54
ఇట్లు జ్ఞానము లిఖిత గ్రంధస్థమైన యనంతరము నిట్టి గ్రంధము లగుదుగ దొఱకుట చేతఁ బ్రభువులు ప్రసి దేవాలయముల యందును దమనగరుల సరస్వతీ నిల యములందును నట్టి గ్రంధములు సంపాదించియుంచి జనులు ధారమును గల్పించుచుండిరి. ఇదియె మన దేశ మునఁ బుస్తక భాండాగారముల కారంభము.
మన దేశమున నార్యస్వతంత్ర ప్రభువులు ప్రభుత్వ ము చేయుఁచుండ భాండాగారములు క్రమక్రమముగా వర్ధిల్లుచుండినవి. తరువాత జైన బౌద్ధులు ప్రబలి తమ మఠ ములయందు మొదట తమతమ గ్రంధములను బిమ్మట నితర గ్రంధముల సైతము సేకరించి గ్రంధభాండాగారము సభివృద్ధి చేయుచుండిరి.
ఆనంతరము భరతఖండమున మహమ్మదీయ ప్ర భువులు ప్రవేశింప మన దౌర్భాగ్య కృష్ణ పక్షాంధతమస ము దేశమంతయు నావరించె. గ్రంథభాండాగారము లంగారకున కాహుతులయ్యె. జ్ఞానాభివృద్ధికి హానిగ లె. భాషలకు క్షేణ్యము సంభవించె.
అంతే భారతీయ భాగ్యవశమునఁ నాంగ్లేయ ప్రభు త్వమను శుక్లపక్షము బ్రారంభమయ్యే. ఆంగ్లేయ రాజ్య ము చల్లదనమున మాత్రము చందురునిబోలి వాని యస్రి రతి వహింపక సూర్యునిపగిది సుస్థిరమై తేజోవంతమై నిఖిలజీవనాధారమై దేశీయ స్వాతంత్ర్యప్రదాయక మై నాట నాటుకొని నానాటఁ జలపడుచు వెలుంగుచుండుగాత.
గ్రంధభాండా గారముల పునరుద్ధానముచేయ సమ యము వచ్చినయది. మనదేశము మహమ్మదీయ ప్రభు త్వాంధకారమున మునిఁగి బలవత్సుషి ప్తిని బొంది జీవచ్ఛ వముపగిది నిర్వ్యాపారతఁ జెందియుండు కాలమున నన్య దేశీయులు విజానమందును నాగరికత యందును మనల జ్ఞానమందాఁటి ముందు మిగిలిపోయిరి. మనము మేల్కొని మన ల మిగిలిపోయినవారినిఁ బరువంటుకొనవలసి యున్నది. ఇది ప్రబలప్రయత్న మున గాని సాధ్యము గానేరదు. మన యదృష్ట వశమున ప్రభుత్వమువారు మన కన్ని విధములఁ దోడ్పడనున్నారు. మన ముత్సాహసమన్వితులమై ప్రయత్నింపఁదగును. దేశమున కొలఁదిమందిమాత్ర ముత మజ్ఞానము సంపాదించుట వలన దేశాభివృద్ధి కలుగఁజాల దు. జనసామాన్యమునకు యధోచిత జ్ఞానము కలుగవల యు. వలయు గ్రంధభాండాగారముల స్థాపించి ముంద డుగిడినారము. ఇక వెనుకతీయక పట్టువిడువక మన ప్రయత్నమును గొనసాగించి కృతకృత్యులము గావలయు.
“విఘ్నేర్ముహుర్ముహురపి ప్రతిపాన్యమా నాః
ప్రారబ్ధము తమగుణానపరిత్యజంతి”
ఇట్టి గ్రంథాలయము లన్యదేశములందుఁ మిగులఁ బ్రబలి యున్నవి. వీనికిని పూర్వకాలపు గ్రంథాలయములకును గొంత తారతమ్యము కలదు. రాకపోకలకు సులభములు కాని కాలమందెక్కడ నేగ్రంథము దొరకునది గుటయే దుస్తరముగా నుండినది. తెలిసిన యనంతరము నొక్కొక్క గ్రంథమునకై యెంతెంత దూరప్రయాణ ములో చేయవలసియుండె. అచ్చులేనందున బ్రచురము లేక యెన్నియో కష్టముల యనంతరము లభించిన గ్రం ధమును మొదలునుండి చివరవఱకుఁ జేతులార వ్రాసికొ నినం గాని తనదిగాదు, ఇట్లొక్కొక్క గ్రంధమును సం పాదించుటయం దింతటి కష్టముండ నా కాలమున గ్రంథ భాండాగారములఁ జేర్చుటయన్న నెంతటి కష్ట కార్య మొ యోజింపుఁడు, ఇట్టి గ్రంథ భాండాగారము లరుదు గ మూలకొక్క టెక్కడెక్కడనో మాత్రముండుట చిత్రము గాదు.
పండితు లీ పుస్తక భాండాగారములకు యాత్రలు సలిపి యేఁడులకొలఁది యట నిల్చి జ్ఞానము సంపాదించు చుండిరి. అట్టి యాత్రికులకు వలయునన్ని విధములయిన సౌకర్యములును నన్న పానాది సాహాయ్యములును భాం డాగా రాధిపతు లొడగూర్చుచుండిరి. కాని యెన్ని చే నను జనసామాన్యమువు కీ గ్రంథభాండాగారము లుప యోగించుచుండినవి కావు. జనసామాన్యమునకు చదువ క్కఱలేదను నాకాలపు దురభిప్రాయము గూడ దీనికి గారణముగా నుండచోపు. అప్పటి యభిప్రాయము లెట్లుం డినను కాల మిప్పుడు మాఱినది. చదువందఱకు నవళ్య మనుట తేటపడినది.
ఇప్పుడు నేక దేశములయందు జనుల కందఱకును జదువను వ్రాయను దెలిసియుండవలసినదని నిర్బంధపఱ