పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

39 తె లు గుమా స ప త్రిక లు . ప్రసంగ వశమున క సంగతియు చెప్పదగి యున్నది. ఈ పత్రిక యారఁభించిన అరవ తెలుగులిపి సంధానము తెలుగు లిపిని చాల ఎక్కువ సంస్కా-ర పరచవచ్చుననుటను సూచించుచున్నది లిపికిసంబంధించిన యుద్యోగము చేయువారు దీనివలన లాభము సంపాదింప గలరేమో చూడవలెను. ప్రకృతి: 1936 వ సం॥ము ఏప్రిల్ నెల ప్రకృతి పత్రిక యధా ప్రకార సుస్వరూపమున బయలుదేరినది. సంపాదకుల మొట్టమొదటి వాక్యము మేనెలలోని ఆంధ్రుల కార్య క్రమమునకు సంబంధించి కొంత యుత్సాహమును పురికొ ల్పునదిగా నున్నది. మన మేలుకొలుపునకది సూచకము. మే మాసమునకుసంపాదకులు "ఆంధ్రజాతీయమాసమని పేరు పెట్టి ఈకింది వాక్యములు వ్రాసిరి. కొ “ఒక శైపున మదనపల్లిలో ఆంధ్ర ప్రకృతి ధర్మ పరిషత్తు వారి శవ ప్రకృతివైద్యశిక్షా శిబిరమున్నూ, వైపున మచిలీపట్టణమున టేకుమళ్ళ రామచంద్ర రావు పంతులు గారి పర్యవేక్షణమున విజ్ఞాన పరిషత్తువారి గ్రామ పునర్నిర్మాణతరగతులు, వేరొక వైపున నిడుబోలులో ప్రొఫెసర్ రంగాగారి రైతాంగ విద్యాలయము జరుగును. ఇంకను ప్రచురింపబడలేదు గాని ఫొఫెసర్ సంపత్కు మారాచార్యులవారి శ క్తి పాఠశాలలు గూడ మేనెలలోనే జరుగును. తెలుగు దేశమున నూతనావేశము రగుల్కొ లుపబడును. బలము ఆరోగ్యము విజ్ఞానము కార్యదక్షత నేర్పబడును.” అనంతపుర మండల కాంగ్రెసు సంఘమువారు తల పెట్టిన వసంతవిద్యాలయము గూడ ఈమాసమున నే జరు గున ట్లేన నిది జాతీయమాసమగును. ప్రకృతిసంపాదకులు ఆశించురీతిని ఈసమా వేశములు రైతు నాకర్షించును గాక యనియు, ఇట్టివినూర్లకొలది యవసరమగును గాకయనియు మేమును ఆశించుచున్నాము. రైతు నాకర్షించు మార్గములు విపుల తరముగా నాలోచించి మేనెలలో నుపకమించు నుద్యమములు నాయకులు అమలులో పెట్టుదురు గాకయని కోరుచున్నాము, ఈ ఏప్రిల్ సంచిక యందు చికిత్సావిధానమే చాల యెక్కువ స్థలము నాక్రమించినది. వ్యాయామ విష యక వ్యాసము మాత్రమొకటి తద్భిన్న మైనది చేర్చిరి. ఇందులోని ప్రశ్నోత్తరభాగమున సంపాదకులు ఆరోగ్య ములకు సంబంధించిన సలహా లిచ్చుటయు ఇంకను ఇతర సందేహ్మములను తీర్చుటయు తమ పనిగా పెట్టుకొనిరి, 75 చదువరులు ధారాళముగా దీని నుపయోగించుకొందురు గాక. రోగ నివారణ కోరువారు నేరుగా 'ప్రకృతి' ఆఫీసు మేనేజరుకు వ్రాసుకొని ఫీజుఇచ్చుకొనవలసి యుందురు. జ్యోతిస్సాముద్రిక చంద్రిక : ఈ మాసపత్రిక యొక్క మొదటి సంపుటపు మొదటి సంచిక మా కార్యాలయము చేరినది. సంపాదకులు: మల్లాది దక్షిణామూర్తిశాస్త్రి గారు బెజనాడు. సంవత్సర చందా రు 3-0-0లు, పత్రిక పుటలు 28. ఇదివరకు ఈ విషయమునకు సంబంధించిన పత్రికలు లేవు. ఆకొరతను తీర్చుటకు శ్రీ శాస్త్రిగారు ఈ పత్రి కను ప్ర్రారంభించెదమని వాకొనిరి. ఇది వట్టి జ్యోతిష పత్రిక గా గాక జ్యోతిషము సాముద్రికము రెంటిని మేళ వించి విమర్శించు పత్రికగా నుండుట ప్రశంసనీయము. వీరి యభిప్రాయమున జ్యోతిషమునకంటే, సాముద్రిక మున ఫలానుభవము ఎక్కువ కాగలదు. అందును వీరు పాశ్చాత్య శాస్త్రజ్ఞుల మర్యాదల ననుసరించుట లేదు, ప్రాచ్యపద్ధతుల ననుసరించి కార్యనిర్వహణ మొనర్ప దలచిరి. 'ముఖవైఖరీశాస్త్రము హస్తశాస్త్రము, రేఖా శాస్త్రము, ముద్రాశాస్త్రము, అనుప్రత్యేక విభాగము ల క్రింద సాముద్రికశాస్త్రమును వివరింప నిశ్చయించిరి. మొదటి సంచిక యందే కొన్నిహస్తములను రేఖల తో గూడ ప్రకటించి ఫలములు వ్రాసినవారికి సువర్ణ పతక ఒహు మానములను ఇత్తుమని ప్రకటించినారు. ఈ సంచికలో ఈ అన్ని శాస్త్రములకు సంబంధించిన చాల ప్ర్రాతిపదిక మయిన తొలిపలుకులు మాత్రము వ్రాసిరి. వివరణధోరణి ముందు పత్రికలలో గాని తెలియరాదు. ప్రయత్నము సత్ప్రయత్నమని ప్రత్యేకముగా వ్రాయనక్కరలేదు . ముఖపత్రము ఇంపులుగుల్కు రంగులతో చిత్రములతో ప్రకటితమయినది. ఈ శాస్త్రములయందు పరిచయము గోరువారలకు జ్యోతిస్సాముద్రిక చంద్రిక మిక్కిలి యుప యోగ కోరి కాగలదని విశ్వశించుచున్నాము. గృహ ల క్ష్మి ఏప్రిలు సంచిక గూడ వెనుకటి సంచికలవలెనే ఆకర్ష వంతం గావున్నది. ముఖపత మీద గృహలక్ష్మి చిత్రం చిత్రించటంలో చాలా ఔచిత్యంవున్నది. 1935–36 సం. లో గృహలక్ష్మిలోని స్త్రీ రచనల లెక్కల తేల్చి ప్రచు రించుటవల్ల, స్త్రీల అభివృద్ధికై సంపాదకులు ఎంత పాటు పడుచున్నారో తెలియవస్తున్నది. వానివల్ల క్రిందటి సంవ