పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

h 9 విద్యార్థిని సోవియటు విద్వారిని చెప్పుకొను ముదుసలులు అబ్బురపుకథలుగా నట్టియు “కాజ్ బెక్ ” పర్వతశిఖరము మాపాద ములను తలధరించినది. విజయవినోదమున నొక గంట గడ చె. మా ధైర్య స్థైర్యములు దిట్టపడు టకు ఇది ప్రథమ సోపాన మాయెను.

నే నీ విజయమునుగురించి ఒక విద్యార్థుల సభ లో ముచ్చటించితిని. విద్యార్థులందరమును కలసి మరియొక సారి ' ష్త్రయత్నించుటకు ప్రోత్స హించితిని. ఇంతకన్నాను మిన్నయైన, ఏల్బజ్, అను శిఖరము ‘కాక్సస్ 'పర్వతములలో గలదు. ఆరుగురు కలసి ఆ శిఖరమును చేరవ లెనని నిశ్చయించితిమి.

ఏప్రిల్ 9వ తేది రాత్రి విద్యార్థి సంఘ సభ్యులు ఇద్దరు మాతో ప్రయాణమైరి. మాకు కై దండనొసగి, విజయాశీర్వాద మొనరించిరి. అధి కోత్సాహముతో పాటలు పాడుచు ఉల్లాసముగా కాలము గడుపుచుంటిమి. మానాయకు డగు “తిమాసునావు” పర్వతారోహణమును గురించి కొన్ని శాస్త్రసూచనలు జేసెను. మా కవయిత్రి “షూ రాపోల్టో రానేవా” ఆరోహకుల గూర్చి ఒక పద్యము రచించెను. ఏప్రిల్ 9 అంత యు 'ఎక్స్ట్రాజ్ ' పర్వతసమీపమున ఁటిగ్లింకి’లో విశ్రమించితిమి. రేడియోసంగీతము - మాండో లిన్ వాద్యము వ్యవసాయశాస్త్ర చర్చ - వీనితో కాలము గడపితిమి. అయిదుగంటలకు పరుంటిమి. అందరికిని ఎక్స్ట్రాజ్' మీదనే ధ్యాస; నిద్ర యేరికిని రాదు.

ఆరోహణపు టేర్చాట్లన్నియు పూర్తి అయ్యె. “సుప్ర నావు"తో భోజన సామగ్రి ఏర్పాటు కూడ చేసితిని.

భోజనానంతరముదుస్తులు ధరించి, శీతలమారు తమువీచుచుండ పర్వతారోహణమునకు బయలు పాదములును దేరితిమి. పోనుపోను వాతావరణ మననుకూల మయ్యె. పెద్ద సుడిగాలి వీచెను. శీతోష్ణస్థితి 30. డిగ్రీలు తగ్గాను. అతిశీతలము చే మంచుగడ్డలయ్యెను, ధైర్యము వీడక ఆమంచు కొండపై నడచినడచి “ఎలజ్" శిఖర పూర్వ భాగమును చేరితిమి .

అచట ఇరువై నిమిషములు గడపి పశ్చిమ శిఖరమువైపు పయన మైతిమి.

నాతో నాసహ కారి“నానిఝ సేవు" మరియు 'స్వేష్నికోవా' 'తిమాసునావు' ఈ మువ్వురు మాత్రము బయలు దేరిరి. పశ్చిమ శిఖరారోహ ణము మరింత ప్రమాదముతో కూడినది. క్షణ క్షణము గండమే. ఈ శిఖరము చాలా నిటారుగా ఉన్నది. పెద్ద పెద్ద మంచు గడ్డలు తోవకడ్డము. కష్ట పరంపరలు సహించి ఒక తాటి సహాయముతో ప్ర్రాకులాడి మూడు గంట లగుసరికి శిఖరము చేరితిమి. పూర్తిగా నలసితిమి. ఇది మరియొక నూతనవిజయము. “నిజమేనా ! శిఖ రము చేరినామా" అని “మరుషియా స్వేష్ని కోవా”నన్ను కౌగిటచేర్చుకొని ప్రశ్నించెను. కొంత సేపు అటుఇటు పచారు చేసితిమి. అక్కడ ఒక టోపీయు ఒక గాజుబుడ్డియు కనబడెను. ఆ బుడ్డిలో 1889 న సంవత్సరములో ఈ శిఖరము నెక్కిన కొందరు ఇటలీ దేశస్థుల పేర్లుగల కాగిత ముండెను.

“ సేవాసంరక్షణలకు సిద్ధము.” అని చెక్కిన ముద్రికను నేను ధరించితిని. పర్వతారోహణ బిరుదమును నాకు కలదు. సాహసాం కమును ధరింపవలె నను భావ ముదయించినది.

ఒకనాడు విద్యాలయ కార్యాలయమున కేగితిని. అక్కడ “ఓషివా” అను డైరక్టరును కలసి కొంటిని. “గాలిగొడుగుగంతులు వేయ నేర్చెదవా” అని ఆయన ప్రశ్నించెను.