పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/43

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపాదకీయములు

చిన్న గ్రంథాలయములు పెట్టుకొనుటకును ప్రోత్సహించ వలెను. మండల కేంద్ర గ్రంథాలయములు భాషాప్రయుక్త రాష్ట్ర గ్రంథాలయము లేర్పరచవలెను. నిరక్షర నిర్మూల సత్వమునకు కావలసిన సర్వ చర్యయు తీసికొనవలెను. ఇంత టికిని ద్రవ్యమును ప్రభుత్వము వారు సేకరింపవలెను. తమ బొక్క– సమునుండి యీయవలసియున్న ఇయ్యవలెను. ఇంత కార్యనిర్వహణమును దేశ భాషాధారకము గా జరిగి ఏప్రాంతమున కాప్ర్రాంతము స్వతంత్రముగా పనిచేయుట కేర్పరచి మొత్తముమీద రాష్ట్ర ప్రయత్నము నైక్యపరచుచు రావ లెను.ఇంతటి కార్యక మము దేశించుపట్ల గ్రంథాలయ వయోజన విద్య, నిరుద్యోగ నిల్మూలనము లొక చెటు శాఖలు గా గణించి పని చేయుటకు తశాసనము చేసిన చేయదగును. నిజమునకు గ్రంథాలయోద్యమున నీ నాడు ప్రబలవలసినదృష్టి గ్రంథములుంచుట. జాబితాలు తయారు చేయుట, గ్రంధము లెరవిచ్చుట మున్నగు గ్రంథాలయ శాస్త్రోక్త చర్యలతో తృప్తిపడియుండుట కవ కాశమేలేదు. జాతి వికాసమునకు కావలసిన విస్తారత మో త్సాహ మీ యుద్యమ ప్రచారమువ సాధించవలెను. కాబట్టి కాంగ్రెసు మంత్రివర్గము వారు జాతీయకళగల గ్రంధాల యాభిమానులను చేర్చి యాలోచించి తాము స్థానిక సంస్థల చట్టములను సవరించకముందే యీ మార్గమున చేయదగిన కృషి నాలోచించి తగిన శాసనము నుపకమింతురు గాక యని కోరుచున్నాము.

మద్యనివేధశాసనము

సేలముజిల్లాలో మద్యనిషేధశాసనము ఈ నెల మొదటి తేదినుండి అమలు జరపించినందులకు మద్రాసుమంత్రులను అభినందించెదము. కాని వారు కల్లుపారాల బదులు ప్రజలకు తేనీరు అలవాటు చేయించు దుకాణములకు ప్రోత్సాహము కలిగించుట ఎంతమాత్రము మంచిపని కాదని తెలుపవలసి వచ్చినందులకు మిక్కిలి చింతిల్లు చున్నాము. నిజమునకు టీ కాఫీలు కల్లు సారాలు చేయు సంత హాని చేయకున్నను--కొంతవఱకై నను శరీరమునకు హాని చేయువస్తువులే, కాన వీని వాడుకకూడ ఎంత తగ్గిన ప్రజలకు అంతమేలు. అందువలన కాంగ్రెసుమంత్రులు, దీనిసత్యము గ్రహించి, తేనీటి దుకాణములను ప్రోత్స హించుట మా నెదరుగాక! కల్లుసారా దుకాణములకు మాఱు మజ్జిగ-గంజి-జావ దుకాణములు పెట్టుటకు ప్రజలు ప్రయత్నించుట మంచిది. కాఫీ హోటేళ్ళలో టీ కాఫీలకు అలవాటుపడి పల్లెటూరివారు పెక్కురు ఇప్ప టికే పాడైనారు. కావున, టీ దుకాణములకు ఎంత మాత్రమును ప్రోత్సాహ మియ్యరాదు.

ఉద్యోగ నియామకము

శ్రీ గొల్లపూడి సీతా రామశాస్త్రి గారు ప్రతిరాజ్యములోను కొందరు ఉద్యోగస్థు లుందుకు. వీరినినియమించుటకు కొన్ని నియమములుండును. రాజ్యాంగమందేగాక పెద్ద పెద్ద సంస్థ లన్నిటియందును ఇట్లే కొన్ని నియమములకు లోబడి ఉద్యోగస్థుల నేర్పరచెదరు. సంస్థలదాక పో నేల! ప్రతిగృహస్థుడును ఇంటిపనులకు, వ్యవసాయపుపనులకు నౌకర్ల నేర్పరచుకొనును.

తా నొక్కడు చేయజాలని పనులందు వా నౌకర్లు గాని ఉద్యోగస్థులుగాని ఉండక తప్పగు, కూలీలును ఒకరకము ఉద్యోగస్థులే. ఈ ఉద్యోగములలో భేదములు గలవు. కావలసిన అర్హతలలో, సాగెడి కాలములలో, ఇచ్చెడి వేతనములలో, చూపెడి ఆదరణలలో విరమించిన పిమ్మట జూ పెడు, భద్రతలలో తారతమ్యము గలదు. నియమింప బడువారి భేదములవలెనే నియమించువారిలో కూడా భేదములుండును. కాలక్ర్మమున, నియమించువారు, నియమింపబడువారు- ఈ రెండు తెగలును, తారుమారగు చుండును.

ప్రతియుద్యోగస్థుని కర్తవ్యము: తనకు ప్రత్యే కింపబడిన విధులను, హృదయ పూర్వకముగా, దాపరికము లేక, నిర్వర్తించుట. వానికి ఈ నిర్వహణ పరిపాలనము నకై ప్రతిఫలము: తనకో తనకుటుంబమునకో పోషణము అనగా అన్నవస్త్రవసతి సంపాదన, ఆరోగ్యరక్షణము లేదా రోగనివారణము, ముసలితనములో సంరక్షణము, యాత్రాస్థల దర్శనము, కీడా సౌకర్యము, జ్ఞానసము పార్ట్ల నము ఈ సౌకర్యములు కలిగించు అవకాశమే వేతనము. ఇంతకు మించి, ధనమును లేదా పదార్ధమును, ధనముగా నిల్వ చేయుటకు కలిగించు అవకాశము వేతనాపహరణము.

ఈ ఆపహరణము రెండువిధములు. (౧) స క్ర మ రూపకము, (౨) ఆక్రమరూపకము. ఆర్ద్రమ రూపములు చోరీ, మోసము, దారిదోపిడి, యుద్ధములలో కొల్లగొట్టుట ప్రభుత్వోద్యోగములు, సుశిక్షితవృత్తులు మొదలగును. మొదలగునవి. సక్రమరూపములు' కృషి, వాణిజ్యము, ఇవియును లాభముకొరకైనచో అక్రమరూపక ము లే. ఈ తెలిపిన ప్రతిఫలము నియమించువారికిని నియమింపబడు వారికిని కావలసియేయున్నది. అయ్యది కనీసము సృష్టిలో సహజముగా పశుపక్ష్యాదులకు గూడ కొంతవరకు లభ్య మగుచున్నది.

ఈ సిద్ధాంత మంగీకరించినచో ఇతర విధముల పై సౌకర్యములు కలవారు, మరల అట్టివానికై గాని లేదా వేతనా పహరణమున కై గానరాదు. అట్లు ప్రయత్నించు చేతనావసరము కలవారితో పోటీ చేయుటయు