53
న రీతిని నిర్వహింపజేసినచో నిందువలన గలిగెడు లాభ మమితము. అమెరికా దేశమున నీయుద్యమ మ సేక విధ ముల సర్వజనాదరణీయముగా జేయబడి దేశమున కమి తోపకారము కలుగ జేయుచున్నది. ఇట్టి భాండాగారముల వలననే జ్ఞానోపదేశమును బొంది ఆండ్రూ కార్నీ జీ అనునతడు అపరిమితైశ్వర్య సంపన్నుఁడై యట్టి లాభము నె యితరుల కందఱకు గలుగ జే మనిచ్చగించి తన యా జీతములో విస్తారభాగ మాయుద్యమము నిమి త్తము వి నియోగపఱచి యెల్లెడల గ్రంథభాండాగారములను స్థాప నముచేసి బీదసాదల కుచితముగా జానసంపాదన సాధ నముల కలుగజేసి యున్నాడు. అట్టి పద్ధతుల నెల్ల కడు శ్రద్ధతో పరిశీలించి శ్రీ బగోడా మహారాజు వారుగూడ తమ రాష్ట్రములో నట్టి భాండాగారములను స్థాపించి, కుగ్రామవాసులకు గూడ వానిలాభము నందజేయు నుద్దే శముతో (Circulating Libraries) పరివత౯న పుస్తక భాండాగారములను కూడ నెలకొల్పినారు. అట్టి ప్రయ త్నము లమిక ధన సాధ్యములు. మన కిప్పుడవి దుస్సా ధ్యములు. అయినను కాలక్రమమున దొరతనము వారి సహాయ్యమువలన గాని, మన పరస్పర సహాయమువలన గాని లేక జమీందారుల యొక్కయు మహారాజుల యొ క్కయు తోడుపాటువలన గాని యవి సాధ్యములు కా వచ్చును. ఈ భాండాగారములు చేయవలసిన కార్యవి ధానము మనకింకను సరిగా బోధపడలేదు. ఈ కార్యము నందు దగు ననుభవము గల వారిని నియమించి ఆయా దేశముల కనిపి, అక్కడక్కడి పద్ధతులను పరిశీలించి వానిని మన దేశమున బ్రవేశ పెట్టవలసి యున్నది.
ఈ భాండాగారముల నేయేవిధముగా నడిపిన నెక్కువ లాభకరముగా నుండునో యామార్గముల నెల్ల మీూ రారసి చూడవలయును. వీనిని గ్రమమైన విధమున నడిపినచో నత్యంతో పయోగకరములుగ మాత్రిము నిస్సందేహము.
మతాంతరుల నేకులు మన దేశమందుండి స్వమత భూషణము, పరమత దూషణము చేసి మనలను మత దూరులుగ జేయుచున్నారు. జనసామాన్య మజ్ఞా నాంధ కారమున మురిగియున్నది. ఇట్టి యరిష్టముల నన్నిటిని దొలగించుటలో నీయుద్యను మొక ముఖ్య సాధనము గనుక దీనిని క్రమముగ నుపయోగించు మార్గము ననుభవ శాలులైన విూరందఱు కనిపెట్టుదురు గాక! మనమట్టి విషయమై యిప్పుడు చర్చింప సమావేశమై యున్నా ము గావున నా నాస్థలములనుండి యిందుకొఱకై యిట కువచ్చిన ప్రతినిధులయెడల సన్మాన సంఘము వారి వలన కలిగిన లోపములనుమన్నింపుడని సంఘపక్షమున మిమ్ము లను గ్రమ్మఱ వేడుకొనుచు నపారానుభవము, కార్యని ర్వహణ నైపుణ్యము జ్ఞానసంపద మొదలగు సుగుణము ల కాకరమై మనకందఱకు మార్గదర్శకులుగా నుండదగు నగ్రాసనాధిపతి 'నెన్న కొని యీసభను జయప్రదము గా జరుపుదురు గాక!
మహాజన సభాధ్యక్షులగు హానరబిల్ పానుగంటి రామా రాయనిగారి యుపన్యాసము.
సోదరసోదరీమణులారా! భాషాభిమాన ఘనులా రా! ఆంధ్రగ్రంధాలయ కార్యనిర్వాహక సభ్యులారా! అవధరింపుడు..
ఆంధ్రమహామండలికి మండనాయమానమై రాజి ల్లు నీరాజమహేంద్రవరమున నేడు జరుగనున్న శ్రీమ దాంధ్రదేశ గ్రంధాలయ సభయందు నన్ను గౌరవించి యగ్రాసనాధి పతిత్వము వహింప నాజాపించినందుకుఁ దమయెడ నేనెంతయుఁ గృతజ్ఞుఁడను,
ప్రప్రధమమున లోకమున లిపి యేర్పడకమునుపు మానవులు తమ ప్రజ్ఞాబలముచే జ్ఞానమును సంపాదించి జ్ఞాననిధులై జిజ్ఞాసువులగు నితరులకుఁ దామెఱిగిన విష యములు సమయోచితముగఁ గఱపుచు లోకోపకారము చేయుచుండిరి. జ్ఞాన మభివృద్ధి కానుగాను నట్టి జ్ఞానము నశింపకుండుటకై జ్ఞానులు తాము సంపాదించిన జ్ఞానము ను ఛందోబద్ధమగు భాషయందు నిలిపి స్థిరపఱచిరి. మన వేదాదులట్టివి. వానిని మనఋషులు తమ శిష్య పరంపరకు గఱపి ప్రపంచమున వ్యాపింపఁజేయుచుండిరి. చిరకాలా నంతరము లిపి యేర్పడి జ్ఞానమును గ్రంధస్థాపితమై సుస్థి రమయ్యె.