పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/96

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాచన సోమనాధుడు

చారిత్రికవిషయములు.

ఈకవిశేఖరుని చరిత్రము సంపూర్ణముగ నిదివఱ కాంధ్రలోకమునఁ బ్రకటింపఁబడియుండలేదు. కవిజీవిత కర్తలగు శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతుల వారీత ని శ్రీ చరిత్రము దొరకలేదని వ్రాసియుండిరి. పిమ్మట శ్రీవీ రేళ లింగము పంతులు గారీ మహాత్ముఁడు రచియించిన _ త్తర హరివంశమును వ్యయప్రయాసలకోర్చి తంజావూరు మహారాజావారి పుస్తక భాండాగారమునుండి వ్రాయిం చి తెప్పించి, ప్రకటించి యాంధ్రలోకమున కమితో ప కారమొనర్చిరి. కాని ఈగ్రంధమువలనఁ గవిచరిత్ర మేమి యుఁ దెలియుటకాధారములు లేకపోయెను. గద్యమొ క్కటి యీతఁడు తిక్కన సోమయాజి యనంతరమీ గ్రంధము వ్రాసినట్లు తెలియఁజేయుచున్నది. శ్రీవీ రేక లింగము పంతులవారీతని గ్రంధమును బరిశీలించియు, నిత రాధారములఁ జూచియు, నూహలఁజేసియు సం దేహము తోఁ గొంత చరిత్రమును గవుల చరిత్రములోఁ బ్రకటిం చిరి. ఇటీవల శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులు గా రొకచోట నొక శాసనమును బ్రకటించి, శ్రీ వీరేశలింగ ము పంతులవారితోఁ గాలనిర్ణయ విషయమున నంగీకరించి, తక్కిన విషయములలో భేదాభిప్రాయముల నొసఁగిరి. అవియైన నూహించి వ్రాసినవి. కావున నింతవఱకీ కవి చక్రవర్తి చరిత్రము మనవారికిఁ దెలియదు, తెలిసికొనుట యైన నుకరముకాదు.

ఈకవి యెప్పటివాఁడు?

ఈ విషయమై శ్రీ వీరేశలింగము పంతుల వారిట్లు పంతులవారిట్లు వ్రాసిరి. “వీనినన్ని టినిబట్టి విచారింపగా సోమకవి యె ఱ్ఱాప్రగడకుఁ దరువాతను, శ్రీనాధాదులకుఁ బూర్వము నుండుట స్పష్టము. కాబట్టి యీతఁడు హూణశకము 1880 ప్రాంతములయందున్నాడని యించుమించుగా ని శ్చయింపవచ్చును.” దీనికాధారములు మాత్రము వారెవ్వి యుఁ జూపలేదు. వీరుచూపిన ముఖ్యకారణము "పిల్లల మఱి పినవీరన్న యు 'మానన్నయ భట్టు దిక్క కవి నెట్టా ప్రగ్గడ సోమునిన్' అని యేఱ్ఱాప్రెగడ తరువాత సో ముని జెప్పినాఁడు" అని కవులు ప్రబంధములయందు వ్రాసిన యాదికవిస్తుతి యందున్న వరుసునుబట్టి సోముఁ డు యెఱ్ఱాప్రెగ్గడ తరువాత వాఁడని నిర్ణయించినారు. "ఇది న్యాయమా? సత్యమగునా?" అని సందియము X లిగి నేనీ విషయమున సూక్ష్మముగఁ బరిశీలించితిని. నీలా సుందరీ పరిణయము, యేకాదశి వహత్మ్యము మన్నాగు ప్రబంధములలో ననేకచోట్ల సోముని యెఱ్ఱాప్రగడ కం టెబూర్వమే పేర్కొనిరి. కొందఱు కేవలము యతి ప్రాసముల కొఱకు సోముని తిక్కనకంటెఁ బూర్వము పే ర్కొనిరి. కావున నట్టి స్వల్ప కారణముల నాధారము చేసికొని కాలనిర్ణయము చేయరాదు. శ్రీ వీరభద్రరావు గారొక శాసనమును కనుగొని రంటినిక గా! అందువలన సోముని విషయమై మనక నేక నూతనాంశములు తెలిసి సవి. శ్రీ వీరభద్రరావుగారు మాత్ర మాశాసనమునకుఁ గొంత విపరీతార్ధములఁ గల్పించిరి.

ఆశాసనమున కాలనిర్ణయ భాగమిట్లున్నది:-

“ఆలంకృత శకస్యాభే రసా(ర్తు) నయనేందుభి : ఇందు(రు) అను నది శాసనమును కనుగొనిన “రైను” గారు ఏపీ గ్రాఫికా కర్నాటికా పదియవ సంపుటమున, విపరీత వ్యాఖానములతో నీ “ర్తు" నువూరించిరి. ఇందున్న రస=6, ఆగ్లు=6 ఋతువులు, నయన=2, ఇందు=1 గణితశాస్త్రప్రకారము 6621 (అంకా నాంవామతో గతిః.) యెడమవైపునుండి లెక్కించినయెడల 1266 శాలివాహ న శకమగుచున్నది. అది పూరించిన వారిపొరపాటు స రిగఁ జూడక 1266 + 78–1244 క్రీ. శ. మని యంగీక రించి,వీ రేశలింగము పంతులవారి కాలనిర్ణయ వీరభద్రరావు గారంగీకరించిరి. సిద్ధాంతమును

నాకీవిషయమై సందేహము కలిగి పరిశీలనము చే• . యుచుండ నదృష్టవశమున నాకు మఱియొక శాసనము దొరికినది. అందు కాలనిర్ణయ భాగమిట్లున్నది: