పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/54

ఈ పుటను అచ్చుదిద్దలేదు

36

గ్రంధములు భాండాగారమునకు జేర్చవచ్చుననెను. ఒక బడిపిల్లలు జదివిన గ్రంథములు మరియొక బడికి బంపుట తను, సంచార కార్యదర్శుల నేర్పరచి మంచి గ్రంథము లను జదువుటకు దగిన ఏర్పాట్లు చేయుటకును బూనవలె ను. 'లగ్గాను ' పట్టణములోనున్న భాండాగారములో ఆ న్నియు సద్గ్రంధములే గలవనియు, ఆజిల్లాలో నున్న మూడుపాఠశాలలలో నన్యోన్యసహాయమును బొందుచు పరస్పరము పుస్తకముల నెరువుదీసికొనుచున్నారనియు, స్వల్పవ్యయముతో నంత యెక్కువలాభమును పొందుచు న్న యితర మార్గములను తాను జూడ లేదనియు కార్నీ జీ నుడివెను.

“తనకుండుకున్న విశేష ధనములో స్వల్పభాగ మునుమాత్రము వెచ్చించిన లోకమున కెంతో ఉపకార ము చేయగలుగుదునను సంగతిని ధనికులైనవారు గుతేకా రిగి యుండవలసియున్నది. నేను ఐశ్వర్యను వాత ను గురించి వ్రాసిన వ్యాసములో విశేష ధనముండుట ధర్మకర్తృత్వము వహించుటకేయని వ్రాసి యుంటిని. ధనికు లాసంగతి గమనింపవలెను. 5 గాని 10 గాని 25 గాని నవరసులు మాత్రము గ్రంధభాండాగారములలో వినియోగించిన అందువలన నూరురెట్లో లేక వేయిరెట్లో ఫలప్రాప్తి గలుగునను సంగతి అనుభవమువల్ల తెలియన గును. గ్రంధభాండాగారములకు ధనమిచ్చు ధనికులకం ఔ యట్టి భాండాగారములవల్ల లాభమును పొందినవారు స్వయముగ దాని యభివృద్ధిని కనుగొనుట కెక్కువ అ వకాశము గలదు. ఁ ఏమహానుభావుడు తన ధన మునేగాక తన శక్తినికూడ ధార్మిక విషయము లందు వినియోగించునో అతడు మాత్రము నిజమయిన దేశభక్తుడు' ధనసహాయము జేసినం తమాత్రము చేత వానివిధి సంపూణFముగ నెర వేరజాల దు. ధనమిచ్చుటకంటె శ్రద్ధవహించి కొనసాగించుటలో విశేషము గలదు.”

ఈప్రకారము కాగ్నీ జీ ముత్యములవంటి మాటల తో హితోపదేశము చేసియున్నాడు. అందు ప్రతిమాట కును విలువగలదు. •మనకుగల లోకానుభవమువలన, చే ఆయుగం సులభమైన పనియనియు స్వయముగ చేయుట కష్టమైన పనియనియు దెలియుచున్నది. కా ర్నీ జి వట్టిమాటలవా డెన్నటికిని గాడు. క్రియాశూరు - డు, నిజమైన లోక బాంధవుడు. తాను నిర్ధారణజేసిన ప ద్ధతిప్రకారము తనయొక్క ధనము నెటుల ధర్మపుస్తక భాండాగారములకు వినియోగించెనో ఆమహానీయునియొ క్క దిగువ ధర్మములపట్టిక ను పరిశీలింపుడు.

(1) 1902 సంవత్సరమునఁ కార్నీ జి యిన్ స్టిట్యూ టు' అనుదానిని వాషింగ్టను పట్టణమునందు స్థాపించి దానికి 44 లక్షుల నవరనుల నిచ్చియుండెను. ఈధర్మ మువల్ల మానవకోటికి మిక్కిలి యుపయోగకరమయిన శాస్త్రచర్చజేయుటకు పరిశోధనకు నవకాశము గలిగినది.

(2) ఉపాధ్యాయుల బోధనాభివృద్ధికి కార్ని జీ స్థాపితము. —1905 సంవత్సరములో ఉపాధ్యాయులకు పించను వసతికిని వారి వితంతువుల మనోవతిజ్ఞకిని ఉత్త ర అమెరికాఖండములో 30 లక్షల నవరసుల నిచ్చి యుండెను.

(3) కార్నిజీ ధీరులనిధి. ప్రాణరక్షణ గావిం చినవారికి ఆప్రయత్నములో నాపదచెందిన వారికిని, నష్ట పడినవారి వారసులకును, అనివార్యమైన బాధ జెందువా సహాయముగ బహుమానములిచ్చుటకు ఈనిధి 1904 సంవత్సరములో 10 లక్షల నవరనులతో స్థాపింప బడినది. ఇది సంయుక్త రాష్ట్రములకు మాత్రము చేయ బడిన ధర్మము. రికిని

(4) ఈ ప్రకారము ఆంగ్లేయరాజ్యమునకు 1908 సంవత్సరములో 2 లక్షలన్నర నవరసులను, ఫ్రాంసుకు 1909 సంవత్సరములో 2 లక్షల నవరసులును, రాక్షస కృత్యములకాలవాలమగు జర్మనీకి 1910 సంవత్సరములో 24 లక్షల నవరసులును ధీరులనిధికై యిచ్చియుండెను.

(5) కార్ని జీ సంధినిధికి 1910 సంవత్సరములో 20 లక్షల నవరసుల నిచ్చెను.

(6) కార్నిజీ కార్పొ రేషనుకు 1911 సంవత్సర ములో 50 లక్షల నవరసులను ప్రకృతిశాస్త్ర విద్యకును భాండాగారాభివృద్ధికిని సంయుక్త రాష్ట్రముల వారికై యిచ్చి యుం డెను.