పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/15

ఈ పుటను అచ్చుదిద్దలేదు

13 గ్రామసీమల గ్రంథాలయములు - దేశీయుల తోడ్పాటు. కళాశాలలు పాఠశాలలు నిర్వహింపబడుచున్న ను, ఎన్ని ఉత్తమోత్తమ పరీక్షలు జరుపబడు చున్నను, ఆసంస్థలు, పరీక్షలవల్ల గలిగెడిలాభ ము చిరస్థాయిగానుండదు. సాధారణముగా నాలుగు లేక ఐదవ తరగతివఱకును, కొన్ని ముఖ్యగ్రామములలో మాత్రము ఎనిమిదవ తరగతి వరకును విద్యగఱపుచుండెడి పాఠశాల లలో తరిబీయతుపొంది, తరువాత వ్యావసాయిక వగైరా కాయకష్టపు వృత్తులను అవలఁబించెడి గ్రావియులలో, వారిచిన్న నాటి ఒడిమిడి జ్ఞాన మైనను వారిని వీడి పోకుండా ఉండవలయున నెడి చో, అది గ్రంథాలయముల ద్వారానే సాధ్యము కనుక ప్రభుత్వము స్థానిక సంస్థలు ప్రజ లచే లేవదీయబడి, నడపబడుచున్న గ్రంథాల యోద్యమమునకు ఇప్పటికన్న అనేక రెట్లు విరి విగా సహకార మొనర్చి' ఆయుద్యమమునకు వారు హృదయపూర్వకముగా తోడ్పడుటలే దనియెడి అపవాదునకు గురికాకుందురు గాక యని కోరుచున్నాను. ప్రభుత్వము వారును, స్థానిక సంస్థలును తమతమ ఆదాయ వ్యయ పట్టికలలో ముఖ్యముగా గ్రామసీమలలో గ్రంథాలయముల వ్యా ప్తికిగాను ప్రత్యేకించెడి మొత్తములను ఇప్పటికన్న అనేక రెట్లు వృద్ధి జేసినగాని, ఇందువిషయములో ప్రజలయెడల వారి ధర్మములను వారు సరిగా నిర్వహించు చున్నారని ప్రజలు విశ్వసించజాలరు. తమ ఏలు బడి ప్రాంతములో అత్యుత్తమ పద్ధతిని గ్రంథా లయ వ్యా ప్తి జరుగుటకు కారకులైన బరోడా సంస్థాన గైక్వారు ప్రభుత్వము వారిని మన 'రాష్ట్రప్రభుత్వము వారును, స్థానిక సంస్థలును అనుకరించవచ్చును. గ్రంథాలయోద్యమము ఇంకను సత్వరముగ గ్రామములలో వ్యా ప్తి పొందకుండుటకు కార ణము" గ్రామవాటికల దుర్భర దారిద్ర్యము. దరిద 99 రిద్ర నారాయణుని ఏలుబడిలోని దైన మన దేశమునకు గ్రంథాలయములు జీవితములో ప్రధానావసరముగా లేవు. అవి ధన వంతుల పాలిటి, ధనమున్న చోటులు నెలకొల్ప బడవలసిన విలాసగృహములుగా పరిగణించ బడుచున్నవి ఎంతకష్టించినను, ముప్పూటలు తిండికి గూడ నోచుకొనని కొంతమంది సోదర గ్రామస్థుల ఆర్తనినాదములు చెవిని బడనివారు లేరు. అవ్విధముగా లేమిలోన్నటువంటి సోద రుల సానుభూతిని గ్రంథాలయోద్యమమునకు డును. మనము బడయగలిగినను, అందు విషయములో వారు చేయగలిగెడిది పరిమితముగానే యుం అయినను అది పూర్తిగా మృగ్యముగా దని చెప్పుట సాహసముగాదు. ఎంత బీదవా రైనను, మనలో కొంతమంది భోజనసమయ మందు తమ మొదటిక బళమునకు ముందు ఒక ముద్ద యన్నమును భగవతార్పితముగ పక్షులు వగైరాలు స్వీకరించుటకు విడిచివై చెదరు. ఇం కను కొంతమంది ప్రజలు నిరు పేదవాడైన తోడి మానవుల ఆకలివిషయమై విచారింపజాలకపోయి నను పుణ్యముకొఱక నిచీమలపుట్టలదగ్గి అనూకలు వగైరాలు చల్లెదరు. వగైరాలు చల్లెదరు. మన దేశములో నున్న దాదాపు ప్రతిగృహములోని గృహిణీయ.ను “భిక్షాం దేహి” యని తన ఇంటికి వచ్చిన ప్రతి యాచకునకును, వాని మంచి చెడ్డలు, అర్హతా నర్హతలు, అభిక్షవలన తనుకుగాని, ఆయాచకు నకుగాని, సంఘమునకుగాని కలిగెడి ప్రయో రాష్ట్రయోజనములై నను గుర్తించక, భిక్ష యొసగుట పరిపాటియైయున్నది. ఈ మాదిరిగా నిష్ప్రయోజనముగా వెదజల్లబడుచున్న ఈవిని గ్రంథాలయోద్యమము మొదలైన ప్రజో ధరణ కార్యముల వైపు మఱల్చుటకు నా దేశీయ సోదరసోదరీమణులకు వినయ పూర్వక ముగా విజ్ఞ ప్తి జేసెదను. అతివిశాలమైన మన