పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/81

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ రామమోహన ధర్మ పుస్తక భాండాగారము, బెజవాడ.

ఆధునిక కాలమందు మానవుని జీవయాత్ర కష్టతరమైపోయినది. ఎవరికి వారు కాలూది నిలుచుటకుఁ గొట్టుకాడుచున్నారు. విశ్రాంతి తగ్గినది. కాలపరిణామముచేతను పూర్వపశ్చిమ పరిజ్ఞాన సంఘట్టనముచేతను, మన ప్రాప్యములు మన యలవాటులు మన మర్యాదలు నెన్నియో విధములఁ బూర్వముకంటే మార్పు జెందినవి. మనపూర్వులు దమ విశ్రాంతి కాలములయందు, నేదేవళముననో, యేతటా కోపొంత తరుచ్ఛాయలతో కూడి ఇహపర సౌఖ్యదాయకములగు నంశములను గూర్చి ముచ్చ టించుకొనుచుండిరి. ఇందువలన పు సకములను జదువగలిగినవారికే గాక, వ్రాయనుఁజదువను రాని వారలకు గూడ జ్ఞానమబ్బుచుండెడిది.

ఇప్పు డిదియంతయు మారినది. పూర్వముకంటే జనులు పట్టణముల కెక్కువగా మూగుచున్నారు. జనులకు విశ్రాంతి తగ్గినది, ఒకరి విశ్రాంతి సమయము మఱియొకరిదిగాదు. దేవాలయములయందు భక్తి రానురాను తగ్గుచున్నది. ఇది యుచితమా యనుచితమా యను నంశము ప్రస్తుతము విచారణీయము కాదు.

మనము క్రొత్తత్రోవల ద్రొక్కిన నేగాని జ్ఞానాభివృద్ధి కానేరదు. పూర్వమువలె మనదేశ మభివృద్ధి ఁ బొందవలెనన్న మన పూర్వుల హృదయసీమలయందు దేవళము లెంత గౌరవనీయములుగా నెలకొల్పబడినవో, మన హృదయములయం దీనాడు పుస్తక భాండాగారము లంత గౌరవనీయములుగ నెలకొల్పబడవలెను. ఒండొరులు కలసికొని తమభావములను బ్రకటించుకొని యన్యోన్యము లాభము పొందుటకును, ప్రజాసామాన్యమునకు జ్ఞానమును వ్యాపింపజేయుటకును నేటి పుస్తకాలయములే ము ఖ్యసాధనములు. ఈ యుద్దేశ్యములను మనస్సులయందుంచుకొని, నలుదిక్కులకఱుగు నినుపదారులకు కూడలియై, ఆంధ్రదేశమునకంతకును నాయకమణిగా నొప్పుచున్న బెజవాడపురమున నీ "రామమోహన ధర్మపుస్తక భాండాగారము" ను నెలకొల్పిరి.

చరిత్ర సంగ్రహము.

కలకత్తా నివాసులగు శ్రీయుత బాబు హేమచంద్రసర్కారు యం ఏ., గారివలనను, లండకు నగర మునందున్న “బ్రిటిషు అండు ఫారిన్ యూనిటేరియన్ సంఘము” వారివలనను ధర్మముగా నొసంగబడిన 200 పుస్తకములను జేర్చి 1908 సంవత్సరమునందు "ఆస్తిక పుస్తక భాండాగారము" అనునామమున పుస్తకభాండాగారము నొక బానిని ప్రార్థన సమాజమందిరమునఁ బ్రస్తుతము బ్రహ్మమతవ్యాపకులుగానున్న శ్రీయుత ఇ. సుబ్బుకృష్ణయ్య గారు స్థాపించిరి. కాని అయ్యది యొక మారుమూల నుండుటంబట్టి జనసామాన్యమున కుపయోగకారి కాజాలదయ్యె. ఇట్లుండ 1911 సం. జనవరిమాసమునందు కొందఱు యువకులు కూడి స్వల్పముగ చందాలను వేసికొని, ప్రార్థనసమాజము వారి యనుమతిమీద నాపుస్తకములను దీసికొనివచ్చి బకింగుహాంపేటలో నెల్లఱు వచ్చుటకు వీలయిన ప్రదేశమునందు “రామమోహన ధర్మపుస్తక భాండాగార” మను నామమున బ్రస్తుతభాండాగారమును నెలకొల్పిరి.

ప్రధమమున కొందఱు పెద్దలనడిగి యొకటి రెండు వార్తాపత్రికల నుచితముగ దెచ్చి సాయంకాలమునందు జదువుకొనుచుండిరి. వసూలయిన చందా మొత్తము ఇంటి యద్దెకును దీపపు ఖర్చునకుమాత్రము సరిపోవుచుండెను. కాని, యీభాండాగార మట్టి హీనస్థితియందు రెండుమూడు మాసములకన్న నెక్కువకాల ముండ లేదు. దినదినాభివృద్ధినొందుచు వచ్చినది.

ఇట్లు భాండాగార మభివృద్ధికాగా ప్రధమ వాషి౯ళోత్సవసమయమున, కీర్తిశేషులైన శ్రీరాజా వెల్లంకి చిన వేంకట్రామారావు బహద్దరు జమీందారు గారు భాండాగారమునకు శాశ్వతభవనమును తమ స్వంత ఖర్చుతో నిర్మించి యిచ్చెదమని వాగ్దాన మొనర్చి తమ సహజౌర్యమును వెల్లడించిరి.