పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/25

ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. 23 స్వర్గీయ నిడమర్తి లక్ష్మీనారాయణపంతులు. పంతులవారి సమకాలికులు, సహచరులు తో కులు శ్రీ కాళ్లకూరి నరిశింహ్వం పంతులుగారు, ఉండి గ్రామమందు శాశ్వత ధర్మసత్రపు నిర్మాణక ర్తలైన నడుం పల్లి సుబ్బారాయుడు గారు, భూపతిరాజు తిరుపతిరాజు గారు (కుముదవల్లి), గేడు గణనకెక్కిన వారిలో మోచర్ల రామచంద్రరావు, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరావు, శ్రీ మీర్జాపురం జమీందారు, పెద్దిరాజు, బాపిరాజు ప్రభృతులు, గ్రంథాలయ సేవ. పశ్చిమగోదావరిజిల్లాలో గ్రంథాలయోద్యమ ప్రచా గకులలో, మార్గదర్శకులు, ప్రప్రధములు (pioneers) శ్రీ పంతులు వారు కాళ్లకూరి నరశింహ్వంగార్లు. ఆయన చిన్నతనము నుండియు నైతిక, సాంఘిక, ఆర్ధిక, అథ్యా త్మిక, లౌకిక, పార లౌకిక, విషయములందు అ త్యున్న తాభిప్రాయములను గలిగియుండి దైవోద్దిష్ట మైన పరి వర్తనమునకు తీవ్ర కృషిసల్పి ఉన్నతశ్రేణిలోని సంస్కర ణాభిలాషులైగి, దినచర్యనుండి కొంతభాగము నిచ్చట నుదాహరింతును. 10-4-1914. ఈ రోజు వుదయము ఈ రోజువుదయ బెజవాడలో రైలు దిగి కాన్ఫరెన్సు పెండాలకు వెళ్లి కృత్యములు దీర్చుకొని స్నానం చేశి పుస్తుక భాండాగార సభకు వెళ్లి, 11 గంటల వరకువుండి అక్కడనుండి తిరిగి ఆంధ్ర మహాసభ పాకల లోకి వెళ్లి యల్లంరాజు శాస్త్రుల్లుగారింటిలో భోజనం చేసి తిరిగి పెండాల్కు రావడమైనది. మధ్యాహ్నంనుంచి పుస్తుక భాండాగారవిషయనిర్ణయ సభ అయిన తరువాత కొన్ని తీర్మానములు చేయబడినవి. 11-4-14 ఈ రోజు వుదయాత్పూర్వం లేచి కృష్ణా నదికి వెళ్లి స్నానం చేసికొని బ్యాండువగైరా వుత్సవముతో నున్నూ దేశీయకీ ర్తనలతోను అగ్రాసనాధిపతిగా ఉంటికి వెళ్లి వారిని సభకు తీసికొనిరావడమైనది... విషయ విచార సభీ 1 గంటకు కూడి విషయనిర్ణయ చర్యలో రాష్ట్రసభ విషయిక తీర్మానములనుగురించి చాలా చర్చజరిగి...... 5 గంటలకు కొన్ని తీర్మానములు చేశిమర్తబు చేయడమైనది. మరుసటిదినమునకూడ చర్చలందు పాల్గొని సాయంకాలము నకు స్వగ్రామమునకు తిరిగివచ్చిరి. 2-4-14 వీరు నిడమర్రు గ్రామమునందొక గొప్ప తటాకమును త్రవ్వించిరి. దాసికొరకై కాళ్లకూరి నర శింహ్వంగారు వగైరాలు నిండ్రకొలను మొద లైన పరిసర గ్రామములకు వెడలి సభికుల పోగు చేశి చందాలు వసూలు చేసిరి. బెజవాడలో జరిగిన ఆంధ్ర కాన్ ఫరెన్సుకు డెలిగేటుగా వెళ్ళి అందు ముఖ్యస్థానము నలంకరించిరి. 103 21-3-1914 రాజమండ్రియందు చిత, పు వెంకటచలం పంతులు గారి యధ్యక్షతను జరిగిన హిందూమహాజన సభకు హాజరై అందు కొన్ని ముఖ్య తీర్మానముల నుపపాదించడ మైనది. 1915, 16, 17, 18 సంవత్సరముల దినచర్య పుస్తకములు లభ్యము కానందున ఒకసారి నాలుగేండ్ల మహ తర చైత మహత్తర న్యోద్దీపకమైన జీవితభాగమునువదలి 19 సం॥॥కు గంతు వేయవలసివచ్చినది. స్వగ్రామమగు నిడమర్రు నందు సర స్వతీభవనం, సత్రం కట్టవలెనని సంకల్పం కలిగినది. దానికి ప్రయత్నము లారంభమైనవి. ఆయన మాటలనే వుదాహ రించిన స్వారస్యం కనుపడుతుంది. 27 12 1919 ఈరోజున మధ్యాహ్నముకు గంగాచలం (భవనములను కట్టిన వక్త్రంమేస్త్రి) ను అడవికొలను తీసి కొని వెళ్ళి కామరాజు గారి యింటి కల్పను చూపించినాను. బాగానే యున్నదనియును యీకల్ప సత్రం, గ్రంథాలయ భవనము రెండు కట్టుటకు సరిపోవుననియును చెప్పినాడు. అతనిని వద్దనుంచుకొని చి|| మంగయ్య వగయిరాలతో మాట్లాడి రేపటిరోజున పునాదులు యేర్పరచుటకు స్థిర పరచి యీరాత్రి కుముదవల్లి వెళ్లడమైనది. లు - q 28-12-1919 కుముదవల్లి ఈరోజు వుదయముకు కుముదవల్లివచ్చి 9 గంటలకు నగర సంకీర్త నము చేసి మందిర మందు ప్రవేశించిన వెంటనే స్వర్గస్తులైన కందుకూరి వీరేశ లింగం పంతులు వారి ఛాయాపటమును శ్రీయుత చిలక మర్తి లక్ష్మీనరశింహంగారి యధ్యక్షతను పనిచేసి వారి చే తెరపించడమైనది. ఈ సందర్భమున వీరేశలింగంపంతులు గారి జీవితమును గూర్చి నేను మాట్లాడడమైనది. 29-12-19 ఈ రోజున వుదయమే కుముదవల్లినుండి భమిడిపాటి సూర్యనారాయణగారి కోరిక మీద గునుపూడి లోయున్న గాఁధి గ్రంధాలయమును సందర్శించి మధ్యా హ్నం 3 గంటలకు సభ జరుపుటకై భీమవరం రావడ మైనది. సాయంత్రం 3 గంటలకు బహ్మశ్రీ తెన్నేటి లక్ష్మీనారాయణశాస్త్రిగారి యాధిపత్యమున గాంధీగ్రంధా లయమున సభజరుపబడి గ్రంథాలయావశ్యకతను గూర్చియు ప్రజలక ర్తవ్యము నుగురించియు న న్ను పన్యసింపవలసిన దని కోరగా ఉపన్యసించడమైనది. ఈ సందర్భంలో ఆయన ఉపన్యాసధోరణినిగూర్చి ముచ్చటించుటవసరము కాక పోదు. అతడుగొప్పవక్త. స్వర్గం గవ లెచిందులు త్రొక్కుచు మైమరపించే వాక్రవాహము ప్రేక్షకుల నెట్టిస్ధితికిగొనిపోయెడిదో అనుభవవైక వేద్యము, వీరిమానసిక తత్వమును తెల్పుట కీయొక్క విషయమే సాలీ పులాక న్యాయముగ బరగగలదు.