"ఆలంకృత శకస్యాభే! రసభునయ నేందుభిః"
శాసనమూలము కన్నడ లిపియందుండుటచే నేనెట్లో శ్రమ
చేసి యది “రసాభూనయనేందుభిః" యని యొక కన్న
డ మిత్రుని సాయమున స్థిరపఱచితిని. అందువలన నది
6121=1216 +78=1294 క్రీ. శ. మైనది. కాని యిది
యు సందేహముగ నేయుండెను. పిమ్మట వీరభద్రరావు
గారి శాసనమునకు మూలము చూచితిని. అందు “రసాభ్ర
నయ నేందుభిః” అనియుండెను. ఇది దిద్దుబాటులక్కర
లేక యున్న డియున్నట్లున్నది. అందువలన నది 1206 +78 =1284 క్రీ. శ. మగుచున్నది. వీరభద్రరావు గాకుపొ
కబాటున ప్రతి లిఖియించిరో, అచ్చుతప్పోయని నేనీ
కడపటి పాఠము నున్నదియున్నట్లుతీసికొంటిని. వెంటనే
1284 లో నాశాసనము పుట్టియుండునని నే తలఁచి య
ట్లు కొంతకాలమున తెలుఁగు పత్రికలలో బ్రకటించితిని.
నాకుఁ దోఁచినమఱికొన్ని యితరా ధారములఁ గూడనప్పు
డు చూపియుంటిని. కాని, యని యిచ్చట వ్రాయుట
మానితిని. నాసిద్దాంతము నెవ్వరు పూర్వపక్షము చేయ
లేదు. వీరభద్రరావు గారిని బ్రత్యుత్తరముకూడ
వ్రాయుఁ డని పత్రికాముఖమునఁ గోరి యుంటిని, వారొక సారి యొ
నర్చిన ప్రసంగమున సోముఁడు శంభుదాసునకంటె నిం
చుక బూర్వుఁడనవచ్చునని మాత్రము చెప్పిరి. నేను
27.10.14న సువర్న లేఖాపత్రికలో వ్రాసిన వ్యాసము
నందలి యుక్తుల కెవ్వరును సమాధానము వ్రాయలేదు.
ఇటీవల నాంధ్రసాహిత్య పరిషత్ప త్రిక లోఁ బ్ర
కటింపఁబడిన విప్రనారాయణ చరిత్రమున మఱల నాకుఁ
గొన్ని యాధారములు దొరికెను. అప్పుడుమఱలు నేనిట్లు
ప్రకటించితిని.
"సోముఁడు త్తర హరివంశమును వ్రాసినపిమ్మట యెఱ్ఱాప్రగడ హరివంశమును వ్రాసెను. చెదల్వాడమల్ల య్య రచియించిన విప్రనారాయణ చరిత్రావతారిక పద్య ములలో
ఉ. | శాతికృపాణ నిర్దళిత | |
(ఇందు 'యెఱ్ఱన మల్లనాహ్వయుల్' అనియుండ
వలసినట్లు తోఁచుచున్నది)
కవితాతయగు యెఱ్ఱాప్రగడ (ముత్తాతయై యుం
డవలయునని తోఁచుచున్నది?) సాళువ నరసింహరాజు
కడ బహుమానములందినట్లున్నది. ఈయెఱ్ఱన శంభుదా
సుఁడే! విప్రనారాయణ చరిత్రముననే యిట్లున్నది.
గీ. | సుకవిసంస్తుత్యుళంభుదా సుని నుతింప | |
కావున హరివంశము రచియించిన శంభుదాసుఁ
డే యీతఁడు, ఇంక నుసం దేహముండినచో నిగిచూడుఁడు.
ఆ. | , దురితహరుప్రబంధ పర మేశ్వరుని | |
కాబట్టి యెఱ్ఱాప్రెగడ సాళువ నరసింహరాజు
కడ బహుమానములనంది యాతని కాలమున నుండెను.
ఈ సాళువ నరసింహరాజు విజయనగర నిర్మాణమైన పి.
మ్మట రాజ్యము చేసిన (1) హరిహర (2) బుక్క రాయ
లు మొదలగు వారివంశములోఁ గడపటి పురుషుఁడు.
అనగా విజయనగరమును 1834 మొ|| క్రీ॥శ॥ 1400 వఱ
కును, (నావాదముననుసరించి 128 మొదలు 1400 వఱ
కును) బాలించిన పదముగ్గురు రాజులలో పదమూడు తర
ములవఱకు నరసింహరాజును పేరుగల రాజేలేఁడు! ఇంక
నున్న వారెవరనగా 1490–1509 వఱకు ముగ్గురు నరస