152
32 పాఠశాలలు - గ్రం థాలయములు (శ్రీయార్లగడ్డ శ్రీకృష్ణ చౌదరి గారు, రేపల్లెతాలూకాగ్రంథాలయ సంఘాధ్యక్షులు.) ఒకనాఁడు సర్వప పంచమునకు జ్ఞానభిక్షఁ బెట్టిన భార త దేశ ము - పశ్చిమ దేశము లన్ని యు గాఢాంధ కారములో మునిఁగియున్న పుడు జ్ఞానజ్యోతిని ప్రకాశింప జేసిన భారత దేశము అనాగరికులై గొడ్డుమాంసము దినుచున్న జాతికి సహితము జ్ఞానోదయము గలుగఁజేసిన భారత దే శ ము - ఋషీశ్వరులకును, త్యాగులకును, వీరులకును ఆవాసమైన భారత దేశము - పతివ్రతాతిలక ములకును, వీరనారీ మణులకును పుట్టినిల్లని కీర్తి గడించిన భారత దేశము ఏమైనది? తారుమారైనది. తలకిందులైనది. బానిసత్వ మనుభవించుచున్నది. దీనికి విమోచన మెట్లు! మార్గ మెద్ది? గమ్యస్థాన మెక్కడ? అని విచారించుచో రెండేమార్గములు: పాఠశాలలు- ంథాలయములు. జాతీయభావములును స్వ దేశభ క్తి యుహృత్కమలమునజీర్ణించిపోయిన, ఉపాధ్యాయబృందము పాఠ శాలలకు సంప్రాప్తము గావలెను. శాంతస్వభావము, వినయనమతలు, విద్యాసంపన్న త, దాస్యవి మోచనమునకు మార్గా న్వేషులగు యువకరత్నములు, గ్రంథాలయము లకు గావలెను.
“అండ్రూ కార్నీజి" యను ధనికుఁ డెన్ని యో గ్రంథాలయంబులు నిలిపి ప్రోత్సాహపఱ చెను. అట్టిమహనీయు లీ దేశమున కొరతవడుట మన దురదృష్టమని తలఁచవలెను. గ్రంథాలయంబుల సంఖ్యగూడ మన దేశమున బహుస్వల్పముగ గోచరించుచున్నది. ఒక్క బరోడా రాజ్యములో గ మాత్రము శారదా దేవి రాజుయొక్క యాద రణముబొందఁగల్గినది. ఆ రాజ్యములో ప్రతియొక్క పాఠ శాలలో గ్రంథాలయ మున్నట్లు తెలియు చున్నది. పాఠశాలకు సంబంధములేని యితర గ్రంథాలయముల నెన్ని యో రాజాగారు పోషిం చుచున్నారు ఆటనున్న కేంద్ర గ్రంధాలయ ములనుండి జిల్లా, తాలూకా, గ్రామ గ్రంథాల యముల కెంతయు సహాయసంపత్తి గలదు. మ్యా జిక్ లాంతర్ల వల్ల నేమి, చిత్రలేఖనము వల్లనేమి, యా గ్రంథాలయములు ష్త్రజల నాకర్షించుచుం డును. స్త్రీశాఖ, బాలశాఖయను విభజనలుగూడ ప్రతి గ్రంథాలయమందుఁ బొడగట్టు చుండును. ఇట్టిసత్సంకల్పముతో గ్రంథాలయోద్యమమునకు దోడ్పడుచున్న బరోడా మహారాజగు శ్రీశ్రీశ్రీ 'శాయాజీగయ క్వార్ ' మహాశయు లెంతయు ధన్యులు. మరపురాని సచ్చరిత్రలో శ్రీవారి నామము సువర్ణాక్షరములతో విలసిల్లుచుండును. బరోడా రాజ్యమును తిలకించియె శ్రీ తిరు వాన్కూరు మహా రాజాగారు గూడ తమ రాజ్య మందు గ్రంథాలయోద్యమము విస్తరింపఁజేయు టకు ప్రయత్నించుచున్నారు. ప్రతి రాష్ట్రము నందును గ్రంథాలయోద్యమమునకు తమజీవిత సర్వస్వమును గూడ ధారబోసిన మహామహులు కొంద రుండబట్టియె శారదా దేవి సజీవముతో నుండఁగలిగినది. 1910 - 11 సం॥ లో యాంధ్ర రాష్ట్రమున గ్రంథాలయోద్యమము ప్రారంభింపఁబడి దినదినాభి వృద్ధి బొందిన మన