149
29 - -
- పలుకుమనుగడ - తెనుఁగు
(శ్రీమా రేపల్లి రామచంద్రశాస్త్రి గారు) "గ్రుడ్డిగా ఏవికాని కైకొనను; తప్ప నిసరిగా వచ్చియున్నవి నిలుపువాఁడ; క్రొత్తవియు కూర్తు; పెఱవి కైకొందు; ఇటుల పరఁగు నుడులవాడుక నాదు వ్రాతలందు” మన పలుకుతల్లి తెనుఁగు. కనుక, దాని పుట్టు పెంపులను గూర్చి తెలిసికొనుటకును- వీలగునంతవఱకు ఇంకను దానికి ఇంపుసొంపులు సమకూర్చుటకును - కావలసినవి చేర్చి వాసి తెచ్చుటకును కడింగుట, తెనుఁగువారికి తప్పని పాడి. కాని, ఈ పని ఇంతకు ముందు సరిగా జరిగినదని కాని, ఇప్పుడు జరుగుచున్నదనికాని - చెప్పుకొని, ఉప్పొం గుటకు మనము నోచుకొనలేదు. కాన, తెనుఁగుమీఁద 0 మన్నన కలవారు తమపాడి గుర్తించి, ఆది చేయుటకు డంగవలె. సరిగా తెనుఁగు మనుగడను గూర్చి తెలిసికొనుటకు ముందు, మొత్తముమీఁద పలుకుల మనుగడను గూర్చి కొంత తెలిసి కొనుట మంచిది. మనుగడలు 3 నాటి మనుగడలు వాయుటలో దిట్టలమని విఱ్ఱవీఁగు తెల్లవారికే, మందిమనుగడను గూర్చికాని - నేలమనుగడను గూర్చికాని పలుకుమనుగడనుగూర్చి కాని, ఇప్పటికి సరిగా తెలిసినటుల కానరాదు. ఆట్టిచో, మనుగడ వ్రాయు నేర్పే లేనివారని వారు వెక్కిరించు - ఇండియా వారికి పలుకుమనుగడ తెలియుట ఎట్లు? ఎల్లపలుకులకును తల్లి అని మనవారు కొందఱు తలంచు సంస్కృతమునకే నిండు మనుగడ లేకున్న యెడ, దాని పిల్లగా కొందఱు లెక్కించు తెనుఁగునకు మనుగడ లేకున్న వింత ఏమి? మనుగడలకు తక్కిన నాడులవా రిచ్చిన పెద్దఱికము ఇండియా వా రీయ 'లేదని ఒప్పుకొనక తప్పదు అవి వ్రాయుటలో తెల్లవారు మంచి నేర్పరులుగా ఉన్నారు. వారి వాఁతలు చూచి, నేర్చుకొని, ఇండియనులలో కొందఱు మంచి మనుగడలు వ్రాయుచున్నారు. కాని, ఇంకను ఒక లోటు కౌన వచ్చుచున్నది; ఎవరును ఉన్న పొత్తము లన్నియు అరసి, మనుగడలు వ్రాయుచున్నట్లు కనఁబడదు. కాన, ఇపుడైన మనుగడలు వాయువారెల్లరును 'సెక్రెట్ డాక్ టి)E' మొదలగు 'దివ్యజ్ఞాన సమాజము' వారి పొత్తములు సైతము చదివి, వానితోడ్పాటుతో మనుగడలు వ్రాయుట మంచి దాని తలంచెద.
- పలుకు
= - భాష; మనుగడ చరిత్ర. మందిమనుగడ పలుకులు మందితో డివి. కావున, పలుకుమనుగడ తెలిసి కొనవలయుననిన, ముందు మందిమనుగడ తెలిసికొనవలె. కాని, ప్రకృతి శాస్త్రములనే నమ్ముకొన్న తెల్లవారిలోని నెఱవాదులుకూడ, మంది ఎట్లు పుట్టిరో, ఎప్పుడు ఎక్కడ ఆపుట్టుక మొదలయ్యెనో, సరిగా తెలుపఁజాలకున్నారు. సంస్కృతపు వాంతలలో మంది మనుగడనుగూర్చి లేక పో లేదు. కాని, అది పలుచోట్ల - పలు తెఱంగులుగా కొనవచ్చును. అంతయు అరసి, నిజము తేల్చి, తెలుప గలవారు కానరాకున్నారు. దివ్యజ్ఞాన సమాజమువారు సం స్కృతపు పొ త్తములను - తెల్లవారి పొ త్తములను పరికించి మందిమనుగడను గూర్చియు - పలుకుమనుగడను గూర్చియు తేట తెల్లముగా వాటిని యున్నారు. కాఁబట్టి, వారు వ్రాసినది ప్ర్రాపుగా చేకొని, పలుకుమనుగడ టూకీగా తెలుపనగును. మంది ౭ తల్లి తెగలుగా ఉం దురు. ఒక్కొక తల్లి తెగలో 2 పిల్ల తెగలుండును. పిల్ల తెగ లనుండి కోవలును, వానినుండి కుదుళ్ళును, వానినుండి వంగడములును చీలును. మొదటి తల్లి తెగవారు వేల్పులు. వారికి మనపట్టున డెందమే లేదయ్యె. డెందములేనియెడు తలంపులే పుట్టవు; అవి పుట్టనిచో పలుకు పుట్టనేరదు. కాన, మన లెక్క ను బట్టి చూచునపుడు, వారికి పలుకే లే దన వలె. రెండవతల్లి తెగ వారితో సడి పంటకు (ధ్వనిభాష) మొద లయ్యె. ఏపలుకులో కాని అ-ఇ మొదలగు నిండులును, క్-గ్ మొదలగు అరలును ఉండును. తమంతతామే డుగా పలుక వీలగునవి నిండులు. సగమే పలుక వీలగునవి ఆరలు, నిండుల నే అచ్చు ?, ప్రాణములు, స్వరములు- అందురు. అరలను హల్లులు?, ప్రాణులు, వ్యంజనములు - అందురు. ఈ తెగవారు అ-ఆ మొదలగు నిండులే పాట పాడినట్లు పలుకుచుండెడివారు. అయినను, అవితలఁపులను సరిగా తెలుపకపోవుట చేతను, ఆరలు వారు వాడక పోవుట చేతను, వారిపలుకుతో మనపలుకునకు పోలిక లేదు; అందుచే దానితో పొత్తును లేదు. మూఁడవతల్లి తెగ వారికి-వినికిసోఁకుపసలకుతోడు చూపు పసయును చేరి, పెరుఁగతొడంగె. కాన వారు వెలి జగమును వెనుకటికంటే బాగుగా కనుఁగొనఁగ లిగిరి. 8