పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
9

కు అభివృద్ధి జెందియున్నదో ఊహించుటకైన మనకు శక్తి చాలదు. అచటి గొప్ప గ్రంథా లయములనుంచిన భవనములవంటి కట్టడములనైన మనలో జాలమంది జూచియుండమని నేను దృఢముగ జెప్పగలను.

మనదేశముయెడల విద్యాధిదేవతకు దయలేదు. ఆమె యెడల మనకు భక్తిలేదు. పరస్పరము సమానమగు ప్రేమనే జూపుచున్నారము. ఇది స్వాభావికమే. మన దేశమునందు చదువుకొన్న జనులు నూటికి 2 మంది కన్ననెక్కువలేరు. నిశానీ దారులతో సమానులగు దస్కతు మాత్రము జేయగలిగిన వారందరును గూడ ఈ సంఖ్యయందే జేరియున్నారు. విద్యాధిదేవత తాండవమాడుచున్న పాశ్చాత్యదేశములయందే గ్రంథాల యోద్యమము మహోన్నతదశను వహించియుండ ఇంతమంది విద్యావిహీనులచే నలరారుచున్న మనదేశమునందది ఇంకను ఎన్ని రెట్లు మహెూన్నత దశను జెందవలసియున్నదో మీరూహింపవచ్చు. ఇతర దేశములందీ యుద్యమ మభివృద్ధి జెందుటకు అనేక విధములగు సౌకర్యములులవు. మనదేశమునందో అట్టి సౌకర్యములులేవు. అదియట్లుండ కరవులో నధికమాసమనున్నట్లు విద్యావిహీనుల సంఖ్య అధికము. విద్యావిహీనులనగా చదువను వ్రాయను జేతకానివారని నాఉద్దేశ్యము. ఈవిద్యా విహీ నులు గూడ ఈసంఖ్యయందే జేరియున్నారు. విద్యావిహీనులను విద్యావంతులను చేయుట మనకు దుస్సాధ్యముకావచ్చును. కానివారిని జ్ఞానవంతులనై న జేయుట మన విధ్యుక్త ధర్మమై యున్నది.

గ్రంధాలయము పరీక్ష పట్టాలను బొంద గోరువారికిగాదు. అదిసామాన్య జనులయొక్క సర్వకళాశాలయైయున్నది. కాబట్టి మన గ్రంధాలయములు ఎవరికుపయోగ పడునునట్లు జేయవ లెను?

మనమందరమును ఈ ప్రశ్ననుగూర్చి మిక్కిలి తీవ్రముగ నాలోచింపవలసి యున్నది, ధనాఢ్యులును, విద్యాధికులునగువారు తమకు కావలసిన గ్రంధములను ద్రవ్యము వెచ్చించి తెప్పించుకొనగలరు. లేక ఎవరి యొద్దకైన బోయి సంపాదించు కొనగలని, చదువుకొన నాసక్తి గల మనుజుడు ఎన్నివిషయములనైన శ్రమపడి వాడ వాడల దిరిగి తను గావలసిన గ్రంధములను సేకరించుకొని వారు యుపయోగమును బొందును. గ్రంధాలయములు ఇట్టి వారికి గూడ నుపయోగపడునప్పుటికిని, వీరి విషయమై మనము విశేష శ్రద్ధవహింపవలసిన యావశ్యకత లేదు. ఏలననవారు తమంతట తామే గ్రంధాలయమునకు వచ్చి దాని లాభమును బొందెదరు.

అట్లయిన ఇంకెవరికొరకై మనము శ్రద్ధను బూనవలసియున్నది? అనిమీరు ప్రశ్నింప వచ్చును. ప్రతిదేశమునందును గూడ గ్రంధాలయములయొక్క లాభములను బొందవలెనని తమంతటతామే ప్రయత్నించువారి సంఖ్య బహుస్వల్పముగ గానబడుచున్నది. ఇది స్వభావ జనితము. మన దేశమునందీ రోగము అన్నిదేశములకన్న నెక్కువ తీవ్రముగ ప్రబలియిున్నది. చదువుకొనగలిగి, గ్రంధముల చదువనపేక్షింపని మందులనంతముగ మనదేశమునందున్నారు. ఇట్టివారికి చదువుకొనునభిలాషను జనింపజేయుట మన ప్రధాన కర్తవ్యమనక తీరదు. మన గ్రంధాలయము నందున్న ప్రతిగ్రంధమునకు అధమమొక చదువరినైన