పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/88

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర గ్రంథములు విరివిగ వ్యాపించుటెట్లు.



పూర్వము సౌకర్యములు తక్కువగ నున్నపుడు మన ప్రాచీనకవులు తమ యనుభవముల నన్నిటిని తాళపత్రములవ్రాసి గ్రంథస్థము జేసియుండిరి. వాటి వాసన గ్రహించినవారు ఎంతయోశ్రమపడి వాటి ప్రతులను వ్రాసికొనుచుండెడివారు. ఇప్పటికిని కొన్ని యిండ్లయందు వ్రేలాడగట్టబడియుండు తాళపత్రగ్రంధములనేమి, కాగితములమీద అచ్చుగుద్దినలాగు వ్రాసిన ప్రతులనేమి, జూచుట తటస్థించినపుడు ఆ గ్రంధములు వ్రాయుటకు వారుపడిన శ్రమ, వారి శ్రద్ధాభక్తులు, మనకు ఆశ్చర్యమును గొలుపక మానవు.

ప్రస్తుతము ముద్రాయంత్రములు విరివిగ ప్రబలుటచే తాళపత్రములమీదను వ్రాసికొను దశ యంతరించి స్వల్పధరలకు సందరికి లభించులాగున అచ్చు ప్రతులు దొరుకుచున్నవి. పూర్వులు వ్రాసిన గ్రంధములను వారు అంతరించుటతోడ నే వారి సంతతివారు వాటివిలువ తెలియక కొందరు, యచ్చువేయ సమర్థతలేక కొందరు, వ్యర్థము గావించియుందురు. ఇప్పటికిని గ్రంధము అచ్చు వేయించినవారు గతించుటతోడనే వారిసంతతివారి తెలివి లేమిచే నయ్యవి యింట నే యొదిగి బైటకు రాకున్నవి. ఖరీదునకు చిక్కకున్నవి. కొందరు పూర్వగ్రంధములను సాధించి సంపాదించి, అచ్చు వేయించి ప్రజల కుపకారము చేయుచున్నారు. ఇప్పటివారిలో బుద్ధిమంతులు తమ శక్తికొలది గ్రంధములు వ్రాసి ప్రచురింపుచు భాషకు నూత నాలం కారముల నొనగూర్చుచున్నారు. ఏ వ్విధమునచూచినను గ్రంధములు విరివిగ బయలు దేరుచున్నవి. వాటి గ్రంధకర్తలకు తగినంత ఉత్సాహము కలుగులాగున యవి దేశమందంతటను వ్యాపించుట లేదు. ఇట్లు వ్యాపింపకుండుటకు కారణము లెవ్వియో నించుక విచారింతము. ఇతర దేశములలో పుస్తకము అచ్చు వేయించుటకగు ఖర్చులకన్న హెచ్చు మొత్తమును ఆ పుస్తకము అమ్ముడుపోవుటకై ప్రకటించు ప్రకటన పత్రికల నిమిత్తము వెచ్చింతురు. మనమో ర్పు 100 లు గాని ర్పు 200 లు గాని పుస్తకము అచ్చువేయించుటకై ఖ ర్చు పెట్టి, ర్పు 10 లు అయినను ప్రకటన పత్రికలనిమిత్త ము వెచ్చించుటకై శంకించుచున్నాము. అందుమూల మున అసలుగ్రంధము అచ్చుపడినదన్న సంగతియే వెల్లడి కాకపోవుటయు, దేశమంతట వ్యాపింపకపోవుటయు త టస్థించుచున్నది. మనలో ఆంధ్ర పుస్తకము లన్నిటిని ఒకచో జేర్చి అమ్ము పుస్తకశాల గాని, అన్ని పుస్తకము లు లభింపగల గొప్పగ్రంధ భాండాగారము గాని లేదు. సాధారణముగా కొన్ని దేశములయందు గ్రంధము మంచి దైనను కాకున్నను, గ్రంధకర్తలను నూతన గ్రంధముల వ్రాయ ప్రోత్సహించుటకై ఆ గ్రంధమును కొనెదరు. అది వారి నై జస్వభావముగా నున్నది. మన కట్టి స్వభా వేములేదు. మన మితర దేశముల వారితో ద్రవ్యవిషయమున సమానము గా నేరకున్నను, ఉన్న దానిలోనైన, చేయ తగినంతమట్టుకు గ్రంధకర్తలకు ప్రోత్సాహము చేయకున్నారము.

ఇక మనగ్రంధములు విరివిగ వ్యాపింపజేయుటకై సాధనము లాలోచింతము.

తామసు కార్లలియస్ వ్రాసినట్లు మనగ్రంధములలో రుచిచూడవలసినవి, నమలవలసినవి, నమలి మ్రింగవలసినవి గలవు. వీటియొక్క ప్రాశస్త్యా ప్రాశస్త్యములను లోకమునకు తమ యభిప్రాయములమూలమున వెల్లడింపగల పండిత సంఘము నొకదాని నేర్పరచుట ముఖ్యము, అయ్యది శాఖలుగానుండవలెను. అనగా పద్యకావ్యములను పరిశీలించు నుపసంఘము, చరిత్రలను పరిశీలించు నుపసంఘము, ఈమాదిరి నుపసంఘములు గలిగిన పెద్ద సంఘమొకటి అత్యవసరము. వీరివలన మన్నననందెన గ్రంధముయొక్క విరివి వ్యాపనకై మనము తోడ్పడవలెను.

చివర కెట్టి చిన్న గ్రంధమైనను ఎంత విలువగల గొప్పగ్రంధమైనను కార్డువ్రాసినతోడనే సప్లయి చేయగల పుస్తకశాల యొకటి ఆంధ్రదేశమధ్యమున స్థాపింపబడవ