పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

జనము నిర్దుష్ఠమైనదని చెప్ప సాహసింపను. కాని ఈ విషయమున ఇంకముందు తగినవారు ఈయవలసిన మహాకార్యమునకిది కొంత వరకు అస్ధిభారముగ నుండవచ్చునేమోయని దలచుచున్నాను. నేను సేకరించిన 3259 గ్రంధములలో గొన్నిటికి గ్రంధకర్తల నామములు దొరకనందున వాటికి ప్రచురణకర్తల నామములను దెలిపితిని, మరియు ఆయా తరగతులక్రింద విభజింపబడిన గ్రంధనామములు చాల భాగము అకారాదిగా కూర్చితిని. అందువలన కావలసిన గ్రంధమును కనుగొనుట బహు సుళువు. ఒకే పేరుగల గ్రంధములు పలువురు కవులు చేసియున్నారు. అవియు ఆయా తరగతుల క్రింద నెక్కచోట దెలుపబడినవి.

అంతర్భాగ విభజన వివరములు

(1) పురాణముల క్రింద పురాణమను పేరుల గ్రంధములను మాత్రమే గాక పోతనామాత్యుని భాగవతము, కవిత్రయము వారి భారతము, వావిలికొలను సుబ్బారావుగారి వాల్మీకి రామాయణమునుగూడ జేర్చితిని.

(2) కొన్ని గ్రంధములు కావ్యలక్షణమున్నిటిని సరిగా కలిగియుండక బోయినను వాటిని సామాన్య పద్యగ్రంధములనుండి వేరుపరుచుటకై పద్యకావ్యములను తరగతి క్రిందనే చేర్చితిని.

(3) కొన్ని కొన్ని గ్రంధములు వచన కావ్యసులక్రింద జేరునో, నవలల క్రింద జేరునో, చారిత్రక కథల క్రింద జేరునో, లేక నీతి, వినోద, చారిత్రిక కథల క్రింద జేరునో, లేక నీతి, వినోద, కల క్రింద జేరునో యను సంశయము బుట్టు చుండును

(4) కొన్ని కొన్ని నాటకములనిగాని ప్రహసనములనిగాని నిర్ధారణ జేయుటకు వీలగాకయున్నది.

(5) కృషి, వైద్య, న్యాయ, గాన, పాక, జ్యోతిషాది విషయకములగు గ్రంధములను వేరు వేరుగా విభజించినను మొత్తము మీద వాటిని శాస్త్రముల తరగతి క్రిందనే జేర్చితిని.

(6) కొన్ని లకణగ్రంధములు, వ్యాకరణము, చందస్సు, అలంకారము మొదలగువాటి నన్నిటిని గురించి చెప్పుచున్నను యేదోయొక తరగతిక్రింద మాత్రమే విభజించితిని

(7) కొన్ని కొన్ని శతకములు, నీతి, మత, వినోద, తరగతుల క్రింద విభజింపవలసి యుండినను గ్రంధములు నాకు స్వయముగా దొరకమిచే నిద్ధారణ చేయలేక ప్రస్తుతమున వాటి నన్నిటిని “మతపద్యముల” క్రింద జేర్చితిని.

(8) మహాత్మ్యములలో పాండురంగమహాత్మ్యము, భూతపురిమహాత్మ్యము, మున్నగువాటిని పద్యకావ్యతరగతి క్రింద జేర్చితినిగాని మిగిలినవాటిలో ఏవి పద్యములో, ఏవి గద్యము బాగుగా తెలియనందున ప్రస్తుతమున వాటి నన్నిటిని “మత) పద్యముల” క్రింద జేర్చితిని.

(9) ఇదేవిధముగా పద్యములయందు జేర్చిన స్తోత్రములలోగొన్ని గద్యము లేమోయని యనుమానముగానున్నది.

(10) కవుల చరిత్రలో బేర్కొనబడి నర్వప్రణీత గ్రంధములన్నియు, నిపుడచున్నీ లేకున్నను, వాటినిగూడ పైతరగతుల క్రింద విభజించితిని. అచ్చుపడిన వేపూ, లేని వేపూ తెలిసికొనవలసి యున్నది.