పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/38

ఈ పుటను అచ్చుదిద్దలేదు

156

భ్రమరాంబా మల్లేశ్వర గ్రంథాలయము 3 బెజవాడ 24-12-27 నుండి 30-4-35 వరకు చరిత్రలోని కొన్ని విషయములు ఈ గ్రంథాలయము శ్రీ రౌద్రి నామ సంవత్సర అశ్వ యుజ శు ౧౦ లు శుక్రవారము సరియగు 1920 సం అక్టోబరు 22 తేదీన ప్రప్రధమమున శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి సన్నిధిన ఒక చిన్న గదియందు, త త్సే వాసమాజము తరఫున పొట్టి వెంకట సుబ్బయ్య గారి చే నెలకొల్పబడి నానాటికి శుక్లపక్ష శీతభానునిపగిది కళలను సేకరించుకొని బాలారిష్టములను గడచి, నూతన వికాస మున నుప్పొంగుచు సహజ కాంతులచే ప్రజల హృదయ ముల నాకర్షించి ముద్దుబిడ్డయై ప్రవర్తించుచున్న కాల మున దీని భావివృద్దిని కోరిన పెద్దలు కొందరు నము చేయ నంతకంతకు శోభితమై పొడగ ది 31-7-1924 తేదీకి సరిఅయిన రక్తాక్షి నామ సంవత్సర ఆషాఢ బ 30 లు గురువారము రోజున పౌగండోత్సవ మున అత్యుత్సాహముతో విరాజిల్లెను. అప్పటినుండియు నీ సంఘమునకు స్థాయి చిక్కినది. శ్రీ కన్యకాపరమేశ్వరీ అన్న సత్రము కమిటీవారి ఆదరణచే విశాలమైన భవనము ఉపలాల చ సంపాదించి పఠనాలయమున కనువగురీతిని పరికరములను సేకరించినది. ఈ సంస్థ పలువురు ఉద్దేశముల కనుగుణముగ 1890 సం॥ 21 ఆక్టు నను గురించి 1933 సంవత్సరములో రిజష్టరు చేయబడినది. గ్రంథములు. ఈ గ్రంథాలయమునందు పలువిధము లైన ఆర్థిక, రాజ కీయ, పారిశ్రామిక, నైతిక, మత గ్రంథములు పెక్కులు గలవు. లోగా 1927 డిసెంబరు 23 తేదీవరకు నున్న రు 1826-00 లు విలువగల 1389 గంధములుగాక నూత నముగా రు 2250-0-0 లు విలువగల 2470 గ్రంథములు, రు 380 లు విలువగల 197 పత్రికా సంపుట ములు చేకూర్చబడినవి. ఇందులో పలువురు దాతలు ఉచితముగా సంఖాభివృద్ధి ననుసరించి సమర్పించిన గ్రం 36 ధములను కొన్ని గలవు. ఇందులకు వారెంతయు మాకు ప్రశంసార్హులు. బాల శాఖ పిల్లల యొక్క, ఉపయోగము ననుసరించి, ప్రత్యేక గ్రంధములును, వినోద పరిశ్రమల ద్వారా బుద్ధిని విక సింప జేయు క్రీడాసాధనములును చేకూర్చబడి యున్న వి. భవనములు, కట్టడములు ఈ కార్యస్థానము శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీవారు ప్రసాదించిరి. దీనికి విద్యుద్దీపములును, నీటి పైపును, ఒక చిన్న తోటయు కలవు; పత్రికలు, ప్రేక్షకులు - హిందీ పాఠశాల. (1) ఈ గ్రంథాలయమున 3 దినపత్రికలు, 15 ద్వై వార, వార, పక్ష, పత్రికలు, 21 ద్విమాస, మాసపత్రి కలు తెప్పించబడుచున్నవి. ప్ర్రజల సౌక ర్యార్థము ముఖ్యపత్రికలు కొన్ని సంవత్సర సంపుటములుగా నొనర్చి శాశ్వతరికార్డు క్రింద నుంచి తిమి. 1920 సం|| డిసెంబరు మొదలు ఆంధ్ర దైనిక పత్రిక మాససంపుటములుగ ను, 1927 సం॥ మొదలు సమదర్శిని పత్రిక చాతుర్మాస సంపుటములుగను నేర్పరచబడి యున్నవి. (2) ^ ంథాలయమందు 1927 డిసెంబరు 24 తేదీ మొదలు ది 30.4-35 వరకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య సగటున రోజు 1కి 55 గురు చొప్పున 1,33,009 అయియున్నది. గ్రంథములు చదువుకొన్న వారి సంఖ్య రోజు 1కి 25 గురు చొప్పునను కలదు. ఇందులో పరాయి గ్రామస్థులకుకూడ పఠన సౌకర్యముల ననుసరించి గ్రంధము లింటికి, తీసుకొని వెళ్లుటకు తగిన వసతు లేర్ప రూపబడినవి. 3