92
12 గ్రామసీమల గ్రంథాలయములు - దేశీయుల తోడ్పాటు. (శ్రీమతి ఈడుపుగంటి వేంకటరత్నమాంబగారు) _ దేశకల్యాణమును బెంపొందించెడి యనేక ఉద్యమములలో ఆంధ్రావని ముందంజ వేయు చున్నది. ఆంధ్రులు తమ నిరుపమాన కి సామర్థ్య త్యాగములను బ్రకటించుచున్నారు. వానిలో గ్రంథాలయోద్యమ మొకటి. ఆంధ్ర గ్రంథాలయోద్యమ పిశ్రామహులగు శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు, స్వర్గీయ సూరి వెంకట నరసింహశాస్త్రి గారు బోలు మహాశయులు, త్యాగశీలుర ఆధ్వర్యము క్రింద ఆంధ్ర దేశములో గ్రంథాలయ ఉద్య మాభివృద్ధి బహుత్వరితగతిని జరుగుచున్నది ఇందు విషయ ములో గ్రంథాలయములు మొదలగువానిని స్థాపించుటకు భూరివిరాళముల నిచ్చిన వారికిని, రాజకీ యోద్యమములలో పాల్గొ నెడి వారివ లేగాక ఎక్కువ పేరుప్రతిష్ఠలకు అంతగా అవకాశము లేనప్పటికిని, నిష్కామహృదయముతో గ్రంథా లయోద్యమవ్యా ప్తిద్వారా దేశ సౌభాగ్యమును పెంపొందింప జేయవలయునను దృఢసంకల్పము తో, దీక్షతో పనిజేసెడి గ్రంథాలయోద్యమ కార్యనిర్వాహకులకు నా ధన్యవాదములు. మన దేశములో పదింట తొమ్మిది పాళ్ల జనము గ్రామసీనులలో నివసించెడివారే. అందు వల్ల ‘దేశౌన్నత్యమునకు తోడ్పడెడి ఏయుద్యమ మైనను గ్రామ ప్రాంతములలో పూర్తిగా వ్యా పించినప్పుడే, ఆయుద్యమము దేశమం దంతటను వేళ్లూనినదని తలచుట కవకాశముండును. అన్ని పట్టణములలోను గ్రంథాలయములు విరివిగా స్థాపించబడుట, పోషించబడుట, ఉపయోగింప బడుట సర్వులకు విదితమే. కాని అన్ని గ్రామ ములలో గ్రంథాలయము లింకను లేవని చెప్ప వలసివచ్చుటయేగాక, గ్రంథాలయము లున్న గ్రామములు ఏకొలదియోగలవనియు, అలా గ్రంథాలయము లున్నను' అవినామమాత్రము గాకుండా నుండి, పూర్తిగా ఉపయోగింపబడెడివి ఇంకను తరుగనియు వ్రాయవలసి వచ్చినందు లకు కడు విచారించుచున్నాను. ఇవ్విధముగా పల్లెటూళ్లలో గ్రంథాలయాభి వృద్ధి ఉండవలసినంత తృప్తికరముగా లేకుండు టకు కారణములు, దానిని “వృద్ధిపఱచే మార్గ ములు, అది సాధించగలిగెడిచో, గా మసీమలకు గలిగెడి మహత్తర ఫలితములను గురించి కొంత స్వానుభవ పూర్వకముగా చర్చించగో రెదను. పురుషులలో నూటికి పదింటికి లోపుగాను, . స్త్రీలలో ఏఇద్దఱు ముగ్గుఱో కొంచ రుక్షర జ్ఞానముగలిగి, ప్రస్తుతము గాఢ అజ్ఞానాంధ కార ములో ముణిగియున్న మన దేశములో ప ప్రజా బాహుళ్యము గ్రంథాలయముల ఆవశ్యకతను సరిగా గుర్తించకుఁడుటలో నాశ్చర్యమేమియు నుండదు. అయితే ఎక్కువమంది నిరక్షరకుక్షు లైన మన దేశస్థులను త్వరలో అక్ష రాస్యులనుగా జేయగలిగెడి సాధనముకూడ సత్వర గ్రంథా లయోద్యమాభివృద్ధియే. ఈ సంగతి " పెండ్లియైన గాని పిచ్చకు దురదు; పిచ్చకుదిరిన గాని పెండ్లి గాదు" అనెడి సామెతను బోలియున్నది. అందు Q_ రాజు వల్ల దేశములో విద్యాభివృద్ధికి ప్రధాన బాధ్యు లైన ప్రభుత్వమువారు, స్థానిక సంస్థలు, కయవేత్తలు, విద్యాధికారులు మొదలైన వారు గుర్తించవలసిన దేమన దేశప్రజల ప్రధానావ సరములలో, అన్ని గ్రామములలోను వెంటనే ఉచితరీతిని గ్రంథాలయములు స్థాపించి వానిని అత్యుత్తమపద్ధతిని ఆకర్షణ ఆకర్షణీయముగా, ప్రజోప యోగకరముగా నడపుట ఒక్కటనియు; ఇది జరుగనినాడు, దేశమం దంతటను ఎన్ని విశ్వ విద్యాలయములు నెలకొల్ప ఒడినను, ఎన్ని 1