పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

132 గ్రంథాలయ సర్వస్వము

ముఖ్యవిషయములలో నొకేవిధముగనే యున్నను వివరములలో నోక పాఠశాల కును మఱోక పాఠశాలకును చాల భేద ముండవచ్చును.

కొన్ని పాఠశాలలకు సభ్యులే కాని భవనముండదు. ఏయద్దె యింటనో వారు వారమున కొకసారి సమా వేశమగు చుందురు. వయోజన పాఠశాలలన్నియు కొన్ని పాఠశాలలకుదివ్యభవనములున్నవి. అన్ని పాఠశాల లునుగూడ వారమునకొక సారియే సమా వేశమగుచుండును. కొలది పాఠశాలలకు వేసవి సెలవులుండును. పురుషులకును స్త్రీలకును సాధారణముగ వేర్వేరు పాఠశాల లుండును. మిశ్రమపాఠశాలలుగూడ కొన్నియున్నవి. ఈనడుమ వీని సంఖ్య పెరుగుచున్నది. అన్ని పాఠశాలలును ఆదివారము నా డుదయమున కూడును. స్త్రీల పాఠశాలలు కొన్ని మరొక సెలవుదినమున సాయంకాలము సమావేశమగుచుఁడును. ఈ నడుమ యువకుల ప్రత్యేక పాఠశాలలు గూడ చాలా పింప డుచున్నవి.

జాతీయవయోజనవిద్యాసమ్మేళనమువారు ప్రచురించు గ్రంధములో సంవత్సరములో సేవారమున నేవిషయమై పాఠము జరుగవలెనో నిర్ణయింపబడి యుండును. కాన నొక వారమున పాఠశాలలన్నిటిలోను నొకే విషయమై పాఠములు జరుగును. ఆయా పాఠశాలల సభ్యులును, కార్య నిర్వాహకులునుగూడ కొన్ని పాఠములను బోధించు చుందురు. ఇతర పండితులు నాహ్వానించి వారిచే నిర్ణీత విషయములపై నుపన్యాసము లిప్పించుట తఱచుగ జరుగు చుండును. ఇతరవిషయముల పైగూడ కొన్ని యుపన్యా సము లాదివారమునను నితరదినములలోను గూడ నరుదుగ గావింప డు చుండును. సాధారణముగ నడుపబడు నీ విద్యావిధానమే కాక కొన్ని పాఠశాలలలో కొన్ని విశేష నీ ములుకూడ కాననగును. నాట్యకళ, నాటకకళ, గానము, ---అటలు; గృహపరిశ్రమలు, తోటపనిమున్నగు నంశములను బోధించుటకు ప్ర త్యేక దినము లేర్పాటు చేయబడును. గ్రుడ్డి ప; వారు, విక లాంగులు మున్నగువారికి సేవ చేయుట కూడ కొన్ని పాఠశాలలలో కార్యక్రమములో చేర్ప బడినది. ఈ యుద్యమమునకు సంబంధించిన అంత రాతీయ సంఘమువా రీవిషయమై శ్రద్దగల కొలదిమందిని జట్టులు విదేశములకు తీసికొని వెళ్ళియు విదేశపు జట్టు లను తమ దేశమునకు రప్పించియు నంతర్జాతీయ దృక్పథ మును నంతర్జాతీయ సహకారభావమును వయోజనులలో గల్గించుటకు యత్నింతురు. స్త్రీల ప్రత్యేక పాఠశాల లలో గృహనిర్వహణము, శిశుపోషణము మున్నగునవి 12 కూడ నేర్పబడును. అట్లే యువకుల పాఠశాలలలో వారికి సంబంధించిన యంశములుగూడ కఱపబడును. అవసర ముల కనుగుణముగ విద్యావిధానమును సరిపెట్టుకొనుట పాఠశాలలలో నెల్ల నొక సుగుణముగ నున్నది. దీనికి తోడుగ స్వాతంత్య్రము, నిరాడంబరత్వము నను సవి గూడ ప్రతి పాఠశాల యొక్క వాతావరణములోను ప్రధానలక్షణములుగ గన్పట్టుట చే మొత్తము పైనిబ్రిటిషు వయోజన పాఠశాలలన్ని యు పూరమైన ప్రజాస్వామిక సిదానము పై నడుపబడుచున్నవని చెప్పవచ్చును.

సాధారణముగ ప్రతి పాఠశాలయు నొక యుదార పురుషునియొక్క గాని స్త్రీయొక్క గాని కృషి చే స్థాపిం పఒడు చుండును, పాఠశాలను స్థాపించు సంకల్పము తన కుగల్గినదని యెవరైనను లండనులోని జాతీయవయోజన పాఠశాలా సమ్మేళన కార్యదర్శులకు (30 బ్లూమ్సు బరీ వీథి) వాయుచో నా కార్యదర్శులు వెంటనే యీ పాఠ శాలలకు సంబంధించిన వాఙ్మయము నంతను పంపి నూతన పాఠశాల స్థాపింపబడుటకు సమ సమనవాక్సహాయమును చేయగలరు. ఏడేటాను నీటి పాఠశాలల నేకములు క్రొత్తగ స్థాపింపబడుచున్నవి. ఇందు శిక్షణమును పొందినవా రనేకులు ప్రజాహిత జీవితములో గణ్యతను పొందుచున్నారు. కొందఱు పెద్ద యుద్యోగములను గూడ నిర్వహించు చున్నారు, ఇట్టివా రొక రిద్దరు పెద్దసిటీలకు మేయర్లుగ గూడ నున్నారు. వయోజనవిద్యావ్యా ప్తికి మన దేశముననున్నంత యావ శ్యకత మఱి యే దేశములోను లేదు. అయిననుగూడ మన మీ విషయమన బిటను చేయుచున్న పనిలో లేశమును చేయుట లేదు. ఆంధ్ర దేశములో నిదివఱలో స్వల్పమగు ప్రయత్నము కావింపబడినది. 1929 వ సంవత్సరమున శ్రీశనివారపు సుబ్బారావు గారు మున్నగువారు తాడేపల్లి తాలూకాలోని యుపా ధ్యాయుల కొఱకు వసంతఋతు విద్యాలయమును నడిపిరి. మూడు సంవత్సరములనుండి శ్రీ గోగినేని రంగ నాయకులు గారు నిడుబ్రోలులో రైతాంగ విద్యాలయమును నడపు చున్నారు. క్రిందటి జూలై నుండి తాడేపల్లిగూ డెము తాలూకా కృష్ణాయపాలెములో వారమున కొక దినము చొప్పున ఏబది రెండు వారములు రైతాంగ విద్యాలయపు తరగతులు నడపడుచున్నవి. పైని వర్ణింపబడిన బ్రిటను లోని 52 వారముల ప్రణాళిక పద్దతి పైనే యీ తరగతు లుండును. ఇట్టి పాఠశాలల నెన్నిటినో పెట్టి నడపిన `నే కాని మన దేశము విద్యావిషయమున నభివృద్ధినొంద లేదు.