పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/46

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మార్గమనియు, ఆచరణయోగ్యమనియు మా తము గ్రహించి యేతాలూకావా రా తా కాయం దిట్టి సంఘముల నెలకొల్పి విద్య నభివృద్ధి జేయ జేయ మిమ్మందర ప్రార్థించుచున్నది. కనుక గ్రంథ భాండాగారికులారా ! మహాజను లారా !! చదువన నెట్టిదియో యెరుగక, చ దువరులఁజూచి సిగ్గుఁ జెందుచు, తమ జీవితము నెట్లు గడు పవలయునో గ్రహింపక యుండు విద్యావిహీనులగు మీ దేశీయ సోదరుల స్థితిఁజూచి మీ చేతనై సంత సాయము జేయ క మీరూరకుండవచ్చునా ! ఎట్లూరకుండ గలరు ? మీతోపా టాంధ్రమాతృగర్భమున జనించి మీకన్న హైన్యస్థితియందుండ, వారి కనత్వమే మీ హీనత్వముకాదా ? మనమం చర మాంధ్రమాతృగర్భమునం దుద్భవించిన యేకోదరులమని తెలసుకొని, ఆంధ్రమాతృ రక్తమే మన యెల్లర దేహములను బ్రవహిం చుచున్నదని యెఱింగికొని, యేకోదరత్వము, రక్త బాంధవ్యములకన్న మిన్న యగునది సున్న యని గ్రహించినచో నిదియొక ఘనకార్యము గాడు. కావున మీ సోదరులై మీకన్న బీదలై, మీ దయాభిక్షములకు వేచియున్నట్టియు, నా శించియున్నట్టియు, విద్యావిహీనులకు నిరక్ష రకుక్షులకు విద్యాదానముఁ జేయ గంకణము కట్టుకొని గ్రంథభాండాగారములు దేశమునకు నిజమగు నుపయోగవంతములుగా జేయుదురు గాక ! మఱల జరుగబోవు గ్రంథా గార సభనాటి కిట్టి సంఘము లొండు రెండేని స్థాపింపబడి ప్రారంభవిద్యాభివృద్ధికి దోడ్పడం ను గాక !

సత్తెనపల్లి హనుమంతరావు.

గ్రంధాలయములు.

శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారు అంగలూరు బాలసరస్వతీ పుస్తక భాండాగార వార్షికోత్సవ సమయమునందిట్లు జెప్పిరి:

విద్యాశాలలవలెనే గ్రంధాలయములు ప్రాచీన కాలమునందు మన భరతఖండమునఁ జాలఁ గలవు. అవి చేసిన కార్యములు వణ౯ నా తీతములు. కవి యొకగ్రంథమును రచించును. భాష కెల్ల నొకేప్రతియుండిన దానివలన లోక ములో నెందఱకుప యోగముగల్గును? ఇప్పటి వలె నప్పుడు ముద్రాలయములు లేవు. చక్క ని కాగితములు లేవు. అచ్చు లేదు. అందుచే గ్రంధములు విశేషవ్యా ప్తంగాంచెడివి కావు. అయినను మహాకవులయందుఁగల యాదర మునంజేసి పెక్కురు గ్రంధములను దాటి యాకులపై వ్రాసి లేక వ్రాయించి పఠించు కొనుచుండెడివారు. ఆగ్రంధములు వారికే యుపయోగించుచుండేవి. పోయిన మరల నట్టి . గ్రంధములను సంపాదించుట దుర్ఘ టమని యె ఱింగి వారు పరుల కా పుస్తకముల నిచ్చెడు వారు కారు. ఆయీవిషయములం గమనించి మన భరతఖండపుఁ బూర్వ రాజులు పెక్కు గ్రంధములను వ్రాయించి యొక భవనమున నుంచి చదువుకొనఁగోరు పండితుల కుచితము30