పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

హిందూ యువజన సంఘము, ఏలూరు.


ప్రారంభము


అల్పారంభము లొకప్పుడు మహోన్నత కార్యనిర్వ హణమునకు హేతుభూతములుగు విధమును హిందూయువ జన సంఘముయొక్క కడచిన ముప్పదియేండ్ల చరిత్రము విపులముగ విశద పరు పగలదు నేడు ఆకర్షణీయములగు ఉన్నత సౌధములలో నొకటిగా నొప్పారు దివ్యభవనము తో, రాజధానియం దగ్రస్థానము వహించిన గ్రంథాల యములలో నొకటియై యొప్పు గొప్ప గ్రంధభాండాగార మును గలిగియు జ్ఞాన వితరణమునం దపారమైన ఖ్యాతి నార్జించి పాలక పాలితుల యామోదరునకు బాత్రమగు చున్న యీ హిందూయువజన సంఘము, మొట్టమొదట దక్షిణపువీధియం దొక చిన్న మేడలో ఏలూరు కరణము కీ. శే. దుగ్గిరాల సత్యనారాయణమూర్తి గారివలన 1901వ సం॥ సెప్టెంబరు 23వ తేదీనాడు ఆడంబర రహితముగ నారంభింపబడినది. ఆదిమసంక ల్పానుసారము కొంతకాలము వరకు ధార్మిక సామాజిక సారస్వతాది ప్రసంగము లకును, మహాపురుషుల జన్మదినోత్సవములకును అవకాశ మొసంగుచు క్రమక్రమముగ నందు భజనలు, శ్రీరామ నవమి మొదలగు పండుగులు జరుపుటయేగాక ఆ యా పర్వదినముల నప్పుడప్పుడు బీదసాదల కన్న ప్రదానము గూడ గావింపబడుచుండెడిది.

కొలదికాల మిట్లుజరిగి నామమాత్రముగ నుండిన యీ సంఘమునకు 1909 సంవత్సరమున నిర్మాతయగు దుగ్గిరాల సత్యనారాయణగా రే మరల యత్నించి గ్రంథాలయ మను పేరుగూడ నిడి నూతన రూప మొసంగిరి. ఈ పరిణామమున వీరికి కీ. శే. దుగ్గిరాల దేవళాజు గారుకూడ తోడ్పడి యుండిరి. వీరిరువురు గ్రంథాలయమున కావశ్యకము లైన పరికరములను గ్రంధములను ఒసంగి కొలది గ పుష్టివంతము గావించి దానినొక గ్రంథాలయ మనిపింప గలిగిరి.

విద్యార్థులయందు పోటీ పరీక్ష.

తెలుగున వ్యాసము వాని గెలుపొందిన విద్యార్థులకు 25 రూపాయిల విలువగల పుస్తకములను బహుమతి నిచ్చు నేర్పాటు 1913 వ సంవత్సరమున నే ప్రారంభమై నది. తదాది యధాకమమున ఉన్నత పాఠశాల విద్యార్ధులు 1 మొదలు 6 వఫారమువరకు ఈ వ్యాసపరీక్షలకు అభ్యర్థు లగుటయు, ఉ తీరు లెన వారు బహుమతులను గొనుటయు, సాగుచుండినది. ఈమధ్య రెండు మూడు సంవత్సరములు నుండి బాలికా పాఠశాలలనుండి విద్యార్ధినులు పోటీకి నిలుచుటయు గెలుచుటయు బహుమతుల నందుటయు జరిగినది. బహుమతి మూల్యము రు 60 లకు పెరిగినది.

నూతనోజ్జీవము

ఏమైన నేమి 1914 సం. మొదలు సంఘమున నూత నోజ్జీవ మారంభమైన దనవచ్చును. సమయానుగుణముగ సభలు జరుపుటయు, పఠనమందిరము ప్రవృద్ధిని సూచించు టయు, గణ్యములగు తెలుగు ఇంగ్లీషు పత్రికలకు యేర్ప డిన తావు విరివియగుటయు మొదలుగా నెన్నేని జీవకళలు పొడసూపుచు వచ్చినవి. ఈసంఘము యొక్క పూర్వ దశయందు పోషణమునకై చేయిచ్చినవారిలో కీ. శే. చిలుకూరి నరసింహారావు (జూట్ మిల్లు మేనేజరు) గారు ఒకరుగ గణింపకుండరాదు.

కమముగా పుస్తకభాండాగారము, దాని యనుబంధ మగు పఠనమందిరము పెంపుసూచించుట చే పదుగురుకు పిన్న పెద్దలకు అందుబాటులో నుండుచోట సంఘమునకు ఒక వసతి యేర్పరుచుట అవశ్యక మైనది. ఆ కాలమున ఈ పుర మున నెలకొనిపనిజేయుచుండిన "లిటరరీఎసొసియేషన్” అను పేరుగల సంస్థను ఈ సంఘముతో మేళవించుటకు ప్రయత్నములుజరిగినవి. వైశ్యయువకులు ప్రత్యేక సమితిని నెల కొల్ప నుద్యుక్తులై యుండిరి. పెనుగులాటకు

అనేకత్వమునకున్న ఏకత్వము ఉచితమని అన్నిటిని ఏకీకరణ మొనర్ప ప్రయత్నము సాగినది. వైశ్యయువకులం ఈ సంఘము నెడ సుముఖులై తమ ప్రయత్నమును విర మించి, తామును సంఘమునకు సాధనభూతులైరి, 6. లిటరరీ అసోసియేషన్' వారు పేరునుగూర్చిన లోనై తమప్రత్యేకతను గోల్పోజాలక పోయిరి. కాని సోమంచి భీమశంకరంపంతులు, నంబూరి తిరునారాయణ స్వామి, బి. యె, గార్ల పురుష కారము ఫలించి, ఆ అసో నియేషన్ గ్రంథములు కొన్ని, ఈసంఘభాండాగారమున జేర్చబడినవి. ఇప్పటికి ఆంగ్లేయగ్రంధములు 374, ఆంధ్ర గ్రంధములు 438, సంస్కృత గ్రంధములు 43, తాళ పత్ర గ్రంధములు 6, మొత్తము 861 గ్రంధములు భాండా గారమునందు కలవు. ఈ సంవత్సర మధ్యముననే గ్రంధి రామమూర్తిగారి (పోస్టాఫీసువద్దనున్న) కొట్టునకు మార్ప బడినది, ఇది 1915 వ సంవత్సరపు కథ.

సాంఘిక సేవ

1915 - 17 మధ్య కాలమున జరిగిన కృషివలన ఈసం మపు పునాదులు గట్టిపడినవని చెప్పదగును. గ్రంధముల సంఖ్య పెరిగినది. సభ్యుల సంఖ్య హెచ్చినది. పత్రికాప