154
ఐర్లండులో గ్రంథాలయోద్యమము
(శ్రీ గో. రాధాకృష్ణమూర్తిగారు బి. ఏ )
Ι
'మొదటిమాటలు
ఐర్లండు ఒక ద్వీపము. ఇది ఇంగ్లండుకు పడమట కొం
చెము పైగా ఉత్తరాన ఉన్నది.
దీన్ని ఇంగ్లండును స్కాట్లండును కలిపి గ్రేట్ బ్రిటన్
అనిఅంటారు, ఇదంతా ఇదివఱకు ఇంగ్లీషువారి ఆధిపత్యము
లోనిదే. ఐర్లండు వైశాల్యం 23,582 చదరపు మైళ్లు.
ఇందలి మొత్తము జనసంఖ్య 4,256,561.
15 ఏండ్ల ంద చెల రేగిన రాజకీయ విప్లవఃసువలన ఈ ద్వీపము రెండు భాగాలైనది. అవి దక్షిణ ఐర్లండు, -దీని నే “ఐరిష్ స్టేట్,” అంటే ఐరిష్ ప్రజాస్వామికము, అని అంటారు. ఉత్తర ఐర్లండు - దీన్ని అల్ట్బర్ అని కూడ అంటారు.
ఐరిష్ ప్రజాస్వామికము పుట్టి 12,13 ఏండ్లయినది. దీనికి ముఖ్యపట్టణము డబ్లిన్ నగరము. దక్షిణ ఐగ్లండు వైశాల్యం 26,600చ మైళ్ళు. దీనిజన సంఖ్య 3,000,000. వీరిలో నూటికి 99 మంది రోమన్ కాథోలిక్కులు. అనగా క్రైస్తవ ప్రాచీన సాంప్రదాయకులు. డబ్లిన్ నగరములో 317,000 మంది ఉన్నారు. ఉ త్తర ఐర్లండు. ఇది ఇంకను బ్రిటిష్ వారి యాజ మాన్యంక్రింద నే ఉన్నది. దీనిని ఈ ఉత్తర ఐరిష్ వా రే కోరుకున్నారు. ఇందులో అందరూ ప్రొటెస్టెంట్లే. అంటే వీరు రోమన్ కాథోలిక్కులకు భిన్నులు. ఈభాగపు వైశాల్యము 69,82.2 చ॥ మైళ్లు. ఇంద లిజన సంఖ్య 1,256,561. దీనికి ముఖ్యపట్టణము బెల్ ఫాస్ట్ నగరము. దీనిలో 415,151 మంది ప్రజలున్నారు.
ఈ క్రింది వ్యాసము రెండు భాగాలుగా చేయబడినది. మొదటిదానియందు ప్రజాస్వామిక ఐర్లాండులోని గ్రం థాలయోద్యమమునుగూర్చి వ్రాయబడియున్నది. రెండవ దానిలో ఉ త్తర ఐర్లాండులోని గ్రంథాలయ చరిత్ర చేర్చ బడినది. దీనిని చదివినవారు, ప్రజాస్వామిక ఐర్లాండులో గ్రం థాలయముల స్థితి ఉత్తర ఐర్లాండు వానికన్న మిన్నగా ఉన్నదని గ్రహింపగలరు. దీనికి కారణము కూడా వారికి వెంటనే గోచరించును. ప్ర్రాచీనదశ ఐరిష్ ప్రజాస్వామ్యము పుట్టి 10,12 సంవత్సరముల కన్న మించదు. కాని ఆ దేశపు గ్రంథాలయములు పుట్టి 1500 సంవత్సరములపైన ఐనది. మొట్టమొద టిగ్రంథాలయము క్రీ॥శ॥ 1020 నాటి దని కొన్ని నిదర్శనముల వలన తేలుచున్నది. "మిడిల్ ఏజస్ 1 లో పశ్చిమ ఐరోపాఖండ మంతటికిని ఐర్లండు విద్యకు ఉనికిపట్టు, అప్పట్లో డబ్లిన్ నగర మందలి భాండాగారములందు 670599 ఐర్లండుకు సంబంధించిన పుస్తక సముదాయ భద్ర పరుపబనది. అవే తరువాత వానికి బీజములైనవి, వీనియందు ప్రాచీన మైన వ్రాత ప్రతులు, చారిత్ర విష యక మైనట్టివి, సాధారణముగ దొరకనట్టి గ్రంథములు నిలువ చేయబడినవి. మంతా అప్పటి డబ్లిన్ నగరమందలి గ్రంథాలయములు చాల వఱకు పబ్లిక్ లైబ్రరీలు. అందఱి అందు బాటులో నుండి, అందఱి వినియోగారము ఏర్పడి నప్పటికిని ఆకాలములో వానికి ప్ర్రాపకము చాల తక్కువ. P
ఉద్బోధన బీజములు ప్రజలలో గ్రంథాలయములయందు మంచి అభిప్రా యమును కలుగ చేయవలెను. వాని ఉపయోగమును వారు అవగాహనము చేసికొనవలెను. ఇట్టిపని చేసినవారలలో ప్రధముడు, ముఖ్యుడు, థామస్ డేవీస్ అను నాతడు. దేశములు భాగ్యోదయమునకు మంచి పాఠశాలల స్థాపనము ముఖ్యము; వానికన్ని ధర్మపుస్తక భాండాగారములు మరింత ముఖ్యములు అని డేవీస్, తది తరులు బాగుగ గ్రహించిరి. a మంచి గ్రంథాలయస్థాపనము నెదుటమానవునితదితరము లైన మన కార్యములు దిగదుడుపుకైన పనికి రావని డేవీస్ ఒకా నొకప్పుడు ఆనియున్నాడు. తాను “ నేషన్ పత్రిక యందు ప్రజలకు ^ ంథాలయోద్యమావసరము గూర్చి మిగుల ఉద్బోధన చేసి నాడు. అప్పుడప్పుడే దక్షిణ ఐర్లం 1. క్రీ॥ శ॥ 1000-1400 మధ్య కాలమునకు ఐరోపా దేశచరిత్రలో "మిడిల్ ఏజన్' అని అందురు..