పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

గ్రంథాలయములు చేయవలసిన పని.

పట్టణములయందలి గ్రంథాలయములు.

పట్టణముల యందు గల భాండాగారములు కొంతవరకు తృప్తికరముగ పనిచేయుచున్నవి. కాని పాశ్చాత్య దేశములయందు వలె పట్టణముల యందలి బీదలు నిశ్చయముగ భాండాగార ప్రయోజనములను వశము చేసికొనవలసినవారలయ్యు నట్లు చేయుట లేదు. చెన్నపురి యందలి కానిమరా” భాండాగారము రాజధాని యందు పెద్దది. అచ్చటకైన దినమున కిరువదిమంది వచ్చుట యరుదు. ఇంక ఇతర పట్టణములయం దెట్లుండునో యోచింపుము! అచ్చటకసేకములగు వార్తాపత్రికలుగూడ వచ్చును. కాని బందరు, రాజమహేంద్రవరము మున్నగు పట్టణములయందిటీవల పాఠకులసంఖ్య కొంతవరకు హెచ్చి తృప్తికరముగ'నున్నది. పఠనమందిరమునకుతోడు వ్యాయామములు గూడనున్నచో భాండాగారముకు చదువువారధికముగ వచ్చుట గలుగును. అయినను పల్లెటూళ్ళయందు కొందరు భాండాగారములు స్థాపించి, పాఠకులు లేక, యారంభశూరత్వముపోయి, నిరుత్సాహము చెంది, స్థాపకులా గ్రంధములను కొన్ని చోట్ల కొంతకాలములో యంతరించిపోవుట చూచుచున్నాము. 1. పట్టణములయందువలె పల్లెటూళ్ళయందు పాఠకులు రారు. పురాణశ్రవణమునకు వచ్చువారయిన నీ భాండాగారములకు రారు. ప్రారంభకులు విసిగియు, సేవ చేయించుకొను ప్రజలు లేకయు, స్వార్థ త్యాగముగలవారైల్లడు కాలానుసారము భాండాగారముఁ దెరచి ప్రజలకభిరుచిగలిగించువరకు నోపిక లేకయు, స్థాపించిన రెండుమూడు వత్సరములలోనే కొన్ని భాండాగారములంతరించుచున్నవి. కావున నిటీవల కొందరు వలంబించినట్లు పుస్తకముల నిండ్లకంపియు, పురాణపఠన మారంభించియు, వారమున కొకసారి సభలజరిపియు, వీలయినచోట్ల వ్యాయామములు ఉపహారములు, కలుగ జేసియు, ప్రజలను క్రమముగ తమ వైపున కాకర్షించవలయును. ప్రధమమున చందాలనిచ్చు పద్ధతు లుండినచో నెవ్వరునురారు. ఇది ధనవంతులును, విద్యాధికులును మొదట భరించవలసియుండును.

చెన్నపురియందు రెండుమూడువందల నవలలు కొని, యరవవారి యిండ్లకు ఆపుస్తకముల నంపి నెలకు నాలుగణాలచందాలగై కొనుచు వారమునకొకసారి పుస్తకములు మరల దీసికొనుచు నెల కిరువది ముప్పది రూప్యంబులవరకు సంపాదించి కొందరు మొదలియార్లు వ్యాపారము నడుపుదురు. ఇది మిక్కిలి యాశ్చర్యము కలిగించును. ఒక్క తిరువళిక్కేణిలో 200 మంది చందాదారులుగల "సర్క్యులేటింగు లైబ్రరీ"కలదు. ఇందువలన చందాదారులు నాలుగణాలతో నవలలు నెలకు నాలుగు చదువు కొనగలుగుదురు. క్రొత్తగా ప్రకటింపబడినవన్నియు నీ వర్తకులు తెప్పించి తమ తమ చందాదారుల కొసగుచుందురు. ఇట్టి పద్దతి మనపెద్దపట్టణములలో ముందు ప్రవేశ పెట్టుకొనవలసియే యుండును.