పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/82

ఈ పుటను అచ్చుదిద్దలేదు

60


నివేశన స్థలము.

గ్రంధభాండాగారములకు స్వంతభవనములుండిన గాని శాశ్వత ప్రతిష్టాపనలు కాజాలవని ప్రధమమునుండి యు ఈ గ్రంథాలయమువారికి గట్టి నమ్మకముగలదు. అభిమానులగువారు కొందఱు గ్రంధములను గొన్నిటిని, సామానులను గొన్నిటిని, సమకూర్చి నొకచో నుంచుట యు, కాలక్రమమున నవి నామమాత్రావశిష్టము లగుట యు వీరు తరుచుగా జూచుచుండిరి. గ్రంథ భాండాగారము లెంత చిన్న వైనను తగుపాటిగృహములు వానికుండుట ప్రథానక ర్తవ్యమని వీరి యాశయము; అట్టి శాశ్వత పయత్నలోపమే ‘మఖ'లో పుట్టి 'పుబ్బ'లో మాడెడు సంఘములకు మూలకారణమని వీరియనుభవమునుబట్టి ప్పగలరని వ్రాయుచున్నారు. అందుచేత ప్రత్యేక భవనము వలయుననెడి వాంఛ కేవల శైశ నావస్థయందుండగ నే వీరినా వేశించినది. శ్రీ తిరువూరు రాజాగారు భవనమును గట్టించెదమని జేసిన వాగ్దానము వీరి నుత్సాహపరుపు, నివేశన స్థలమును సేకరించుటకై ప్రయత్నించిరి. దినదినాభివృద్ధినిగాంచుచున్న బెజవాడ పట్నమున స్థలమును సేకరించుట ఆల్పకార్యము గాదు.

అంతట 8 4,18 తేదీన ఈ సంఘమును కృష్ణాజిల్లా రిజిస్ట్రారు వారి ఆఫీసునందు 1860 సం॥ 21 నంబరు అక్టు ప్రకారము రిజిష్టరు జేసిరి. అది జరిగిన రెండుదినములకే బెజవాడ మునిసిపాలిటీవారు నివేశన స్థలములను వేలమున విక్రయించెదమని ప్రకటించిరి. అప్పుడు వీరిచే తులలో సొమ్మేమియులేదు. ఉత్సాహామును, స్వార్థ త్యాగుల యభిమానమును, మూలధనముగా జూచుకొని 2191 చ. గజముల స్థలమును రు 3424_2_3 లకు కొన్నా రు. నివేశన స్థలమున కయిన ఖర్చులో శ్రీ మునగాల రా జాగారు శ్రీరాజా నాయని వెంకటరంగారావు బహద్దరు జమీందారుగా రయిదువందల రూపాయిలును, శ్రీపాటి బండ సుబ్రహ్మణ్యముగా రయిదువందల రూపాయిలును, శ్రీబొడ్డపాటి వెంకటప్పయ్యగా రయిదువందలరూపాయి లను యిచ్చియుండిరి. మిగిలిన సొమ్ము విరాళముల వలన వసూలయినది.

భవననిర్మాణము.

నివేళనస్థలమును గొనుటతోడను, అందుకై చందా లు వేయించుటతోడను వీరి పని పూర్తికాలేదు. శ్రీతిరు పూరు జమీందారు గారి దగ్గరకు బోయి తమ వాగ్దానము ను జెల్లింపవలసినదని కోరిరి. దయాపూర్ణుడగు నామహ నీయుడు వారి కోరికను నిర్వర్తించుట కంగీకరిం చెను, అప్పుడు, మద్రాసుగవర్నరు గారి శాసన నిర్మాణసభ్యుల గు ఘనతవహించిన పి, యస్. శివస్వామి అయ్యగారి చే 1918 సం॥ సెప్టెంబరు నెల 1వ తేదీన మునిసిపాలిటీవారి . వద్ద కొన్న స్థలమునందు పునాది రాతిని వేయించిరి. పిమ్మ ట భవననిర్మాణమును జేయనారంభించిరి. కడచిన డిశం బరు నెలలో శ్రీ చెన్న పురిరాజధాని గవర్నరుగారు బెజ వాడకు విచ్చేయు సందర్భమున శ్రీవారిచే బ్రవేశమహో త్సవమును జేయింపవలెనని కుతూహలమును జెందిరి. కా ని ఈభాండాగార భవనమును కట్టించుచున్న శ్రీతిరువూ రు జమీందారు గారు అకాలమరణము నొందుటచే వీరి కోరికను నెరవేర్చుకొన జాలక పోయిరి. పని బ్రారంభించి నపిమ్మట ఆపుటకు వీలులేక, శ్రీతిరువూరు రాజాగారు ఇచ్చిన రు 2100 లను వ్యయపరచిన పిమ్మట, రు 4000ల ను అప్పుజేసి పనిని సాగించి చాలాభాగమును పూతి జేసి అందు భాండాగారము నుంచగలిగిరి. ఈభవనము యొక్క మొదటి అంతస్తు పూర్తియగుట కింశను రు 2000 లు గావలసియున్నవి. దీనికి శ్రీ తేలప్రోలు నిచ్చెదమని వాగ్దానము జమీందారు గారు రు 1000 ల చేసియున్నారు.

పంచములకు పాఠశాల.

శ్రీయుత అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు బి. ఏ., బి. యల్., గారి యాజమాన్యముక్రింద ప్రారంభింపబడిన పంచముల పాఠశాల 1914 జనవరి నెల నుండియు ఈ సంఘము యొక్క యాజమాన్యమునకు దీసికొనబడినది, ఇది పగటి పాఠశాలయైయున్నది. ఇందు బాలురు 24 గురును బాలికలు 8 గురును కలరు.

స్త్రీచదువరులు.

స్త్రీలకు ఉచితముగనే చదువు కొనుటకుగాను