పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

25


గ్రంథభాండాగారాధిపతి.

గ్రంథభాండాగారములు సరస్వతీ దేవాలయములు. అందుండు భాండాగారాధిపతియే యర్చకుఁడు. భాండాగారములకు వచ్చుట యందు ముఖ్యోద్దేశము జ్ఞానాభివృద్ధిగావించుకొని తన్మూలమున ముక్తినిబడయుట. ఇందులకు సాధనము లెవ్వి?-గ్రంథములు. అట్టిచో సరస్వతీయాలయమునకు బోవునెడల మనకు ప్రచ్ఛన్న విగ్రహమయి కాన్పించువాడు భాండాగారాధిపతి.

కోపమన నేమొ భాండాగారాధిపతి యె రుంగకూడదు. సర్వదా శాంతస్వభావుడై యెవ రేగ్రంధమడిగినను విసుగుకొనక కావల సిన గ్రంధములు వారికిచ్చుచుండవలెను. ఆల యమందు దైవభ క్తి కందరును సమానమే. అందుచేతనే, జ్ఞానమును వృద్ధిపొందించు కొనుటకై వచ్చువారిని యాదరముతో భాం డాగా రాధిపతి ధనికులను, బీడలను యొ కేరీతి గ చూడవలెను. అప్పుడుగాని సరస్వతీ దేవి ప్రసాదమున కందరిని సమానహక్కుగలవా రినిగా చేసినవారుగారు.

భాండాగారకుడు అన్ని విషయములు తెలిసికొనిన వాడుగనుఁడవ లెను; ఆధునిక కవీశ్వరు లను గురించియైనను సరే, దేశనాయకులా చరించిన కార్యములు వారవలంబించిన పద్ద తులను గూర్చియైనను సరే, పరరాష్ట్రరా జ్యాంగ పద్ధతులను గూర్చియైనను సరే, ప్ర స్తుతమందున్న యేవిద్యను గూర్చియైనను సరే, వెయ్యేల! ఆబాల గోపాలపర్యంతము యవసరమగు యన్ని విషయములందారి తేరి యుండవలయును. వీటియందెట్టి సందేహము యిన తీర్పగల పాండిత్యముండవలెను. ఏవిష యమందెట్టి గ్రంధము లుపయోగకరములో వాని నెల్ల భాండాగా రాధిపతి తెలిసికొనియుండి వలెను. ఎవరయిన నాకాంధ్రభాషయందు స్వా డిత్యమెట్లలవడుననియడిగిన వాని కేయేగ్రంధి ము లుపయోగకరములో వానినెల్ల చూప లెను. ఎవరయిన మెక విషయమును గూర్చి వ్యాసము వ్రాయవ లెనన్న చో వానికి వలయ గ్రంధముల నెల్ల జూపవలెను. ఎవరయిన దేశ సేవ యొనర్చుటకు కుతూహలము గలదనిన మీ రీగ్రంధముల జదువుడు; ఈపద్ధతుల నను సరించిన మీ మనోభీష్టములు నెఱవేరును అని సూచింపవలెను, ఎంత విద్యావిహీనుడే తెంచి ఏవిషయమును గూర్చియైన ప్రశ్నించిన, విసి గికొనక, కసరక, ఆవిషయమును గూర్చి వా నికి దెలియజెప్పవలెను.

ఇట్లుగాక యెవరే విషయమును గూర్చి యడిగినను వారికి సలహానియ్యకుండిన, యే గ్రంధమడిగినను విసుగుకొనుచుండిన, యెవ్వరయిన భాండాగారమునకు మరునా డరుదెంతురా! వారి మనస్సుల యందలి సందేహములను దీర్చినచో మరుసటిదినమునుండియు వారు భాండాగారమునకు ప్రాత కాపులై యుందురు.

ఈవిషయమున గ్రంధ భాండాగారాధిపతులొక చిన్న సంగతి గమనింపవలెను. భాండాగారమందున్న గ్రంధముల నన్నింటిని భాండాగారాధిపతి చదివియుండవలెను. బాలు గెలి