పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/43

ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

గను నుండవలెను.

ప్రస్తుతమందాంధ్ర దేశమందున్న కొన్ని గ్రంధభాండాగారములు పురాణేతిహాసంబుల చెప్పించి, చదువరుల నాకర్షించుచున్నవి. మరికొన్ని యాటలను బెట్టి చదువరుల నాకర్షిం చుచున్నవి. కొన్ని వార సభలను గావించు చున్నవి. ఇంక నివియేగాకుండ, బాలుర బుద్ధిని వికసింపజేయు యాటలను అనగా 'వర్డ్సు బిలింగు' మొదలగు నాటలనుబెట్టి బాలురను రప్పింపవలెను, ఎప్పుడు ప్రచురింపఁబడిన గ్రంధమునప్పుడే తెప్పించుటవలన, పౌరులు చాలా మంది రాగలరు.

సభలను సమకూర్చి జనుల నాకర్షించుట నుగూర్చి చెప్పదలచితిని. చాలస్థలములందు సభలను గావించుచునేయున్నారు; కొన్ని చోట్ల యవి స్వల్ప కాలమున నే నశించుచున్నవి. సభ్యులను సభలకు రప్పించుటకు కార్యదర్శులుపడు కష్టముల నేను కళ్లార చూచియున్నాను. కాని యీ విషయమందు రెండంశములు ముఖ్యముగ చెప్పదలచియుంటిని. హాశ్యప్రధానములుగాక, నీతిబోకములగు నాటకములను ప్రదర్శించినయెడల కొంతమంది సభ్యులు రాగలరు. కొందరు కార్యదర్శులు, నాటకము లేల యాడవ లెను, హాస్యములోని కి సభదిగుననవచ్చును. సభ యొక్క తీవ్రము తగ్గకుండగ, సభ్యుల నాకర్షించు చిన్న చిన్న అంకములను, ప్రదర్శించిన బాలుర యొక్క వాధోరణి హెచ్చుటయేగాక సభ్యులును లమంది రాగలరు. సభ్యులు వివేషముగరాని సమయములందు కార్యదర్శులు నిరుత్సాహ పడ రాదు. అగ్రాసనాధిపతి, కార్యదర్శి, ప్రధానోపన్యాసకుడు యింకొక సభ్యుడుండిన చాలును. నేనొక భాండాగారమునకు కార్యదర్శిగానుండి రెండు సంవత్సరములు సభలను జరిపినాను. కొన్ని సభలకు నలుగురయిన వచ్చియుండ లేదు, కొన్ని సమయములందు, అ గ్రాసనాధిపతిగారితో ముగ్గురయిన లేరు. అ ట్టిసమయములందు నిరుత్సాహపడకూడదు. కొన్ని సమయములందు ప్రధమమున సభ్యు లు కొద్దిగ నున్నను, సభజరుగుచున్న సమయ మరి కొంతమంది సభ్యులు నిశ్చయ యి మందు ముగ రాగలరు. ఒక వేళ రాకపోయినను మ నము పట్టువిడవకుండ సభజరుపవలెను. ఇందు కుదాహరణముగ, 'క్రిస్టియను యెస్సోషి యేషను' ప్రధమమున స్థాపింపఁబడినప్పుడు యిద్దరు సభ్యులుండిరట. ఇద్దర ధైర్యపడక, పరిశ్రమచేయ, ఇప్పటికి ప్రపంచమందున్న ప్రతి పట్టణమందు, యట్టి క్రైస్తవసభలు గలవు. అట్లనే కలకత్తాలో బ్రహ్మసమా జము ప్రధమమున స్థాపించినప్పుడు ద్దరుండెడివారలట. ఇప్పుడన్ననో, యామతము ప్రపంచమందంతటను వ్యాపించినది. కా న యీసభలను జరుపు వారధైర్య 'మెంతమాత్రము పడకూడదు. ఇట్లెన్ని యోవిధముల గ్రంధ భాండాగారికులు తమగ్రంధాలయముల ను జనోపయోగకరములగునటుల జేయవచ్చు ను. మానవులెంద రెన్ని బిరుదులను పొందినను లాభము లేదు. ఎన్ని యుద్యమములుతల పెట్టిన నవియన్నియు వృధాయగును. ఈ యుద్యమమును దల పెట్టినవారే దేశవీరులు. అట్లు తల పెట్ట తగ్గవారే భాండాగారికులు.

టేకుమళ్ళ వెంకాజీరావు.