పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

ఆంధ్ర గ్రంథ విభజనము


కడచిన సంవత్సరము ఏప్రిలు 10వ తేదీన బెజవాడలో జరగిన ఆంధ్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల సభయందు, శ్రీ బ్రహ్మపురాంధ్ర భాషాభివర్ధనీ భాండాగార పక్షమున “ఆంధ్ర గ్రంథ విభజనము" ను గూర్చి నేనొక చిన్న వ్యాసమును జదివియుంటిని. అందు ఆంధ్రమున నింతవరకు గల గ్రంథనామములను, తత్క ర్తల నామములతో సయితము సేకరించి, వాటిని కొన్ని ముఖ్య తరగతుల క్రింద విభజించి, అకారాది పట్టికలను తయారు చేయించినచో నవి యనేక గ్రంధ భాండాగారముల వారికి మిగుల నుపయోగకారిగా నుండునని సూచించి యుంటిని. ఆ సభ యందు ఏర్పాటు కాబడిన ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమువారు క్రిందటి సంవత్సరము మే నెల 10వ తేదీన కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు నందు సమావేశమై ఆంధ్ర గ్రంధ విభజన మవసరమని తీర్మానించి, ఆపనిని నెర వేర్చుటకు బరంపురములోనినన్నును, రాజమంద్రిలోని వీరేశలింగ భాండాగారమువారిని నియమించిరి. ఈపనిని నిర్వహించుటకుగావలసిన సాధన సామగ్రి బాగుగా లేనందున 'ఓడ్ర దేశములోని బరంపురమునందు నేను వసించుట చేతను సర్కారు ఉద్యోగమున పండుటవలన తగిన కాలవ్యవధి లేకుండుటచేత, తృప్తికరముగా నెరవేర్పలేనని నాకు తెలిసినను, ఈ విషయమున నాకు గల అభిమానమే నేనెనర్చిన కొద్ది కార్యమునకైనను ప్రోత్సాహము కలిగించినది.

ఇంతవరకు చేసిన పని

గ్రంధ నామములను, తత్కర్తల నామములు సంగ్రహించుటకు ముఖ్యముగా మూడు ఆధారములుగలవని నేను బెజవాడయందు చదివిన వ్యాసమునందు సూచించియుంటిని. వాటిలో మొదటిది పూర్వ ప్రణీత గ్రంధముల దెలుపు కవులచరిత్ర; రెండవది అచ్చు గ్రంధ నామములను మూడు మాసముల కొకసారి కడచిన ఇరువది ముప్పది సంవత్సరములుగ బ్రచురించుచున్న సర్కారువారి పోసెంటుజార్జి గెజెటు; మూడవది భాండాగార గ్రంధముల పట్టికలు. వీటిలో నాకు దొరికిన కవుల చరిత్ర, కడచిన ఎనిమిది సంవత్సరమ గెజెట్లు, హైదరాబాదులోని శ్రీ కృష్ణదేవరాయ పుస్తక భాండాగార గ్రంధముల పట్టికయ బరంపురములోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ గ్రంధముల పట్టికయు మాత్రమే. ఈ స్వల్ప సామగ్రితో నేను తయారుచేసిన “ఆంధ్ర గ్రంథ విభజన పట్టికా వివరము” ఆంధ్రదేశ గ్రంథ భాండాగార సంఘమువారు బ్రకటించిన 1914-1915 సంవత్సర వృత్తాంతము నందు ముద్రింపబడియున్నది.

నాకు దొరకిన గ్రంధనామముల నన్నిటి ఆయాతరగతుల యందు సరిగా విభజింప గలిగితినని చెప్పజాలను. ఏలననగా చాల భాగము గ్రంధములను నేను స్వయముగా చూచుటకు దొరకనందున కొంతవరకు ఊహను బట్టియు కొంతవరకు వినికిడినిబట్టియు ఆయా తరగతుల క్రింద భాగించితిని. మరియు ఒకే గ్రంథము అందుగల పలు విషయములనుబట్టి 2,3 తరగతుల క్రిందకు రావచ్చును. అట్టి విషయమయిన వాటిని ఏదోయొక తరగతి క్రింద మాత్రమే జేర్చితిని. ఇదిగాక కొన్ని గ్రంధముల విభజనమును గూర్చి అభిప్రాయ భేదముండుటకు అవకాశమున్నది. ఈ మూడు యిబ్బందుల చేత నా