పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు

96

16 విశ్వగ్రంథాలయోద్యమము విద్వాణో కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు) ప్రజల నొకతొట నడిపించుటకు ముఖ్య సూత్రము కావలెనన్న నది వారిని బేమపాత్రులునుగా నొనర్చునది గాను, వారిజాతీయజీవనానుకూల భావమును గలించు సువి శాలమగు నాదర్శముతో రాణించునదిగాను నుండవలెను. ప్రభుదండనమున కేని యీ నీతిబలవర్దకము, విజ్ఞాన సూత్ర గ్రథితమగు శాసనము విప్లవనిరోధకమగుట చే సత్యుత్త మమును, శాశ్వతమునగును. ఒక జపమాలికలో గ్రుచ్చ బడిన యొకటవ పూసకును నూట యొకటవ పూసకు నెట్లు భేదము లేదో, ఒకే విజ్ఞానలక్ష్యమునకు సంబంధించిన వ్యక్తుల పరంపరలో భేదము లేదు. “శుని చైశ్వపాకేచ పండితాస్సమదర్శనాః” అన్న ప్రాచ్యుల విజ్ఞాన సూత్రము వ్యక్తుల నెవరిని భిన్న పఱచునదికాదు. ధనము, భోగము అను సంకుచితవిషయములనే పరమావధిగా బెట్టుకొందు మేని, యెవనియంతట వానికే ఐహిక విషయోపభోగవాంఛ అధికారవాంఛ మితిమీరి ముప్పు దెచ్చును. ధన భోగాదులు తమంత సంభవింపవలయు. అందులకు మురియనక్కర లేదు. లేకున్న విచారింపనక్కరలేదు. అప్పుడే మనలో విశ్వమానవ ప్రేమ మూర్తీభవించును. జ్ఞాన వ్యక్తి, కులము, జాతి మొదలగు భేద పరిభాష లన్ని యు విజ్ఞానలక్ష్యమున లయించిపోవును. ఈ లక్ష్య మీనడుమ కొన్నిశ తాబ్దములనుండి చెదరిపోయినది. అజ్ఞానాంధ కారము దేశము నావరించినది. స్వపర విభేద తంత్రము అధికారము వహించినది. కనుకనే మనలో పరాధీనత, సాంఘిక వైషమ్యములు, కులకక్షులు మొదలగు విషమభావ దుర్వాసనలు గమ్మి, జ్ఞానపరిమళము నణచివేసినవి. ధన భోగాదినీచతమలక్ష్యములకై సాకులాడుచు, శూన్యులైనపుడు, ఒక్క కంచమున గుడిచి, ఒక్క శయ్య పరుండిన సోదరులలోను వైరాగ్ని ప్రజ్వలించును. విజ్ఞాన ప్రచారమున గావలసిన యీ సాంఘిక పరిష్కారమును సాధనాంతరముల సాధింపజూచుట వ్యర్థము. ప్ర్రాచీన ర్ధము. ప్రాచీన నిద్దాంతము లన్నంతనే ఘనీభావము చెందు నూతన వీరా వేశపూరితులగు అనాత్మనిష్ఠుల చలచిత్తములకును, నవనా గరికము పిశాచమని భావించి నిలువలేక వెట్టి పరువులు పెట్టు కేవల పండితమ్మన్యులకును బరస్పర మైత్రి చేకూర్పవ లె నన్న హృదయపరివర్తనము గలిగింపవలెను. అందులకు విజ్ఞా నాభివృద్ధియే మూలము . ఇప్పుడు మనకు రెండువిధములగు నిక్కట్టులు సంభ వించినవి. మనలోమనము కుమ్ములాడుచుండ మతవిజ్ఞాన విషయముల పట్ల, కుల వైషమ్యులు వాపుపట్ల ప్రభుత్వము పూనుకొనదు. మనలో మనమే సాంఘిక పరిష్కారమున నొక దారికివచ్చుటకు విజ్ఞానము తక్కువ. మనల నందరను బంధించు ప్ర్రాచీనార్య మతాచార సూత్రమును చెంచు కొనుటయా? మానుటయా? అని చర్చించు భారము మన తల పడినది. మహాత్ములు నూరుగురైనను ఈ విజ్ఞాన ప్రచారమున గాక స్క్రాచీన మతాచారములకు జరివర్తనము తీసికొని రాజాలరు. తమకు ప్రపంచమున విధానాంతరములు లభియిం చిన యద్వితీయశ క్తిని, పలుకుబడిని వినియోగించి, అధిక సంఖ్యాకుల ప్రాతినిధ్య జలమున, స్వల్ప సంఖ్యాకులగు ప్రాతినిధ్యబలమున, ప్రాచీనా చారపరులను తమమార్గమునకు దిప్పజూచుచో నది యొక విధమగు నిర్బంధ శాసన ప్రయోగమువంటి దగును. తత్ఫలము తాత్కాలికమాత్రమయి తుదకు పెడ దారుల బట్టింపగలదు. ముక్కు మూలమైఱుఁగని వట్టి యావేశముం బురికొనుట తుదకు నాళన హేతువు. కనుక మనలోమనము మానసిక ప్రవృత్తులను బేమచే నేకీభవిం చుటకు బలమగు ఆర్యజాతీయ విజ్ఞానపదము నే ఆశ్ర యింపవ లెను గ్రామ పునర్నిర్మాణాభిమాను లెల్లరు, పుస్తుక పాణియగు నా సరస్వతీ దేవియొక్క పరిపూర్ణ స్వరూపమును సాక్షాత్కరింపజేయు విశ్వ గ్రంథాలయ మును నిర్మించుటకు పాటుపడదగును. విద్యాప్రణాళిక నమలు పఱచుటలో విశ్వవిద్యాలయము లెంత యవసర మని లోకము గ్రహించినదో, విశాస విస్తరణోద్యమమున కనువగునట్టి ప్రణాళికను నిర్మించుటకు విశ్వగ్రంథాలయ మంత యవసర మనదగును. ఆ నాదియగు వేదమునుండి శాఖోపశాఖలుగా విస్త రిల్లిన విజ్ఞానగ్రంధసంతతి పోయినదిపోగా, నేటికి మిగిలి యున్న దెంత? దానిని సేకరించు కొంటిమా ? సేకరించు టెట్లు ? అని చర్చించవలెను. ఆట్టి ప్రయత్నమున కుద్య మించుటకు స్వార్ధత్యాగము ఆర్థిక సహాయము కావలెను. రాజకీయరంగ మున నందుల కవకాశము లభింపవలెను. నా దేశము, నా విజ్ఞానము, కాలచక్రమున, ధరాగర్భమున మన్న గుచున్నదని కన్నీరురాల్చు నచంచల జాతీయ భావ 7