులై రోగ వ్యాపకము చేయుదురు. బుద్ధిహీనులైనచో, దుర్వృత్తులై అపకారులగుదురు. కాన సంఘమును, సర్కారును నిరుద్యోగ నివారణ చేయక తప్పదు.

“అవసరమైన అర్హతలు కలవారిలోనుండి ఇతరవృత్తి లేనివారికి, ఉద్యోగ మియ్యవలెను” ఇది ధర్మసూత్రము, గుంటూరుజిల్లా, కాంగ్రెసు సంఘమువారు దీనిని అమోదించిరి. మించిన అర్హతులు పెట్టినచో, విద్యాధికులలో పోటి. ఇతరవృత్తి కలవారిని పిలిచిన, ధనాఢ్యులతో పోటి. పలుకుబడి గలవారన్నచో, అధికారులతో పోటీ. మూడుపోటీలును ముప్పుదెచ్చును. నిరుద్యోగి ఏటపడును.

వేతనావసరము లేనివారు, వేతనముతో నిమిత్తము లేకయే, ప్రజలకును ప్రభుత్వమునకు సేవ చేయవలెను. అయ్యదివారి ధర్మము.

“ఒక పలుకు, ఒక భార్య, ఒక బాణము” ఈ మూటివలన రాముడు, లోకాభిరాముడయ్యెను. ఒకేమాటవలన హరిశ్చంద్రుడు, సత్యవంతుడై మార్గదర్శకు డయ్యెను. ఒకేపతి వలన సేతాదేవి, జగన్మాత అయ్యెను. ఒకేవృత్తి చే, కడుపు నిండెడి ఒకేవృత్తి చేత, కలియుగము వైకుంఠము అగును. విడి పేణ వ్యత్తి సాంకర్యమువలెనే, వృత్తి బాహుళ్యమును, పే నివారింపవలెను.

గ్రంథ విమర్శ

బాలరోగములు - చికిత్స.

హోమోపతి ఈ గ్రంథము పశ్చిమ గోదావరిజిల్లా సంఘాపాధ్యక్షులగు దా. తల్లాప్రగడ కామేశ్వరరావు జి. ఏ. ఎం. బి. (హోమియో) గారిచే రచింపబడినది. ఇందు తల్లులు తెలిసికొనదగిన శిశుజనము, శిశుపోషణము ఆరోగ్య ఆనారోగ్య శిశులక్షణములు, మొదలగు అనేక గలుగు ఆహారనియమములు ముఖ్యవిషయము లే గాక, బిడలకు కార ణ సమస్త వ్యాధులకు లక్షణములు, ములు, చికిత్స, పధ్యము సహా విపులముగాను, స్త్రీ పురు షు లకు పండితపామరుల కు అర్థమగునట్లును అతిసులభ శైలిలోను వ్రాయబడెను. ఈ గ్రంథ సహాయ మున వైద్యుల సహాయ మక్కరలేకయే ప్రతిగృహమందు తలిదండ్రులు తమబిడ్దల వ్యాధులను తెలిసికొని స్వయ ముగ నివారణ చేసికొనగలరని మాదృఢవిశ్వాసము, తమ బిడ్డల ఆరోగ్యాభివృద్ధికై పాటుపడు తల్లిదండ్రులందరకు వినయపూర్వకముగా ఈగ్రంధము అంకితము చేయుట లోనే, గ్రంథకర్త యొక్క విశాలహృదయమును, గృహ స్థులకుగల యీ గ్రంధావశక్యతయును వెల్లడియగుచున్న ది. ఇది మంచి కాగితముమీద అచ్చువేయబడినది. 100 పేజీలుగల క్యాలికో బైండు గ్రంధము . వెల రు 1-12-0

అజీ) ము:ఈ గ్రంధము కూడ పై గ ంథకర్త చేతనే వ్రాయబడినది. ఆంగ్ల గ్రంథ పరిచయమునకు తోడు పరిశోధనము స్వానుభవముకూడ జేర్చి వ్రాసియుండుట చే దీని ప్రాశస్త్యమును గురించి వేరే చెప్పనక్కర లేదు. ఇందు అజీర్ణ కారణములు, నివారణోపాయములు, పెక్కు రకముల అజీర్ణములు, చికిత్సలు, పథ్యాపథ్యములు మొద లగు విషయములన్నియు చక్కగా విభజింపబడి అతిసులు భ శైలిలో వ్రాయబడెను. ఆరోగ్యాభిలాషులందరు ముఖ్య ముగా చదువతగిన గ్రంథము. 300 పేజీలు గల క్యాలికో బైండు గ్రంథము 0-120 మాత్రము. రెండు గ్రంధములలోను గ్రంథక ర్త యొక్క గ్రంధకర్త యొక్క బొమ్మకలదు. మామూలుగా మందులవలన గలుగు ఆపాయములన్నియు హోమియోపతీవై ద్యమందు లేవు. ఎందువలన ననగా వీని యందు మందు భాగము నూక్ష్మాతి సూక్ష్మముగ నుండును.

హోమియోపతి వైద్యము ఆంధ్రదేశములో దినదినాభి వృద్ధిగాంచుచున్న మాటయెల్ల రెరిగినదే, ఈ వైద్యప్రచా రము ప్రతియింటను బాగుగా జరుగుటకు ఈ గ్రంథములు మిక్కిలి ఉపయోగకరముగనున్నవి. గ్రంథకర్త ఈగ్రంథ ములను రచించుటలో అంధ్రసోదరసోద రీమణులకు ఎక్కువ సేవ చేసియున్నారనుట అతిశయో కికాదు. వారి సేవ ఎంతయు ప్రశంసార్హము. ఇట్టి గ్రంథము లింక ను వాని గ్రంథకర్త ఆంధ్రలోకమునకు మహోపకారము చేయును గాక యని కొనుచున్నాము. ఈ గ్రంధములు రెండిటిని గ్రంధాలయలో నుండుటకు పచ్చిమగో దావరిజిల్లా విద్యాశాఖాధికారి గారు అనుజ్ఞ నిచ్చియున్నారు. కావున గృహాస్థులేగాక, గ్రంథాలయాధి కారులందరును తమ గ్రంథాలయములకు ఈ గ్రంధ ములను తెప్పించి పాఠక మహాశయులకు మహోపకారము చేయుదురుగాక యని కోరుచున్నాము. వలయువారు: డా॥ తల్లాప్రగడ కామేశ్వరావు, బి. ఏ. ఎం, బి. ఉంగుటూరు. (హోమియో) తాడేపల్లిగూడెం తాలూకా, పశ్చిమగోదావరిజిల్లా. అని వ్రాయవలయును.