పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు

48

రనిమగ్ను లనియు మన మధైర్యపడ నవసరము లేదు. కఠినత రము లైనశాస్త్రార్ధములు జనులెరుంగక పోయినను, ధర్మా ధర్మస్వరూపజ్ఞానము, యుక్తాయుక్త విచక్షణ, సాంప్ర దాయ నేతృత్వము, జనసామాన్యమునకు కలుఁగకపోలేదు. సామాన్యజనులు వాడుకొను పదములు వేదశాస్త్రమూల కములు. అవి వారి ప్రవతజనను శాసింపుచుండును. ఈ విషయము ముందు గ్రహించినగాని పుస్తకములు, పుస్త కాలయములను గుఱించి చర్చించబోవు వంశీములు స్ప ష్టములుగావు. వ్రాయబడిన పుస్తకములేగాక వ్రాయని వేదములు, వ్రాయని యచలబోధ, వ్రాయని యాధ్యా త్మరామాయణము, వ్రాయని తత్వములు, వ్రాయని పద ములు, ద్విపదలు, రగడలు జనసామాన్య కణం గోచరము లై భరతఖండమునందు జ్ఞానవ్యాపకము చేయుచున్న వి వయము మనమందరము ముఖ్యముగా నెఱుఁగదగినది.

కాన పుస్తకములన్న నేమో కొంత విచారించవ లసి యున్నది. పుస్తకములన, ఆటలుగలిగిన కాగితపు బొత్తులు కావు. పుస్తకములన వ్యష్టి దేశము యొక్క సాంప్రదాయమును, అనుభవమును పరమావధులు, రుచు లు సంస్కారములు, మొదలగువాని స్థూల శరీరములు. ఈ యధణము మనమంగీకరించినచో పూర్వోదాహృత సంస్కారాదులు గుణకర్మభేదములు కలిగిన వేరు వేరు దేశములు వేరు వేరుగ నుండును. కానీ ఆయా పుస్తకములు గూడ వేరు వేరుగ నుండును. ఇవియన్నియు 'మొత్తము మీఁద మానవసమిష్టి జ్ఞానదాయకములై యొప్పుచుండు. సాంప్రదాయములు, సంస్కారపరమావధులు, అన్ని శముల కొక్కతీరుగు నుంచవలయునని ప్రయత్నించుట యసంగతము. అవి యట్లుండుట యసంభవము. పృధక్త్వము కాపాడుట ముఖ్యకత కావ్యము. జనసమిష్టి జ్ఞానమును పొందగోరువానికి సర్వదేశపు ఒకసారమును గాంచవలసిన యావశ్యకత యేర్పడును.

భిన్న భిన్న దేశములకు కొన్ని సమానధర్మములు, విశిష్టధర్మము లుండును. సామాన్యవిశేష ధర్మస్వరూప ము నెఱింగి వ్యష్టివ్యక్తులయందున్న విశిష్ట ధర్మములను కాపాడవలయును. ఆవిశిష్టధర్మరక్షణ తద్ధర్ములకే వల నుపడునుగాని లాతులకు చేతగాదు.

కాన మన విశిష్టధర్మములను తెలియపర్చి పెంపొందించు పొ త్తము లవశ్యపఠనీయములని యెరుంగునది. పుక్త కాలయములందు వీనికి ప్రధమ గౌరవస్థాన మొసం గుచుండవలయును. శ్రీరంగాది దేవాలయ నిర్మాణమునకు ఆర్యశిల్పిశాస్త్రము, “టాజ్ మహల్" నిర్మాణమున కు మహమ్మదీయ శిల్పము, అధ్యాత్మవిచారణకు భరత ఖండజాన సంస్కారము, ప్రకృతిశాస్త్ర కళానైపుణ్య మునకు పాశ్చాత్యవిజ్ఞానము, నిట్టుల నొక్కొక వ్యష్టి విశి ష్టగుణములు నొక్కొకటి నొసంగుచు సమిష్టి జ్ఞానమును వృద్ధిచేయుచయుచుండును.

వ్యష్టికి గాని సమిష్టికి గాని విద్యగఱప పెంచినప్పు డది ఆవ్యష్టి సమిష్టుల సంస్కార సాంప్రదాయాను సారము నొసంగబడవలయు నేగాని తద్విరుద్ధ ప్రయత్నము వ్యర్థము.

ఆధునిక కాలమందలి పుస్తకములు కొన్ని సాం ప్రదాయ జ్ఞానము లేక వ్రాయఁబడిన వగుటచే తద్భాన ములు పెండింటపాలికలలో తొలుదొల నేవళము గావ చ్చి వేరులో తంటకపాలి పడిపోవు భంగి చుండుమ, మఖలో పుట్టి పుబ్బలో మాడు. పుస్తకములు, నాచంద్రస్థాయిలగు పుస్తకములు అను రెండు తెఱఁగు లలో, వ్యష్టి సాంప్రదాయ సంస్కార పరిణామములు గ లిగినవే యాచంద్రస్థాయిలగును. తక్కొరులు మొదటి తరగతి అని గ్రహించనగును. పుస్తకముల యొక్క యదాధణము నెరింగి పుస్తకాలయములు స్థాపించినచో దేశమున కెల్లయెడల మేలు గలుగ గలదు.