నన్న వెట్టిభయ మాకాలమున నుంట చేఁ గొందఱుక వులు భూషించియు, దూషించి యుఁగూడ ధనహరించుచుండిరి. ఒకని గుఱించిన కీ ర్తి గాని యపకీర్తిగాని వ్యాంపిపఁజేయుటకు నీకాలమునందలి వార్తాపత్రికలవలె నాకాలమునందలి కవులు కారకులగుటచేత సాధారణముగా నెల్లవారును కవులకు భయపడుచు, శుభకార్యాదులలో కట్నములు కానుకలుగూడ చెల్లించువారుగ నుండిరి. ఎవ్వరు సన్మానింపకో వారిపైకత్తికట్టి, కలము చేఁబట్టి, చలము చేనొక దూషణ పద్యమును గాని గ్రంధమును గాని / వాసి దేశదేశములఁజాటు దుష్క వులు కూడ నుంటచో గ్రంధకర్త పదము భయంకరమైనదై యపకీర్తిపాల య్యెను. సామాన్యులలో "గ్రంధకర్త" యనఁగా చెడుగు చేయునాఁడని యపార్ధమేర్పడినది. అతఁడు "గ్రంధసాంగుఁడు; మనవాఁడు గ్రంధకర్తయైనాఁడు" అనునవి చెడు పనులు చేయువారిని గూర్చి పలుకునట్టి వాక్యములుగానున్నవి.
గీర్వాణభాషాపండితులు.
ఇట్లే గీర్వాణభాషాపండితులు కొందఱు సామాన్య జనుల వేషభాషల నధిక్షేపించుచు నౌచితి నెఱుంగక ఛాందసులై పామరులతో సంభాషించునపుడు సయితము సంస్కృత పదాడంబరమును జూపుచుంట చేత సామాన్యజనులకు వారిభాష యర్థము గాక యుండెను. అందువలన సామాన్యజను లాగీర్వాణపండితులను గర్వభూయిష్టులను గాఁ దలంచుచుండిరి. ఏతత్కారణము వలన గీర్వాణశబ్దమున కపార్థ మేర్పడినది. అతనికి గీర్వాణము బలిసిపోయినదనఁ గా వానికి గర్వ మతిశయించినదను నిర్ధము స్ఫురించుచున్నది. ఎంతటి సద్వస్తువు నైనను సద్వినియోగమునకుఁ డేక దుర్వినియోగ పఱచుచున్న యెడల దానికుండు సహజ గౌరవము కూడ చెడుచుండుననుటకు పైవిషయములను తార్కాణముగఁ జూపవచ్చును. కాఁబట్టి గ్రంధకర్త శబ్దమునకట్టి యపార్ట్ మేర్పడినప్పుడు సారస్వత జీవనమునకు సంఘములో గౌరవ మెపేర్పడఁ గలదు?
నవీన కాలమునందలి యభివృద్ధి.
కనుకనే మన దేశములో నితకుఁ బూర్వము గ్రంధరచన యొకవృత్తిగాఁ బరిగణింపఁబడుచుండలేదు. ఆదిసద్వృత్తులలో నొక్కటియనుమాట జనసామాన్యమునకుఁ దెలియకుండెను. ప్రస్తుతస్థితియొకింత పరికింతము. బ్రిటిషు ప్రభుత్వము మనదేశమునకు లభించిన నాటకుండి మనదేశములో ముద్రా యంత్రములు వెలసి ప్రాచీ నాంధ్రగ్రంధముల నేకములు ముద్రింపఁబడి కాక వెలలకు వేనవేలు విక్రయింపఁ బడుచున్నవి. వార్తాపత్రికల మూలమునను యేటేటను ముద్రాయంత్రములనుండి వెలువడు గ్రంధములవలనగు భాషాభివృద్ధి యగుచున్నది. స్వదేశోద్యమమువలన మన దేశమునకు; గలిగిన లాభము భాషోజ్జేననముని ముఖ్యముగాఁ జెప్పఁదగును, సర్వకలాశాలాధి కారులు దేశభాష ల నుద్ధరింప రుదాసీనులై యున్నను దేశమున గ్రంధప్రచారమునకై య సేక సమాజము లేర్పడి యేటేటచెక్కు గ్రంధములనచ్చొత్తించుచు దేశమున వెనఁజల్లుచున్నవి. ఆగ్లేయభాషావిశారదులైనవారు మాతృభాష పట్లవిముఖులు గాక య నేకులిప్పుడు మాతృభాషాభిజ్ఞులై యత్యంతోత్సాహముతో మాతృభాషా సేవకై గడంగుచున్నారు. పల్లెలలో సైతము గ్రంధభాండారములు వెలయుచున్నవి.
మార్పు కాలము.
శాస్త్రగ్రంధములు, చరిత్రగంధములు, నవలలు, నాటకములు, ముద్రాయంత్రములనుండి వెలువడుచు నోకరీతిగా నమ్ముడువోవు కాలమువచ్చినది. ఇదియొక మార్పుకాలము, ఈ కాలస్థితిని జూచి యనేకులాకర్షింపఁబడి గ్రంధరచనకుఁ బూరుకొని దానినే జీవనాధారమగు వృత్తిగఁ జేసికొనవలయునని సాహసించి ముందుకువచ్చు చుండుట చే భాషా ప్రపంచమున నొక గొప్పకలవరము జనించుచున్నది. దానిస్వరూపమిట్టిదని తెలిసికొనుట గ్రంధరచనకు దొరకొనఁబూనిన ప్రతిమనుష్యున కవశ్యకర్తవ్యమైయున్నది. గ్రంధకర్తలకు మాత్రమెకాదు. దేశక్షేమము నభిలషించి సారస్వతాభివృద్ధి కై పాటుపడుచున్నట్టి ప్రతిదేశాభిమానికిని కలవరస్వరూపమును దెలిసికొనుటవిధి యైయున్నది. ఈకలవరమే నేఁశ్రీవ్యాసమును వ్రాయుటకు నన్నుఁ బ్రేరేపించుచున్నది.
ఈ కాలమునందలికవులు.
వస్తుస్వరూపమును సరిగా గ్రహింప శక్తులు లేక దురాశాబద్ధులై యనేకులు సరియైన భాషాజానము గాని