39
గారము చొప్పున గాని, స్థాపించి ప్రతిభాండాగార నిర్వాహకసంఘము వారి ప్రతినిధిని తమ కార్యనిర్వాహక సంఘమున చేర్చుకొనవలయును. గ్రామభాండాగారములలో నింగ్లీషు గ్రంధము లుండనక్కరలేదు. ఏ గ్రామభాండాగారముగాని ర్పు 1000ల కంటే యెక్కువ విలువగల గ్రంథముల నుంచుకొన యగత్యములేదు. గ్రామభాండాగారము యొక్క సభ్యులలో నేరికైన తమ భాండాగారమున లభించని ఆంధ్ర, ఆంగ్ల గ్రంధములుండిన వాటిని జిల్లా భాండాగారమునుండి అరువుగా తెప్పించుకొనుటకు తగిన యేర్పాటు లుండవలయును. అదే తీరున జిల్లా భాండాగారముల సభ్యులును మహాభాండాగారముల నుండి తమకు లభింపని పుస్తకములను తెచ్చుకొనుచుండవచ్చును.
భాండాగారముల పరస్పర సంబంధము.
ఇక నధమపక్షము ర్పు 100 లు విలువగల 250 పుస్తకములును గలిగిన ప్రతి గ్రామభాండాగారమును, జిల్లాభాండాగారముక్రింద నుంచుకొనవలెను. ర్పు 2500 విలువగలిగి 2000 గ్రంథములుగల భా౦డాగారములను మహాభాండాగారముక్రిందను తెచ్చుకొనవలెను. ఇట్లన్ని భాండాగారములవారును కలిసి అన్యోన్య మైత్రతతో పనిచేసిన మనదేశమున అచిర కాలముననే జ్ఞానము విలసిల్లి మనలనావరించిన యంధకారము పటాపంచలై పోవుననుటకేమాత్రమును సందియము లేదు.
భాండాగారముల నిబంధనలు.
భాండాగారములలో వచ్చి చదువువారందరును ఉచితముగనే చదువనియ్యవలయును. కాని పుస్తకములను గృహమునకు తీసికొనిపోవుటకు సభ్యులకు మాత్రమే యధికారముండవలయును. గ్రామభాండాగార సభ్యులకు నెలకు రెండణాలకన్నను, జిల్లా భాండాగారముల వారికి నాలుగణాలకన్నను మహభాండాగారమందలి సభికులకు నెలకు యెనిమిదణాలకన్నను తక్కువకాని చందాను క్రమముగా సభ్యులవల్ల వసూలు చేయబడి, అందులో సగముకంటే మించని మొత్తము వార్తాపత్రికలకై వినియోగింపబడిన, జనులను భాండాగారముల కాకర్షించుట కిదియొక సాధనమగును.
సభలు.
ప్రతిసంవత్సరమునను గ్రంధభాండాగార ప్రతినిధులందరునుగూడి గ్రంథభాండాగారములు స్థితిగతులను గూర్చి ముచ్చటించుట యత్యంతావశ్యకము. ఈ సభ కేవలము, కార్యనిర్వాహక సభా ప్రతినిధుల సభగా నుండవలయనుగాని పాఠక ప్రపంచమున కీ సభలో విశేషముపనియుఁడదు. గ్రంధ భాండాగార నిర్వాహకులు అప్పుడప్పుడు మంచి విషయములనుగూర్చి పండితులచే నుపన్యాసములనిప్పించుచు జనులలో జ్ఞానపిపాస గలిగించవలయును. పలువురుగూడి నేదైన నొక గ్రంధమును చదువుటకు పాఠక మండలులను గూడ నేర్పరుపవచ్చును. ఈ భాండాగారముల యొక్క యభివృద్ధిని సూచించు పత్రికయు నుండిన బాగే.
ఒకరు ప్రారంభించినపనినే అందఱును జేయుట.
మన దేశమున ముఖ్యముగా తెలుగు దేశమున నొకరు ప్రారంభించినపనికి ఇతరులు తోడ్పడుటకు మారు మఱియొకరును అదేపనిని నిర్వహింపబూనుకొని ధనవ్యయమును, కాలహరణమును జేయుచున్నారు. సంఘీభావమునగల శక్తిని గ్రంధ పూర్వకముగ చదివి సంతసించుటకును, యితరులలో నుండుటను చూచి సంతసించుటకును, మనలో యా శక్తి లేదని విలపించుటకు నుమాత్రమే నేర్చుకొంటిమి గాని మన లాభమును కోల్పోయి, స్వగౌరవమును పాటించక, ఇతరులతో కలసి పనిచేయుట కింకను మనము నేర్చుకొనలేదు. రెండు మూడు సంవత్సరములకు పూర్వ మొక్క వర్సాపురము తాలూకా అభివృద్ధి సంఘమువారే చేయుచున్న పని ఇపుడెందరు చేయుచున్నారో చూడుడు! విజ్ఞానచంద్రికా మండలివంటి సంఘములు మన దేశమున నెన్ని ప్రబలినవి కావు. ఒక రాజమహేంద్రవరము వలెనే ఇంకను పుస్తక భాండాగారములు స్థాపింపబడుటలేదా? కమ్మరవీధికి నూదుల నమ్మబోయిన ప్రయోజన మేమి?
మన స్థితిగతులు.
మనదేశ మతివిస్తారమైనది. మన కార్యనిర్వహణ శక్తియో అతిసంకుచితమైనది. మన దాతృత్వమో అతిస్వల్పము. మనవ్యయమన్ననో విచ్చలవిడి దేశకార్య