పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/46

ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 3 గ్రంథా లయ సర్వ స్వ ము . ములకును వెనుక బడియున్నది. కారణ మేమి? దేశమున బహు భాషలుండుటయే కారణమని కొందరి మతము. మన దేశమున డెబ్బది లక్షలకు పై బడిన జనాభాగల భాషలు ముఖ్యముగ 12 ఉన్నవి. బర్మా భారత దేశమునుండి వేరు చేయబడినపిమ్మట మన దేశమున ఇట్టివి 11 భాషలే యుండగలవు. ఇవియూరపు దేష భాషల సంఖ్య కంటె తక్కువ. ఈ దేశీయ భాష లన్నియు సం పూర్ణ సహకారమును సల్పినచో ఐరోపా తర తరములనుండి ' పాటుపడుచున్నను పొంద లేని ఐక్యభావము మనకు కరతలామలక మగును. దీనిని బలపరచు మరియొక సందర్భముగూడ గలదు. మన దేశీయ భాషలన్నిటికిని సంస్కృతముమూల విరాట్, అరేబిక్ పారసీ ఆంగ్లము మున్నగు భాషలుకు భారత దేశ భాషలకు పద సామగ్రిని ప్రసాదించి పోషించినవి. సమానార్ధముతో నొప్పగల సమాన పదసామగ్రి మన భాషలలో నేర్పడుట కవకాశమున్నది. అఖిల భారత దేశ భాషా పత్రికల ప్రతినిధులును సేవకులును సమావేశమై దేశభాషలను సమసూత్రముల మీద నడుపనిశ్చయింపవలసియున్నది. అప్పుడు హిందీ - దేశభాషల గొడవయు ఎక్కువకాదు. ఈసమా వేశము ఏ కేంద్ర పట్టణమున నైనను జరుప జరుప దగును. బెజవాడలోనే జరిపినను నగును. సమా వేశముతో పాటు దేశీయ భాషా పత్రికా ప్రదర్శనమును జరుగుట యుచితము. అఖిల భారత గ్రంథాలయ సంఘము వారు ఈ విషయమున పరిశ్రమ చేయుచున్నట్లు వినుచు న్నాము. నిజమగునేని సంతసింప గలము. గ్రామములలో రేడియో సరిహద్దు రాష్ట్రములలో సంచారము చేయు టకై వెడలిన పంజాబు ప్రభుత్వపు గ్రామో ич ఈ రణ శాఖాధికారియగు బ్రెయినుగారు గ్రామ ములలో రేడియోలను స్థాపించువిషయమై కిందివిధముగ చెప్పిరి. ఢిల్లీ బ్రాడు కాస్టింగు స్టేషనుకు అందుబాటులోనున్న 40 గ్రామము లలో రేడియోలను పెట్టుటకు పంజాబు ప్రభు త్వము ప్రయత్నించుచున్నది. పిసోవరులో నేను చూచినదానినిబట్టి, గ్రామపునర్నిర్మాణ మునకు రేడియో వంటి సాధనము. మరియొకటి లేదని చెప్పగలను. రేడియోవలన ప్రజలలో కలుగు పరివర్తనము అమోఘము. పెషావరు రేడియోవలన, ఆరోగ్యవిషయమై పఠానులలో శ్రద్ధ అధికమయినది. రేడియోద్వారా విను చున్న అనేక విషయములపై వారు చర్చలు చేయుచున్నారు. “అప్పుడప్పుడు బ్రాడు కాస్టు చేయబడు నాట కములు ప్రజలను ఆకర్షించుచున్నవి. పెషావరు సెట్టులోని గాత్రము మాధుర్యముగ నున్నది. రేడియో కార్యక్రమము గ్రామములలోనికి గూడపాకుటచే పఠాను స్త్రీలకుగూడ రేడియో విన వీలుగలుగుచున్నది. వారు గానములోని మంచి చెడ్డలను తెలిసికొన గలుగుచున్నారు. పెషావరులో బ్రాడు కాస్టింగు స్టేషను స్థాపించి నప్పటినుండియు, ఇంతవరకు అమ్ముడుబోయిన రేడియో సెట్టులను గమనించినచో, రాష్ట్ర ? మున రేడియో ప్రచార మద్భుతముగ వృద్ధి గాంచుచున్నదని చెప్పవచ్చును. ” రేడియోవిషయమై బ్రెయినుగారి అభిప్రా యములనే క్రొ త్తరాజప్రతినిధియొక్క రేడియో ఉపన్యాసము బలపరచుచున్నది. పత్రికలకు సరి యైన వార్తలను తెల్పుచుండెదనని రాజప్రతి నిధి వాగ్దానము చేసియుండుటచే, రేడియోలకు బహుశః నవ్యశోభ రాగలదు.