పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/89

ఈ పుటను అచ్చుదిద్దలేదు

63

లెను. ఇదివరకు ప్రచురించినవి, ఇప్పుడు ప్రచురింపబోవునవి, అన్ని గ్రంధములును ఇందు దొరకవలెను. ఇయ్యది ధనాధికు లెవరైన స్థాపింపవచ్చును. లేదా వాటాల పద్దతినైన నొక సంఘము స్థాపింపవచ్చును.

ప్రతిమానవుడు ప్రతిగ్రంథమును కొనగల ద్రవ్యసంపత్తి గలిగి యుండకపోవచ్చును గాని ప్రతి గ్రామము కలసి అధమపక్ష మొకగ్రంధముకొని పఠింపకపోలేదు. అట్టితరుణమువ కొద్దియెత్తుననైన పుస్తక భాండాగారములను ప్రతిగ్రామమున స్థాపించుటకై ప్రయత్నములు సలుపవలెను.

ఈ పై నుదహరించిన పుస్తకశాలవారు ఈగ్రంథభాండాగారమువారు తమతావున దొరుకు పుస్తకముల పట్టీలను విరివిగ ప్రతిగ్రామము ప్రతియింటా జేరునట్లు పంచి వేయవలెను. అం దేనెల కానెల నూతన గ్రంథములని ప్రశస్తగ్రంధములని పై పట్టిక లో జూపుచుండవలెను. వాటిపై ప్రముఖులిచ్చిన అభిప్రాయములను ప్రచురింపు చుండవలెను.

గ్రంధకర్త లైనవారు తమ గ్రంథములను ప్రాముఖ్యుల కుచితముగ బంపి వాటిపై వారి యభిప్రాయములు వచ్చునటుల చేయవలెను. వీలయినతావులనగా ప్రతిపట్టణములోను, ముఖ్య రెయిల్వేస్టేషనులలోను, సామాన్య అంగడులలోను, దొరుకులాగున కమీషన్ పద్ధతిని ఏజంట్ల నేర్పరచి అమ్మించవలెను. అట్టి ఏజంట్లు సరీగా లెక్క చెప్పరను భయముకద్దు. కాని సౌమ్యులనే యేరు కొనవలెను. పుస్తకధరలు కొంచెము సరసముగా నుండవలెను.

ఇందు విషయమై మన జయమంతయు, తుదకు ఆదానికల క్రింద మనము ధారాళముగా వెచ్చించు ద్రవ్యమునుబట్టియు ఆదానికలు వ్రాయురీతిని బట్టియు నుండుసని జ్ఞాపకముచేయుచున్నాను. ఆదానికల క్రింద విరివిగా వెచ్చించినవారు ఎవరును చెడిపోయినవారు లేరు. ఇందులకై హిగి౯ బాతం మున్నగు కంపినీల వారిని చూడుడు. వారెట్లు విరివిగ ఆదానికల ప్రకటించి వెల్లడించెదరో! మనలోను ఇందులకు విక్టోరియాడిపో, విలియం అండు కో, మున్నగువారు నిదర్శనముగానున్నారు.. ఈ పద్దతులమీద ఆంధ్రగ్రంథముల వ్యాపనకై ప్రయత్నింపుడని ప్రార్థింపుచు విగమించుచున్నాను.

కొడాలి శివరామ కృష్ణారావు.

శ్రీ వీరేశలింగకవి పుస్తక భాండాగారము, రాజమహేంద్రవరము.

దేశాభ్యుదయమునకు భాషాభివృద్ధి ప్రధమ సోపానము. భాషాభివృద్ధికిఁ బుస్తక భాండాగారము లె ప్ర ధాన సాధనములు. ఏదేశమునఁ బుస్తక భాండాగారములు మిక్కుటముగ వెలయుచుండునో, యా దేశము సకలకళలకు నెలవై నాగరకతకుఁ దావలమై యఖిల సంపదలతోఁ దులతూఁగుచు నత్యున్నతపదవి నలంక రించియుండును. భాండాగారములవలనఁ గలుగు ప్రయోజన పరంపరల లెస్సగ గ్రహించియె జర్మని, ఇంగ్లండు, అమెరికా, జపాను మున్నగు 'విదేశములవారు తమతమ దేశములఁ బ్రతి పట్టణమునఁ, బ్రతిగ్రామమున, వేయేల ప్రతిగృహమున భాండాగారములఁ గుప్పలు తిప్పలుగ వెలయింపఁజేసి ప్రపంచమునందలి జాతీయులలో నెల్ల నాగరకాగ్రగణ్యులని వినుతికెక్కి యుండిరి.

ప్రకృతము మనహిందూ దేశమునఁ గూడ పుస్తక భాండాగారముల యావశ్యకత గ్రహింపఁబడి బరోడా మున్నగు ప్రదేశములయందు భాండాగారములు నెలకొల్పబడుచున్నవి. మన యాంధ్రదేశమునందు సయిత మచ్చటచ్చట కొన్ని భాండాగారము లిపుడిప్పుడు స్థాపింపబడుచున్నవి. సుమారు పదునై దువత్సరముల క్రిందట మన యాంధ్ర దేశమున నాంధ్ర భాండాగారము లంతగ వ్యాపించియుండని సమయమున మనమాతృభాషకుఁ గలిగిన యీ అంతను గొంతవఱకు నివారించి యోపినంత వరకు దేశ సం సేవన మొనరింపఁగోరి, యాంధ్రభాషావధూటికిఁ బుట్టినిల్లనఁ దగు రాజమహేంద్రవరమున 'వీరేశలింగ పుస్తక భాండాగారమను పేరిట నొక భాండాగారమును స్థాపించిరి.