పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/72

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీసభవారు వారి కుటుంబములకు తమ సానుభూతిని దెలుపుచున్నారు.

అగ్రాసనాధిపతి గారిచే నుపపాదింపబడినది.

2.వ తీర్మానము.

విద్యాభివృద్ధి చేయుటయందు గ్రంధాలయములు ముఖ్యస్థానములు గనుక (ఏ) ప్రస్తుతము ఆంధ్రదేశమున స్థాపింపబడియున్న గ్రంథాలయములకును, పఠనమందిర ములకును, మ్యునిసిపాలిటీ, డిస్ట్రిక్టు తాలూకా బోర్డుల యొక్క ద్రవ్యములనుండియు, ప్రొవిజ్షియల్ రివిన్యూ లనుండియు ద్రవ్యసహాయమును జేయుటకు సదుపాయ ములను గలుగ జేయవలసినదని ప్రభుత్వము వారిని ఈ సభ వారు ప్రాథి౯ంచుచున్నారు. (బి) ఆంధ్రదేశమధ్యము న అనుకూల మైన స్థలమునందు, ఆంధ్రభాషయందు ప్ర చురింపబడు గ్రంథములనన్నిటిని పత్రికలనన్నిటిని చెన్న పట్టణ ప్రాచ్యలీఖితపుస్తక భాండాగారమందలి ఇతర అముద్రిత గ్రంధప్రతుల నన్నిటిని జేర్చి ఆంధ్రదేశమందలి ఇతర గ్రంధాలయములకు సహాయభూతముగ నుండున టుల గ్రంధాలయము నొకదానిని ప్రభుత్వమువారు నెల కొల్పుట ఆత్యావశ్యకము గనుక అట్టి గ్రంథాలయమును త్వరలో స్థాపించుటకు ప్రభుత్వమువారిని ఈ సభవారు ప్రాథి౯ంచుచున్నారు.

ఈతీర్మానమును హానరబిల్ రావు బహద్దరు మో చర్ల రామచంద్రరావు పంతులుగారు ఉపపాదించిరి. ఒంగోలు పురవాసులగు మిట్టదొడ్డి సుబ్బారావు పంతులు గారు బలపరచిరి.

3వ తీర్మానము.

దొరతనము వారిచే ప్రచురింపబడు పరిశ్రామిక ఆ రోగ్యవిషయిక ప్రచురముల నన్నిటిని, జిల్లా గెజిటీలను, ఆంధ్రభాషయందు ముద్రింపబడిన గ్రంథముల పట్టిక లను ఆంధ్రదేశమునందలి గ్రంధాలయముల కన్నిటికిని ఉచిత . ముగా దయచేయవలెనని ఈసభనారు ప్రభుత్వము వారిని ప్రాథి౯ంచుచున్నారు.

4.వ తీర్మానము.

ఆంధ్ర దేశమునందంతటను గ్రంధాలయోద్యమము ను వ్యాపింపజేయుటకై సంచారకార్యదర్శి నేర్పాటుకే యుటకు కావలసిన ద్రవ్యమును సమకూర్చుటకు అంద ఱును సహాయపడెదరని ఈసభవారు జనులనందఱిని ప్రా థి౯ంచుచున్నారు.

5వ తీర్మానము.

ఆంధ్రదేశమునందున్న అన్ని పట్టణములయందును పల్లెలయందునుగూడ గ్రంథాలయములను గాని పఠనమం దిరములను గాని స్థాపింపవలెనని జనుల నీసభవారు ప్రా ధి౯ంచుచున్నారు.

6వ తీర్మానము.

ప్రతి గ్రంథాలయమును తాము గత సంవత్సరము నందు చేసినపతిని నివేదించుటకును, ముందు చేయబూ నుకొన్న పనిని గూర్చి ప్రస్తావన చేయుటకును, జనసామా వ్యమునకు సంఘాద్దేశ్యములను తెలియజేయుటకును గాను సంవత్సరోత్సవములను జరుపుటకును ఆసమయమున జ దువబడిన కార్యని వేదనమును ఈ సంఘపక్షమున బ్రకటిం చు పత్రికలో ప్రకటించుటకు గాను కార్యదర్శులకు బం పుటకును గ్రంథాలయ సంఘములను ఈసభవారు గోరుచున్నారు.

7వ తీర్మానము.

ప్రతినిధులకట్న ములవలన వసూలు అయిన సొ మ్మును సంచారకార్యదర్శియొక్క ఖర్చులకొఱకును ఇ తర ఖర్చులకొఱకును ఈ సభవారిచే నేర్పరుపబడిన గ్రం థాలయ సంఘమునకు ఇచ్చుటకు ఈసభవారు తీర్మానిం చుచున్నారు.

8వ తీర్మానము.

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమునకు ఈ సంవత్సరమున నీదిగువ నుదహరింపబడినవారు కార్యని ర్వాహక సభ్యులుగ నెన్ను కొనబడిరి. అగ్రాసనాధిపతి,—— గౌ. మోచర్ల రామచంద్రరావుగారు.