పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమ్మవార్లు రక్తమును త్రాగు రాక్షసులా? దేవతలా?

శ్రీ వేలం వెంకటరమణగారు, జీవకారుణ్యవచారకులు, అనకాపల్లి.

మనము పూజించు గ్రామ దేవతలు రక్తపానము చేయు రాక్షసులా అమృతాహారు లెన దేవతలా యని యోచించి చూచిన గాని యెడల అమ్మవార్లు దేవతలని తెలియుచున్నది. మనహిందువులు అమ్మవార్లను దేవతలని పూజ సేయుచున్నారుగాని రక్తమును త్రాగు రాక్షసులని గాని పీనుగులను దినుపిశాచులని కొలుచుట లేదు. మనహిందూ దేశములో ఎచ్చో టనైన ప్రజలను అమ్మవార్లు దేవతలా రాక్షసులా యని ప్రశ్నించిన దేవతలనియే చెప్పు చున్నారు గాని, రాక్షసులని చెప్పుట లేదు. దేవతలకు ఆహారము అమృతముగాని రక్తమాంస ములు ఎన్నటికిని కావు. దేవతలు కూడ ర క్ష మాంసముల దిను రాక్షసులే అయినచో వారిని మనము పూజింపవలసిన అవసరమే లేదు. కాని మాటవరుసకు దేవతలు కూడ రక్తమాంసము లనే కోరుదు రనుకొందము. అప్పుడు గ్రామ దేవతలకు రక మేకదా కావలెను. ఏ రక్తమైన నేమి? పులి, పిల్లి, కుక్క, నక్క, శ్రద్ద, రాబందులలో మాత్రము రక్తము లేదా ? వాటిని? అమ్మవార్లకు బలియియ్యరు ఎందుకు మాంసము మనము తినము గనుక. వాని

ఇందువలన తేలిన దేమి మానవుడు ఏ వస్తువు తినుటకు అలవడినాడో ఆవస్తువునే అమ్మవార్లకు మొక్కుచున్నాడు గాని తాను తిననటువంటి పిల్లినిగాని కుక్కను గాని, గ్రద్దనుగాని మొక్కడు. ఈ నిదర్శనమును బట్టి జూచిన మానవుడు తన వాంఛను తీర్చు కొనుట కే అమ్మవారి పేరు పెట్టి జీవులను చంపు కే చున్నాడని స్పష్టమగుచున్నది. అమ్మవార్ల పేరు చెప్పి అమాయకములగు మూగజీవులను చంపు వారు రెండు పాపములను సంపాదించుచున్నారు. మొదటిది ఒక ప్ర్రాణిని ఏ కారణము చేతనైన హత్యచేయుట. రెండవది పవిత్రమైన దేవత బలిని కోరినదని నెపము కల్పించి, నోరులేని మూగ జంతువులగు కోడి, గొట్టె, మేకలను బలి యిచ్చి ఆమెకు కళంకము తెచ్చుట. కొంతమంది విద్యావిహీనులకు అజ్ఞానులకు నోరులేని ఈ మూగజంతువులను అమ్మవార్లకు బలియిచ్చిన కోరికలు నెర వేరుసని గుడ్డి నమ్మకము. అమ్మ వార్లకు కోళ్ళను, మేకలను, దున్నలను బలి యిచ్చి నిజముగా కోరికలు తీర్చుకొనగల యెడల పూర్వము మహాఋషు లందరును వందల కొలది సంవత్సరములు అహోరాత్రము లన కుండ తపస్సు చేయవలసిన అవసరమే లేదు. అదియును గాక ప్రస్తుతము మన కనులయెదుట కన్పడుచున్న దేశసేవా పరాయణులును స్వరా స్వాతంత్ర్య కాంక్షతో తహతహలాడుచున్న జవహరిలాల్ నెహ్రూ, బాబురాజేంద్రప్రసాద్, నారీశిరోమణియైన సరోజినీ దేవి, మహాత్మా గాంధి మున్నగు మహనీయు లందరును స్వరా జ్యసంపాదనకై ఎన్నో గొజ్జెలను, మేకలను, కోళ్ళను, దున్నలను బలియిచ్చి స్వరాజ్యమును తెచ్చియే యుందురు. అమ్మవార్లకు జంతువు లను బలియిచ్చి కోరికలు నేర వేర్చు కొందమన్న మాట సంగీతమునకు చింతకాయలు రాలు న న్నట్లున్నది.

అమ్మవారిదయను పొందవలెనన్న అహింస, ఇంద్రియనిగ్రహము, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము - అను ఎనిమిది