పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/71

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ ఆంధ్ర దేశ గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభ.

రాజమహేంద్రవర పట్టణమున శ్రీ. వీరేశలింగ, వసురాయ పుస్తకభాండాగారములు యాహ్వానము నను సరించి 1915 సం॥ మేనెల 9వ తేదీ మే నెల 9 వ తేదీ మధ్యాహ్నము 2-30 గంటలకు శ్రీ వీ రేశలింగము గారి హైస్కూలు భ వనమున ద్వితీయ ఆంధ్రదేశ గ్రంధభాండాగార ప్రతిని ధుల మహాసభకూడెను. కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఘపట్నము, గింజాం, నెల్లూరు జిల్లాలనుండి 120 కంటె నెక్కు వగ ప్రతినిధు లేతెంచిరి. ప్రతినిధులును ఇతర జనులును మొత్తముమీద 800 మంది జనులు సభ వలంక రించిరి.

ప్రధమమున సన్మాన సంఘాధ్యక్షులగు శ్రీ బారు నరసింహారావు, బి.ఏ., బి.ఎల్., గారు తమ స్వాగతో పన్యాసమును జదివిరి. తరువాత చిలకమర్తి లక్ష్మీనర సింహంగారు పానుగంటి రామారాయనిం గారిని సభ కు అగ్రాసనాధిపతిగా నుండునట్లు కోరుచు వారి విష యమై కొంత ముచ్చటించిరి. పెద్దిభొట్ల వీరయ్య గారు ను, కొండమూడి శ్రీరాములుగారును పై విషయమును బలపరచిరి. అందఱు నేకగ్రీవముగ నొప్పుకొనుచు కర తాళధ్వనుల జేసిరి. అనంతరము శ్రీ పానుగంటి రామా రాయని గారిని పూలహారముతో గౌరవించి అగ్రాసనా సీనునిం జేసిరి. అగ్రాసనాధిపతి గారు తమ ప్రారంభోప న్యాసమును ఆంధ్రభాషయందు జడివిరి. శ్రీ రామారా యనింగారి సోదరులు గూడ నేతెంచి సభనలంకరించిరి.

తరువాత కార్యదర్శి గారిచే సభకు రాజాలమని వ్రాసిన లేఖలు జదువబడెను. అందు రవీంద్రనాధ ఠాకూరు గారి శాంతి నికేతన మందు విద్యాభ్యాసము జే యుచున్న రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిపంపిం చిన పద్యములు మిగుల రసవంతములై, మనోరంజకము లై, భావపూరితములై సభ్యుల నందరిని ఆనందవార్థిలో నోలలాడించెను. తరువాత నాళం కృష్ణారావు గారు ఆం ధ్రదేశ గ్రంథ భాండాగార సంఘము యొక్క 1914 ఏప్రి లు మొదలు 1915 ఏప్రిలు ఆఖరువరకు జరిగిన వృత్తాం తమును జదివిరి. పిమ్మట విషయనిణయ సంఘమేరా టు గావింపబడి నాటి సభముగింపబడెను.

10 వ తేదీన ఉదయము 8 గంటలకు తిరిగి సభ కూడెను. ప్రధమమున వడ్డాది సుబ్బారాయుడు గారు దైవప్రార్ధన గావించిరి. తరువాత నూరి వేంకట నరసిం హం గారు ఆంధ్రదేశ గ్రంధభాండాగారోద్యమును గూ ర్చియు, సంచారపుస్తక భాండాగారములను గూర్చి పాద సుబ్రహ్మణ్యము గారును, గ్రంథాలయములన నేమి? అవి చేయదగిన పనియేమి? అను విషయమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్యగారును, దేశభాషాప్రాము ఖ్యతను గూర్చి వల్లూరి సూర్యనారాయణ రావు గారును, ప్రారంభవిద్యకు గ్రంథభాండాగారము లెట్లు తోడ్పడు ను ? యను వంశమును గూర్చి సత్తెనపల్లి హనుమంతరా వుగారును, గ్రంధపాలకుని ధర్మములను గూర్చి లేకుమళ్ళ వెంకాజీరావు గారుసు, గ్రంధ విభజనమును గూర్చి వెలి దెం డ శ్రీనివాసరావు గారిచే వ్రాయబడిన వ్యాసమును మరొ కరును, గ్రంథాలయ ధర్మములనుగూర్చి గుడిపాటి సూ ర్యనారాయణ గారును ఉపన్యాసముల నిచ్చిరి,

అంతటితో ప్రాతఃకాల సభ ముగిసెను, సాయం కాలము తిరిగి 8.20 గంటలకు సభ సమావేశమయ్యేను. గ్రంథ భాండాగారము లెట్లుండవలెను యను విషయము నుగూర్చి చితపంటి వేంకటరమణయ్య గారును, తీత్తి బ లరామయ్యగారును, దుగ్గిరాలనుండివచ్చిన వారొకరును ముచ్చటించిరి. (నా యనుభవము'లను గూర్చి కే. జోగా రావుగారు జెప్పిరి. ఆనంతర మీదిగువ తీర్మానములు జేయబడినవి:___

1-వ తీర్మానము.

గోపాలకృష్ణగో క్లే గారును, కొక్కొండ వేంకట రత్నం పంతులుగారును, పురాణం వెంకటప్పయ్య గారు ను, జొన్నవిత్తుల గురునాధం గారును, చనిపోయినందుల