10 90 గ్రంథాలయ పుస్తకాలను మార్క్స్ లెనిన్ పద్ధతుల ప్రకా రం అమరుస్తారు. ప్రతిపుస్తకానికి వ్యాఖ్యానం వ్రాయించి, అందులోని ముఖ్యవిషయాల్ని చేర్చి, అక్షర సంజ్ఞాప్రకారం ప్రత్యేక పట్టికలను తయారు చేస్తారు. గ్రంథకర్తల పట్టికలనుగూడా తయారు చేస్తారు. కాని ఇవి చాలా అరుదు. 1925 లో ఇట్టిపట్టికలను తయారుచేయుటకు ప్రభుత్వం వారు ఒక సంఘాన్ని నియమించారు మూడోవిషయం. ప్ర త్యేక విషయగ్రంధాలయాలు.ఇవిఏ దో ఒక శాస్త్రంకోసం వినియోగింపబడినవి. ఒక గ్రంథా లయంలో అన్నీ ఇంజనీరింగప్పుస్తకాలే, మరొక దాంట్లో అన్నీ వైద్యవిద్యకు సంబంధించినవే, యీలా గే... నాల్గోవిషయం. ఇది గ్రంథాలయనిర్వాహకులకు క్రమశిక్షణ ఇచ్చుట. ఈ శిక్షణలో చాలా తరగతు లున్నాయి. చాలాతరగతు “లైబ్రరీ టెక్నికం” అనేవాటిలో మూడేండ్ల శిక్షణ ఇస్తారు. వీటిపైన కావాలంటే, “సైంటిఫిక్ రీసెర్చ్ ఇక్,స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్సు” మొదలగు నవి ఉన్నాయి. కార్మిక గ్రంథాలయ నిర్వాహకులకు ఒక ప్రత్యేక శిక్షణ ఉంది. అది, మామూలు దాం తోబాటు, కర్మాగారాల్లో కార్మికుల ప్రక్కన 40 రోజులు, రోజుకు 4 గం॥ ల చొప్పున పని చెయ్యాలి. m దీని ఉద్దేశం వారు కార్మికుల మానసిక ప్రవృత్తులను బాగా తెలిసికొని వారికి కావలసిన - ము . సర్వస్వ ము దేదో చేయటానికి వీలుగా ఉంటుందని. ఇంత కన్నా మంచివిధం మరొకటుండదు. ఒకడు కూలివాని గురించిగాని, బిచ్చగాని గురించిగాని వ్రాయాలంటే తనూ వాడితో పాటు తిరిగి వాడి బాహ్యప్రకృతేగాక, అంతః ప్రకృతికూడా గ్రహించాలి. అపుడే అతడు వారి సింది నమ్మదగింది, గౌరవింపదగింది. ఐదో విషయం. రణ. గ్రంథాలయోద్యమానికి సంబంధించిన ప్రచు ఇందులో చేరినవి మూడు పత్రికలు. ఇవి ప్రభుత్వమువారి నియామకులచే ప్రచురింపబడ తాయి. 5 సోవియట్ గ్రంథాలయాలు ప్రజల సాం ఘిక జీవనానికి, వారినైతిక వికాసానికి బాగా నీరుపోసినవి ఈవిషయం బాగా గ్రహించిన ప్రభుత్వంవారు వీటిని సజీవంగా చేసారు. ప్రజ లను వీటివద్దకు ఆకర్షించుటకు అన్ని చిటుకులను ప్రయోగించారు. చదువురాని వార్ని ఆకర్షించటానికి ఈ గ్రం ధాలయాల్లో బిగ్గరగా చదువుట ప్రవేశ పెట్టారు. ఒక వైపున ప్రభుత్వం ఈలా ఈఉద్యమాన్ని పైకితీసుకొని వస్తుంటే, ప్రజలు గూడా మరొక ప్రక్కన దీని అభివృద్ధికి తోడ్పడ్డారు. వారు కూడా దీని ఆధిక్యతను, ఉపయోగాన్ని గుర్తిం చారు. ప్రతి పార్కులోను, ప్రతి రైలు స్టేషను వద్దను, ప్రతిసినిమాహాలు ముందరను పఠనమందిరాల్ని గ్రంథాలయాల్ని స్థాపించారు. ఏ కార్మిక సమా జం వర్కర్సుక్లబ్బులో చూచినా ఇట్టివి లేకుండా ఉండదు.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/12
ఈ పుటను అచ్చుదిద్దలేదు