పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/60

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీశంకరాచార్యుల కాలము

శంక రాచార్యుల కాలమునుఁ గూర్చి విచారింతము . దీని విషయమై పూర్వపాశ్చాత్త్య విపశ్చితులు భిన్నాభి ప్రాయులయిరి. శంక రాచార్యులను గుఱించి కేరళోత్పత్తి బృహచ్ఛంకరవిజయము, ఆనందగిరికృత శంకర విజయము, మాధవకృత సంక్షేపశంకరవిజయము, సదానంద కృత విజయము, గలవు. కేరళోత్పత్తి లాఁతి గ్రంథములకు విరు ధముగ నుండుటంబట్టి దానినిఁ బూర్వులే ప్రక్షిప్తగ నిరి; దానిలో నౌత్తరీయులు పూర్వ మీమాంసా చార్యులు నగు భట్టిపాదులు, కేరళదేశమగు మళయాళ దేశములో బౌద్ధులపై విజయముఁగొని వారి నాదేశమునుండి తఱిమి తామక్కడ నివసించినట్లు ప్రమాణవిరుద్ధముగ నున్నది. భట్టపాదులకు కుమారిలభట్టను నామము గలదు. వారు ' ప్రయాగలో దేహమును ద్యజించినట్లు మాధవాభిప్రా యము. మాధవేతర కృతగ్రంథంబులలో విజిగీషుకధ వి శే షముగ నుండుటంబట్టియు, చరిత్ర విషయమై స్వల్పము గను, బౌర్వాపర్యవిధురముగ నుండుటంబట్టియు, వానినిఁ బ్రమాణంబులుగ నవీన చరిత్ర కారు లంగీకరింపలేదు. ఆనం దగిరిచే సెనని కలకత్తాలోఁ బ్రకటింపఁబడిన శంకరవిజ యమున నమ్మవీలు లేని సంగతులున్నవి. సాయనమాధవ కృతమగు నధికరణరత్నమాలలోని యొక శ్లోకమునకు శంకరులు కర్తగ వ్రాయఁబడె. తమకంటే నిర్వాచీను లచేఁ బ్రపంచితములును తమమతమునకు విరుద్ధములును తమగీతా భాష్యాదులలో స్పస్టముగ దూషితములును నగు ద్వైత విశిష్టాద్వైతములను జనులకు బోధింపుమని శిష్యద్వయమున కుత్తరవు శంకరులిచ్చినట్లున్నది. మఱి యు దీన్ని శైలి మిగులఁ బేలవముగ నున్నది. మండనమి శ్రులు, సురేశ్వరాచార్యులు, భిన్ను లనికూడ విరుద్ధముగ ' నున్నది. కాన నిది శంకరసాక్షాచ్ఛిష్యులచేఁగాని, తద్భా వ్యత్రయ వ్యాఖ్యాతలును శ్రీశుద్ధానంద పూజ్య పాద శిష్యులును ఆనందజ్ఞా నాపరనామధారులు నగు నానం దగిరులచేఁ గాని వ్రాయబడి యుండలేదు. లెక్కిన రెండు గ్రంధములలో శంకరోత్పిత్తి కాలము మృగ్యంబు. మాధ వకృతగ్రంథములో నిట్లు వర్ణింపఁబడినది: “లగ్నేశుభే శుభయుతే సుషు వేకుమారం శ్రీపార్వతీవ సుఖినీశుభ నీక్షి తేచ, జాయాసతీ శివగురోర్ని జతుంగ సంస్థే సూర్యే కుజేరవిసు తేచ గురౌచ కేందే. (2-ఆ-71) దీనివలన నిప్ప టికే జ్యోతిష్కులు కాలనిర్ణయముఁ జేయలేదు. ద్వైత విశిష్టాద్వైత గ్రంథంబులు పక్షపాత యుక్తంబులగుటం జేసి వానిలోనున్న శంకరకాల మంతగ నమ్ముటకు వీలు లేదు. వానివలన శంకరు లిప్పటికి ౧౫రం యేండ్లక్రింద నవతరించిరనియున్నది. బొంబాయిలో వడం సంవత్సర మందు జనార్ధన రామ చంద్రజీ ప్రకటించిన హిందూ ప్రాచార్యచరిత్రలో శంకరులు ౨గరం సం॥రముల క్రిం దట నుండిరనియు, నీతికులు ౨౨౦౦ సం॥రములని గనియు, నున్నది. శృంగగిరి మఠములోనున్న గురుపరంపరవలన విక్రమ శ౨౨ (B.C. 84)లో శంకరులాశ్రమము స్వీక రించి, విక్రమ శ౫ం (B.C 6) సంవత్సరమున సిద్ధిఁ బొందినట్లగపడును. కూడ్లిగి, కుంభకోణ, గురుపరంపరల పట్టికలు కూడవానినిఁ బోలియున్నవి. క్రీ. శ. ౧౯ వ శతాభ్దాదిని 'విల్ సన్' అను సంస్కృతపండితుడు పూ ర్వుల యభిప్రాయములన్నియు నుదహరించి తుదకు కోల్ బ్రూకు రామమోహనరాయలతో నేకీభవించి, శంకరులు క్రీ. శ. ర-వ శతాబ్దాంతమందును, F-వ శతా ఔదియందును, ఉన్నటుల వ్రాసిరి. దీనినే మ-గా- శ్రీ, కం. వీరేశలింగముగా రంగీకరించిరి. ఈయభిప్రా యము దోషయుక్తమని బ్రహ్మజ్ఞానులగు తల్లాప్రగడ సుబ్బా రావుగారు హేతుపుంజములతో 'తియాసఫిస్టు' అను దివ్యజ్ఞాన పత్రికలో నింగ్లీషున స్థిరపరచిరి.

బళ్లారిజిల్లాలో హోప్ (క్రొత్త పేటవాస్తవ్యు లును, జగద్విశ్రాంత పండితులునగు, భట్ట నీలకంఠశాస్తు లను దాదాశాస్త్రులవారు తమ 'శంకర మందార సౌరభ' మను చంపూగ్రంధములో శంకర కాలమిట్లు వర్ణించిరి:- "ప్రాసూతతిష్య శరదామతియాతవత్యా ఏకాదశాధిక శతోనచతుః సహస్రాంతిష్యశరదాం” అనగా కలియుగ