పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/47

ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

గా నిప్పించుచుండెడివారు. ఆపండితులు తమ పని ముగియఁగ నే ఆగ్రంధములను మరల ని చ్చెడివారు. ఇట్లే మనప్ర స్తుత భాండాగారము ల కంకురము భరతవర్షమున వేలకొలఁదివత్స రములక్రింద నే యేర్పడినది,

ఇది నవీనయుగము. మానవప్రపంచము సర్వవిధముల నభివృద్ధినందుచున్నది. భావము లు, శాస్త్రములు, తెలివి, నాగరికత దినదిన ము హెచ్చుచున్నవి. ప్రపంచయాత్ర నీనూ తనయుగకళలం దెలియక చేయుట దుర టము. దుర్ఘ అందు కేమిచేయవలయును? గ్రంధములం బఠి యించుటే. వివిధ విషయిక జ్ఞానముఁ గల్గించు కొను టే, అందుకుఁదగిన సాధనము లేవి? గ్రంథ భాండాగారములే.

తక్కిన హిందూసామ్రాజ్యముతో పాటు మన యాంధ్ర దేశమును ఈ విషయమున వెనుకపడియే యున్నది. అయినను గొలఁదికాలము నుండీ మన యాంధ్రులు విశేష యుత్సాహ ముంబూని వీనిని స్థాపింప యత్నించుచున్నా రని చెప్పుటకుఁ గొంత సంతసింపవలసియు న్నది. దినదినమును ఆంధ్రపత్రికలలోఁ క్రొ త్తభాండాగారములు జన్మించుచున్నట్లు చదు వుచున్నాము. దేశ మున నన్ని భాగములను ఈయుద్యమము కదలుచున్నది. అయినను ఇంతవరకు మనదేశమున గొప్పవి అయిదారు కంటె హెచ్చుగా లేవు. బందరు, ఏలూరు, కాకినాడవంటి పెద్దపట్టణములలోఁ గూడఁ దగిన భాండాగారములు లేకపోవుట చూడ మనమెంత దుస్థితియందున్నది తెలియఁగలదు, అయినను ఈలోపములను దొలఁగించుటకై ఆంధ్రదేశ పుస్తక భాండాగార సంఘము నెక దానిని గతసంవత్సరము స్థాపించినారని చెప్పుటకు నాకానందమగుచున్నది. కాని యిది రెట్టిపనిని జేయునో ముందు చూడవలసి యున్న ది. ఈ సంఘమువారు సంవత్సరమునకొకసా। సమావేశమయి నుంచి చెడ్డలను జర్చించ కొనుటతోనే తృప్తినొందక కొందఱు సం చారకులను నియమించి యాంధ్రలోకమున వివిధ భాగములందున నీసదుద్యము నెడ ననురాగము జనించునట్లును భాండాగారములను సా పించునట్లును జేయింతురుగాక, మరియుఁ గొందరు గొప్పవారు పోఁగయి జమీందారులను బెద్దవారిని యాచించి కొంతధనమును సంపా దించి మూలధనముగా నుంచి దానిపై వచ్చు డబ్బులోఁ గొంత భాగమును క్రొత్త భాండా గారములకిచ్చుచుఁ బ్రోత్సాహము చేసిన మేలుగానుండును.

అమెరికా దేశమున భాండాగారములు మ హత్కార్యముల నొనరించుచున్నవి. కొన్ని గ్రంధములను ముద్రించుచున్నవి. దీనికై కొ న్నిటికి ముద్రణాలయములు కలవు. మఱికొ న్ని రాత్రిపాఠశాలలు స్థాపించి బాలురకు బాలికలకు భాండాగారములు నెట్లుపయోగిం చుకొనవలసినది తెల్పుచున్నవి. పాఠశాలలం దు, రచ్చచావడులందు, న్యాయస్థానముల ముందు, బజారులందు, జిల్లాసభలందు, మత సభలందు, రాష్ట్ర సభలయందు అన్ని చోట్లను భాండాగారముల తరఫున బయలు చేసిన కా ర్యనిర్వాహకులు ప్రత్యక్షమై భాండాగారోప యోగముల నుదోషించుచు లోకమెల్ల భాం డాగారములతో నింపుచున్నారు. బాలురను, బాలికలను ఆకర్షించు జక్కనియాటల భాం డాగా రావరణములలో నేర్పఱచి వారికిఁ జదు వునందుఁ బ్రీతి కల్పించుచున్నారు. శాఖల ను సాపించి సమీప స్తలములలో గ్రంధము