క్ష గాని, లోకానుభవము గాని, యోన్పుగాని లేక గ్రంధకర్తలకుండు బాధ్యతలను గుర్తెఱుంగక దుస్సాహస మునకుఁ గూడ నొడిగట్టి చేత గాని పరులకుఁ జేయిచాచి, తాము నష్టముఁ బొందుటయె కాక తాఁజెడ్డ కోతి వనమె •ఁ జెఱిచినదన్నట్లు ప్రతిభాశాలురయిన గ్రంధకర్తల ప్ర యుత్నములకుఁ గూడ నాశనమును గల్పించి, దేశమునకుఁ కీటు వాటిల్లుగీతి వర్తింపసమకట్టుట శోచనీయము, మన దేశములో నెవ్వఁడేని సమర్థుఁడొకఁ డొక వ్యాపారము కుజేసి, యావ్యాపారమునకై నానాకష్టములుపడి సమ ర్ధతతో దానిని నిర్వహించి కొంచెము లాభము బొందుట తటస్థమైనతోడనే య సేకులదివఱకు మాంద్యులైయుం ఫియు, మఱియొక వృత్తికి దొరకొనక వాని పై పోటీకి బోయి, యావ్యాపారము నే చేయనవలంబించి, తాము నష్టమును బొందుటయేగాక, లాభమును బొందుచున్న మొ నటివానికి నష్టముగలిగించి, చెఱచుచుండుట, మనము క అన్నులారఁ జూచుచున్నారము. సారస్వతి విషయమునఁ గూడ నిట్టి చందములే గాను బడుచున్నవి. సారస్వత జీవ నము కష్టసాధ్యము. మిక్కిలి పవిత్రవంతము. సుగుణా శ్యులకు సులభసాధ్యము, దురాశాపాశబద్ధులకు దుస్సా న్యము, నాల్గు పద్యము లల్లఁగల్గినవాఁడు కవియు నాల్గు పత్రములుగీకినవాఁడు గ్రంధకర్తయుఁ గాఁజాలడు. త్కావ్యములను రచించువారు సత్కవులు, సత్కవులసం వృత్తమును సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనము న నిటభివర్ణించి యున్నాఁడు.
"చ. | “మనమునఁగొన్న సెవ్వగలు | |
ఇక్కాలమున నిట్టి సత్కవు లెక్కడనో గాని కా
కంబడరు. సత్కవులెట్టివారో సద్గ్రంధకర్తలు గూడ నట్టి
వారి యగుదురనుటకు సందియములేదు. నిష్కళంకమై
న యోచన, సత్యమం దనరాగము, కీర్తిప్రదమైన స్వేచ్ఛ
వీ.నితోఁగూడుకొన్న దై నయెడల సారస్వతజీవనము తక్కి
నవానికన్న శ్రేష్ఠ మైనదనుటకు లవమాత్రము సందియ
ములేదు.
గ్రంథకర్తలు.
తనంతగ తానొక పక్షమునకు మొగ్గ నూహించిన ప్పుడుతక్క గ్రంథకర్త యెన్నఁడుము నొక మనుష్యునకుఁ గాని, యొక స్థలమునకుఁ గాని, యొక పక్షమునకుఁ గాని శుఁడు కాఁజాలఁడు. గ్రంథకర్తకు జనసామాన్యమైనను రాజాధిరాజైనను నొక్కటియె. గ్రంథకర్త యనేక ప్ర జలను బరిపాలింప సమర్థ తగలవాఁడు. అతనిశక్తి మహ త్తరమైనది, ఆ ప్రతిమానమైనది. కనుక సారస్వత జీవన ము తక్కినవానికన్న నధిక సంతోషకరమయినదిగా నే నూహించెదను. అయినను గొందఱు నాయభిప్రాయము తో నేకీభవింపకపోవచ్చును. అట్టివారు సారస్వత జీవన ముగలవారిలో నే పెక్కందుకలరని నేనెఱుంగుదును. అగ్ని మాంద్యముచే క_సిపడువా రనఁగా మనోరథభగ్ను లైన గ్రంధకర్తలు పెక్కండుగలకు. ప్రచురణకర్తల కు న నేక సంవత్సరములవఱకు నొడంబడికలు వ్రాయువా రు శృంఖలములలో నృత్యములు సేయు వారి పగిది దుఃఖ భోజనులగుచున్నారు. సారస్వత జీవనమువలనఁ గలుగవ లసిన యానందము గలుగనేరదు. ప్రచురణకర్తలు తమ కృషికి నెంతప్రతిఫలము నొసంగుదురో యని యనుదిన మును తాను వ్రాసిన కాగితములను లెక్క పెట్టుకొనుచుం డు గ్రంథకర్త యెన్న ఁడును సుఖమనుభవింపఁ జూలఁడు. జనప్రవాహ మెట్లీడ్చిన నట్లు పోవుచు, నేఁడిచ్చట, రే పు వేఱ క్కచోట, నెల్లుండి మతొక్కచోట స్తుతి పాఠములంగనుచు, తిబ్బిబ్బులగుచు, అప్పటి కానందము ను బొందఁగోరు గ్రంధకర్త దేవతా ప్రసాదమునకు దూర గుఁడై, తానెవ్వరితోఁ గలిసి మెలసి తిరుగఁదలం చెనో యట్టి గొప్పవారిచేత నే పరిత్యజింపఁబడి తుదకు కష్టకా లమునకు నసహాయుఁడై పరితప్తుఁడు గాక మానఁడు.
శ్రీనాధుని యవసానదశ.
మహారాజుల చెలిమిఁజేసి, బంగరుతూగుటుయ్యే లలో నూగుచు, హంసతూలికా తల్పంబుల శయనించుచుఁ