పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/53

ఈ పుటను అచ్చుదిద్దలేదు

35

జెందవలసిన సొమ్మును పంచియిచ్చి వేసి యాభాగమును మిగిలిన భాగస్థులే పంచుకొనెడివారుగాని చనిపోయిన వాని కొమాళ్ళనుగాని యితర వారసులను గాని వ్యాపా రమునందు జొరనిచ్చుటలేదు. ఇందువల్ల ఆగస్త్యభ్రా తలు జేరి మంచి వ్యాపారములను మంటగలుపుట కవకా శము తగ్గునుగదా ! కార్నీ జీ వ్యాపారపు పనులనుండి విశ్రాంతినిబొందుట దేహదారుష్యము లేక కాదు. భాగ స్థుల వత్తిడివల్లను గాదు. తానార్జించిన విశేష ధనమును తన జీవితకాలములో నే సద్వినియోగము చేయవలెనను ముఖ్యోద్దేశ్యముతో ఆయన వ్యాపారమును మాని జీవ యాత్రను గడుపుచున్నాడు.

కార్నీ జీ అభిప్రాయప్రకారము ధనమాజికొంచుట కంటె దానిని వ్యయము జేయుట కష్టమని తేలుచున్న ది. ధనికుడుగా జనిపోవువాడు తనను తా నగౌరవపరుచు కొనువాడని కార్నీ జీ అభిప్రాయమై యున్నది. సాధా రణముగ మనముచేయు ధర్మముల పద్ధతులు సరియైనవి గావని కార్నీ జీయొక్క నమ్మకము. ధనము సద్వినియో గము జేయుట యనగా సరియైన వ్యయము చేయుటయె గాని యిష్టమువచ్చినటుల వెచ్చించుటకాదు. 1881 సంవత్సరములో అమెరికా దేశ పత్రికలకు వ్రాయుచు ధర్మముచేయు పద్ధతులలో విద్యాలయములు సర్వ కళాశాలలు స్థాపించుట, ధర్మపుస్తక భాండాగార ములు, వైద్యశాలలు, యంత్రశాలలు, విహారవనములు, పురమందిరములు, ఈత నేర్పు స్థలములు మొదలగువాని నేర్పరచుట అత్యుత్తమంబులని ఆయన జెప్పియున్నాడు.

కార్నీజీయొక్క ధర్మములయందు గ్రంథ భాం డాగారములే అగ్రస్థానమును వహించియున్నవి. ఈ గ్రంథభాండా గాగో ద్దేశ్యము మొదట కార్నిజీ కెట్లు క లిగెనో, యీ ధర్మమును గురించి యతని యభిప్రాయమే మిటో కొంచెము విచారించుట కతేకావ్యము. పిట్సుబర్లు లో పిల్లలు వారముసకొకసారి చదువుకొనుట కవకాశ ము కలిగిన 400 పుస్తకములు గల యొక చిన్న భాం డాగారమునందు, తనకు గల యభిమానమును తానుపొం దిన సంతోషమును 'కార్ని జీ యెన్నటికిని మరపుజెందిన వాడుగాడు. అప్పుడతని మనస్సులో, ఎప్పటికైన నా కు ధనము చేకూరె నేని ఇటువంటి ధర్మపు సకభాండా గారములను దేశమున వెదజలి బీదజనులకు నుపయోగ కారు లగునటుల చేయుదునుగదా యని నునిళ్ళూరు— చుండెడివాడు. ఆయన పేదపిల్లవాడుగా నున్నప్పుడు కలిగిన యూహ యట్టిది. ఇప్పుడు వృద్ధుడై కోటీశ్వరు డైన కార్నీ జీ, సంఘమునకు జేయగల ధర్మములయందె ల్ల ధర్మగ్రంథ భాండాగార స్థాపనయే ఉత్కృష్టమై పరిగణింపబడవ లెనని చాటుచున్నాడు.

కార్నీజీని కొందరు ధర్మగ్రంథ భాండాగారముల ను గూర్చి ఆయన యభిప్రాయమును దెలుపవల సినది గా కోరినప్పుడు ఈదిగువ సంగతులను శీలలిచ్చెను.

“గ్రంథాలయములు కష్టపడనిదే ఫలమునియ్యవు; స్వయంసహాయము జేసికొనువారికే అవి లాభమును గ లిగించును; కాబట్టి అవి మనుజులను దరిద్రుల నెన్నటికి. ని చేయజాలవు. ఈకారణములచేత ధర్మగ్రంధాలయ ములు జనసామాన్యము నభివృద్ధికి దెచ్చు పరమోత్కృష్ట సాధనములుగ నేను పరిగణించుచున్నాను. ఆసక్తిగల వారికెల్ల గ్రంథములలో నిమిడియున్న యమూల్య రత్న ములను గ్రంధభాండాగారములే యొసంగగలవు. గ్రంథ పఠన కభిరుచిగలవారిబుద్ధి ఇతర నీచ రుచులయందు ప్ర నేశించుట కిష్టపడదు. ఇది గాక జక్కని నవలల జదువు టచేత బీదలకు విశ్రాంతికుదిరి వారి దుర్భరజీవితములకు హాయి గలుగునని నమ్ముచున్నాను. ఇట్టివియేయగు ననేక కారణముల చేత, ఇతరధర్మము లనేకములకంటె ధర్మ పుస్తక భాండాగారములు ప్రజా సౌఖ్యమునకును అభివృద్ధికిని ముఖ్యసాధనము లగుటంజేసి, నేను వానిని స్థాపించుచున్నాను,

1891 సంవత్సరమునందు పీటరు హెడు' గ్రంధ భాండాగారణాలను తెరచు సమయమున కార్నీ జీ గ్రంథ భాండా గారములను గురించిన తన ప్రథమ ఊపన్యాస ము నిచ్చియుండెను. సంవత్సరమునకు 25 నవరసులు ధ ర్మము చేయ దలచినవారున్న యెడల చిన్న గ్రామమునకు దగిన గ్రంధభాండాగారము నేర్పరచుటకు వీలుగలదని యప్పట్టున కార్నీ జీ నుడివియున్నాడు. ఇంకొక 5 నవ రసులు వెచ్చించినయెడల విద్యార్థులకు దగిన పుస్తకము లను చేర్చుట కవకాశము గలదనెను. అందుల 44