పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/24

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

పోలేదు. ప్ర్రాశస్త్యముపై దృష్టి మరలలేదు. ఆధునిక విజ్ఞానకోశమనఁదగు, ఆంధ్రగ్రంథమును సంపాదింపఁ జూచుటకంటె, షేక్సుపియరు కవి, ఆంగ్ల నాటకములను సంపాదించవలెనను కుతూహల మింకను కుంక నారం భింప లేదు. కర్తవ్య మేమి?

నేఁడు దేశమునందు రాజకీయవిప్లవ మేమియును లేదు. వాతావరణము శాంతముగ నున్నది. ప్రశాంతచిత్తవృత్తి కార్యక్రమము నిర్ణయించుటకు సావకాశము లభించి నది. రాష్ట్ర పరిపాలనము ప్రజాప్రతినిధుల హస్తగత మైనది. ప్రజోపయోగ కార్యక్రమనిర్ణయమునకును, నిర్వహణము నకును గూడ అదను సమకూడినది. గ్రంథాలయాధి కారు లును, గ్రంధాలయోద్యమ ప్రచారకులును, “నాది - నా యనుశబ్దమును మఱచిపోయి గ్రామ, పట్టణ, తాలూకా, జిల్లాల అభిమానములను వీడి, విశాలాంధ్ర దృక్పథమున కర్తవ్యనిరూపణమునకు పూనవలసియున్నది.

కే.ద్రగ్రంథాలయము.

(౧) ఈకర్తవ్యనిరూపణమున ప్రధాన స్థానమువహించున దిది. ఈ కేంద్ర గ్రంథాలయమే పరిశోధన గ్రంథాలయముగ కూడ నుండవ లెను. (Research Library) ఈ కేంద్రగ్రంధాలయము ప్రాచీన శాస్త్ర సంబంధపుస్తకములను, ఆధునిక రాజకీయార్థిక సమస్యలకు సంబంధించిన పుస్తకములను మాత్రమే సంపాదింపఁదగును, ప్రాచీనశాస్త్ర పరిశోధనము చేయఁ గోరువారికిని, ఆధునికార్థిక రాజకీయశాస్త్ర పరిశోధనములు చేయువారికిని ఈ కేంద్ర గ్రంధాలయ మొక్కటే సమస్త సౌకర్యముల నొనఁఁగూర్పఁగలిగినదిగా నుండవలయును. నేఁడు ఆంధ్రదేశమునందుఁగల సమస్తగ్రంధాలయముల యందునుగల ఆర్థిక రాజకీయ సంబంధ పుస్తకములును, ప్రాచీనశాస్త్రగ్రంథములును, ఈ కేంద్ర గ్రంధాలయమున కేంద్రీకరింపనగును. అచ్చువడని తాటాకు పుస్తకము లన్ని యు, విద్యావిభాగమునకు జెందియున్నను, కేంద్ర గ్రంధా లయమునందే పదిలపఱుపఁదగును. వీలు వెంబడిని కేంద్ర గ్రంథాలయ మట్టి వ్రాతప్రతులను అచ్చువేయించి ప్రచా రమునకు దీసికొని రాఁదగును.

(అ) ఈ కేంద్ర గ్రంథాలయము నుండి జిల్లా గ్రంథా లయములును వ్యక్తులును గూడ పుస్తకములను తెప్పించుకొనుచుండఁదగును. కేంద్ర గ్రంథాలయము పుస్తకములను ఎరవిచ్చు గ్రంథాలయము (Lending library) గూడ పని చేయవలయును,

(3) కేంద్ర గ్రంథాలయము, జిల్లా గ్రంథాలయ ములు తెప్పించుపు సకములను నిర్ణయించుటకు సంపూర్ణాధికారము కలిగి యుండవలయును.

జిల్లా గ్రంథాలయములు.

౧ ఆయా జిల్లా ముఖ్యపట్టణములయందుఁ గల గంథా లయములు, జిల్లా గ్రంథాలయములుగ పనిజేయఁదగును.

౨ ఈ జిల్లా గ్రంథాలయములకు గ్రామగ్రంథాల యములు అనుబంధ గ్రంథాలయములుగ నుండఁదగును.. గ్రామ గ్రంథాలయములపై జిల్లా గ్రంథాలయములకు పరిపాలనా, పరిశీల నాధికారములు రెండును నుండఁదగును.

3 జిల్లాగ్రంథాలయము అన్నిటికి ఒక ప్రణాళిక యుండఁదగును. ప్రతిజిల్లా గ్రంథాలయమునందునను, అన్నిరకముల పుస్తుకములును ఉండరాదు. ౧ ఒక గ్రంథా లయము భాషావిషయక గ్రంధములను ౨ మఱియొక గ్రంథాలయము మతవిషయక గ్రంధములను 3 ఇంకొక గ్రంథాలయము వ్యవసాయ పారిశ్రామిక విషయక గ్రంధములను ర వేరొక గ్రంథాలయము పురాణేతిహాసవిష యక గ్రంధములను మాత్రము తెప్పించుకొనఁ దగును. ఈ విధముగ ఒక్కొక్క జిల్లా గ్రంథాలయ మొక్కొక్క తరగతి గ్రంథములను మాత్రమే సేకరింపఁదగును. ఇటి విషయవిభాగమునకు సంబంధించిన గ్రంథములను సక్రమ ముగ తెప్పించుకొనున ట్లొనరించుటకే కేంద్ర గ్రంథాలయ మునకు జిల్లాగ్రంథాలయములపుస్తకములు నిర్ణయము పై నధికారముండుట ఆవశ్యక ము . 3 శ ఆయా గ్రంథాలయములయందుఁగల పుస్తకము అన్నింటిని పరిశీలించి, విషయ విభాగము ననుసరించి, వివిధజిల్లాగ్రంథాలయములలో కేంద్రీకరింపఁదగును. ఏ గ్రంథాలయమునందు, విషయములకు సంబంధించిన పుస్తకములు నేఁ డధిక ముగ సేకరింపఁబడియున్నవో ఆ గ్రంథాలయమున కావిషయక పుస్తకములన్నింటిని, ఇతర గ్రంథాలయము లిచ్చి వేయవలయును. X జిల్లా గ్రంథాలయములు గ్రామ గ్రంధాలయము లకు పుస్తకముల నెరవిచ్చుచుండవలయును.

గ్రామ గ్రంథాలయములు.

౧ గ్రామ గ్రంథాలయములు ప్రజాసామాన్యము నకు పనికివచ్చు పుస్తకములు కలిగియుండవలయును.

౨ ఆధునిక విజ్ఞానప్రదములగు గ్రంథములను తెప్పిం చునట్లు చూడవలయును. ఈ విధముగ గ్రంథాలయప్రణాళికను, నిర్ణయించు కొనుచో ఆంధ్రదేశమునందు, గ్రంథాలయోద్యమము సక్రమమార్గమున అభివృద్ధి చెందఁగలదు. ఇందులకు కేంద్ర గ్రంథాలయస్థాపన మత్యవసరము గాన కేంద్ర గ్రంథా లయస్థాపనమునకై గ్రంథాలయోద్యమాభిలాషులందఱును సత్వరముగ తగుకృషి సల్పెదరుగాక !

వందేమాతరం.