పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/19

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వింతలు - విడ్డూరములు

చచ్చినవారిని బతికించు ప్రయత్నము

చావనఁగా ఏమి ? చచ్చిన వారిని మరల బ్రతికించుటకు వీలగునా? అను విషయములను తెలుపఁగల గొప్ప పరిశోధనమును పేరుపొందిన వైమానికుఁ డగు కల్నల్ లిండ్ బర్గ్ గారును, నోబెల్ బహుమానము పొందియుండిన డా॥ ఎలె క్సిస్ కెరల్ గారును, బిటెన్నీ తీరమున జనులు లేని సెంట్ గిల్డాస్ ద్వీపములో చేయుచున్నారు. విజ్ఞానబలమువలన గుండెకాయను తయారుచేసి, దానివలన చచ్చిపోయినతరువాతకూడ మను ష్యులు బతికియుండునట్లు చేయు యంత్రమును సిద్ధ పఱు చు చున్నారు. గ్రంథులను (గ్లాండ్లను) చెడిపోకుండ ఉంచి, తలఁచుకొన్నప్పుడు చచ్చి పోయిన వారి అణువులను (టిస్యూలను) ప్రాణ సహితములుగా చేయుటయే ఈ పరిశోధనో దేశము. ఈ ప్రయత్నము ఫలించు నెడల పెక్కేండ్లక్రిందట చచ్చినట్లు అగపడు జంతు వును కూడ బ్రతికింప ఏ లగును. తమ యిష యిష్టమును బట్టి మూర్ఛావస్థయం దుండఁగలస్థితియు, చైతన్యము కలిగి యుండఁగల స్థితియు, దీనివలన రావచ్చును—అని డా॥ కెరల్ గారు తెలిపిరి. కొన్ని నెలల క్రిందట పై విజ్ఞాను లిరువురును తాము తయారు చేసినహృదయమును చూపి నపుడు శాస్త్రజ్ఞులు నివ్వెఱపడిరి. బ్రతికియున్న జంతువునుండి తీసిన అవయవమును ఆ జంతువు చచ్చిపోయిన పిమ్మట కూడ జీవించి యుండు నట్లు చేయుటకు ఈ హృదయమునకు శ కలదు. మనుష్యుని గుండెకాయవలె ఇదియు అవయవములకు నెత్తురు పంపుట మొదలగు పనులు చేయును. ఈ పరిశోధనము నెగ్గుచో 3 ఒక జంతువునుండి తీసిన మెదడును అది చని పోయిన పిదప కూడ జీవసహితముగా చేయు టకు వీలు కలుగును. (యునైటెడ్ స్ట్రెస్ నుండి ఆంధ్రపత్రిక కైశొనిన దానినిబట్టి.)

సమాధిని విడఁగొట్టుబ చే మూగి అగుట.

కొమురికొండ ప్రదేశనివాసి ఒక ముస్లిము, తన చెల్లెలిని పాతి పెట్టినపుడు పొరపాటున చాల డబ్బున్నసంచి కూడ మంటితో కప్పివేసినట్లు జ్ఞాపకమురాఁగా, సమాధి విడఁగొట్టి చూచెద నని మతగురువు నడిగెను. 3 రోజులలోపల అటు చేయరాదని ఆయన చెప్పెను. మతగురువు ఆ సంచి తాను అపహరించుటకు ఇట్లు చెప్పెనని అనుమా నపడి, మన్ను తీసి వేసి తనసంచిని తీసికొని, మరల మన్ను పోసి కప్పుచుండెను. అపుడు తనచేయి శవముతలకు తగులఁగా వెంటనే విద్యుచ్ఛక్తివం టిది నరములకు కొట్టినట్లయి, అతఁడు ని శ్చేష్టుఁ డై, పడిపోయెను. ఆసుపత్రికి కొనిపోఁగా చాలసేప టికి స్మృతి వచ్చినది. కాని అతఁడుమాట లాడలేక పోయె. మూగివానివలె ఉన్నాఁడు. a (అ. పె. వార్త ఆంధ్రపత్రికలో నున్నది.)

విమానముల వేగము

ఒకనాఁడే లండనులోచలిది, ప్యారిసులో చిఱు తిండియుతిని, బెర్లినులో భోజనము చేయవచ్చును. రష్యన్ విమానములు 3 మాస్కో నుండి క్యాలిఫోర్నియాకు 2,000 మైళ్ళు నడుమను ఆఁగకయే ఎన్ని ఉపదవములకు లోనయినను 6 దినముల ౧ర గంటల నిమిషము