పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/95

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనయాంధ్ర దేశమున తాళపత్రగ్రంధము లింటింట ను కుప్పలుతిప్పలుగ నున్నవి. కాని యవి యటుకుల పైఁ బేర్పబడి కీటకములపాలై చివుకుచు జనసామాన్యమున కుపయుక్తములుగాక యున్నవి. ఇట్టి గ్రంధముల నెల్ల సంతరించివానిని సుస్థితియందుంచి జనోపయుక్తముగనో నర్చుట పుస్తక భాండాగారములు ముఖ్య విధియైయున్న ది. కాని యిపుడిప్పుడు మనయాంధ్రదేశమున వెలయుచున్న పుస్తక భాండాగారములు ముద్రిత గ్రంధముల నె కాని యముద్రిత గ్రంధముల సేకరించుటకై యత్నములు సలుప కున్నవి. ఇది మిగుల శోచనీయము. ఐనను ముద్రిత గ్రం ధములవలె సముద్రిత గ్రంధములు సంపాదించుట యెల్లరకు సుకరముకాదు. కావున ప్రస్తుత మిట్టిభండా గారములు ఆంధ్రదేశమునందలి ముఖ్యపట్టణములలో నైన నెలకొల్పఁ బడినఁజాలును.

ప్రకృతము మన యాంధ్రభాష యందు ప్రాచ్యలి ఖిత పుస్తక భాండాగారములు మూఁడుమాత్రమె యున్న ట్లు కన్పట్టుచున్నది. అందు ఒకటి తంజావూరునందు రా జుగారి కోటయందును, తక్కి నవి చెన్నపురిలో దొరతన మువారి చిత్రవస్తు ప్రదర్శనశాలయందొకటియు, ఆంధ్ర భాషాపరిషత్తువారి కార్యస్థానమునం దొకటియునున్నవి. ఇందు తంజావూరు పూర్ణముగ నఱవదేశము. అచ్చటి కేగుట యన్న ఆంధ్రులకు 'చీమకాశీ ప్రయాణము' వంటి ది. ఇఁక చెన్న పురియో, అచ్చటనున్న యాంధ్రులకంటె అఱవలే హెచ్చు. కావున నీరెండు ప్రదేశములు ఆంధ్రు లకు మిగుల దూరమున నుండుటచే, అందలి గ్రంధములు ఆంధ్రులకు ‘అందనిమ్రానిఫలములు', కావున నిట్టిభాండా గారములు ఆంధ్రులకందఱకు కరతలామలకములుగు నుం డునట్లు ఆంధ్రదేశమునకు మధ్య నున్న ప్రదేశములయం దున్నచో నత్యంతో పయుక్తముగ నుండును.

ఆంధ్రభాషకు పుట్టినిల్లయి, యాంధ్రమండలము నకు మండ నాయమానముగనున్న రాజమహేంద్రవరమున నిట్టి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమును స్థాపించ వలయునని చిరకాలమునుండి సంకల్పించుకొని రెండుసం వత్సరములక్రిందట తాళపత్రగ్రంధములను సేకరింప మొ దలిడిరి. పెద్దాపురవాస్తవ్యులగు శ్రీరాజా వత్సవాయ రాయజగ పతివర్మ గారు తమయాస్థానమున నున్న సుమా రు 40 తాళపత్ర గ్రంధగత్నములు ఈ భాండాగారవధూ టికి కంఠహారముగ నర్పించిరి. ఇప్పు భాండాగారమున తాళపత్రగ్రంధములును వ్రాతప్రతులును సుమారు 60 గ్రం ధములుకలవు. ఇందు పెక్కు గ్రంథములు ముద్రితము లై యున్నవి. శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహము గారీ సంఘము నకు పెక్కు సంవత్సరములు అధ్యక్షులుగ నుండియుండిరి.

ఈభాండాగార ముయొక్క ఉద్దేశములు.

1. ఆంధ్రగీర్వాణభాషలయందుఁ గల గ్రంధముల న న్నియు, వలనుపడినంతవఱకు నాంగ్లేయ గ్రంధములను అం దు ముఖ్యముగ హిందూ దేశ సంబంధమైన గ్రంధములను సంపాదించుట.

2. అముద్రితములగు ప్రాచీనాంధ్రమహాకవి ప్రణీత గ్రంధముల దొరికినంతవఱకు సేకరించి, యందు సుప్రసి గ్రంధముల నచ్చొత్తించుట.

3. ఆంధ్రా గ్లేయవార్తాపత్రికలను మాసపత్రికలను దె ప్పించుట,

4. ఈగ్రంధములను పత్రికలను పఠనమందిరమునకుఁ జనుదెంచు చదువరుల నెల్ల నుచితముగఁ జదువుకొన నిచ్చుట.

5. ఇందలి గ్రంధములఁ దమగృహములకుఁ దీసికొనఁ గోరుపురుషులకడ చందాగైకొని తన్మూలమున భాండా గారము నభివృద్ధిపరచుట.

6. ఇందలి గ్రంధములఁ జదువుకొనఁగోరు స్త్రీలకడ చందా గైకొనకయె వలయు పుస్తకముల వారిగృహాముల కు సేవకునిచేఁ బంపి స్త్రీవిద్య ప్రోత్సాహపఱచుట,

7. జ్ఞానదాయకములు దేశాభివృద్ధికరములు నగు ను పన్యాసములు నిప్పించుట,

8. భాషాభివృద్ధిని దేశభక్తిని నీతిని బురిగొల్పు పొ త్తములను పత్రికలను కరపత్రములను ప్రచురించుట.

9. స్త్రీ పురుషులయం దున్నతజ్ఞానమును పెంపొందిం చుటకై వత్సరమునకొకసారి పరీక్షలఁ గావించుచు నం దుఁ గృతార్ధులై నవారికి బహుమతుల నొసంగుట.

ఈ భాండాగారమునకు రాజమహేంద్రవరమున “హిందూబాల సమాజము " శాఖా సంఘముగ నున్నది. ఈ గ్రంధభాండాగారమునకు భవనమును నిర్మించుటకై ఆరు వేల రూపాయిణులు గావలసి యుండునని మదింపు వేసియు న్నారు. ఈగ్రంధాలయము యొక్క నామము యిటీవల “సర్వజన గ్రంధాలయ”మని మార్చియుండిరని దెలియవ చ్చుచున్నది.