పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

గూర్చియు, వీరభ్యసింప జేయు విషయములను గూర్చియు ప్రత్యేకముగ చర్చింపవలసియున్నది. కావున దీనిని గూర్చి సూచనమాత్రము జేసి విడువబడినది. వీరందరకును ఈయుద్యమమునందభిమానము కలుగునట్లు చేసినయెడల వీరే యాంధ్రదేశ సేవకు లగుదురు. వారు ఆయాచోట్ల స్థానికులగుటచే వారికి పలుకుబడి ఎక్కువ యుండును. కార్యసాధనమును సుకరముగా కాగలదు.

ఇక పట్టణములయందు స్థాపించు గ్రంధాలయముల కిట్టి సదుపాయము లెవ్వియు లేవు.'ఆ సంఘములు యుదార వంతుల ధనసహాయము విూదనే యాధారపడవలసియున్నవి. ఇంత వర కును ఈ యుద్యమము వ్యాపింప జేయుటకున్న సాధనములనుగూర్చియు, అవలంబించవలసిన మార్గములను గూర్చియు జర్చింపబడియున్నది. ఇంకను ఈ యుద్యమప్రచారకులు వెంటనే చేయవలసిన పనినిగూర్చియు అందువలన గలిగెడి ఫలమును గూర్చియు వివరింపబడును.

పల్లెటూళ్ళయందును, పట్టణములయందును గ్రంధాలయ సంఘములు నేర్పిరచి సాంఘికులు వారివారి శక్త్యనుసారము గ్రంధములను చేర్చవలయును. వీలైనచో ప్రతిదినమును సాంఘికులలో నెవరో యొకరు ఏదో యొక యుద్గ్రంధమునుండి జదివి అక్షరజ్ఞానము లేనివారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకు మన భాగవత, భారత, రామాయణము మొదలగు యుద్గ్రంధములును, నవీనముగా బయలుదేరుచున్న ఆరోగ్యశాస్త్రము మొదలుగా వారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకుగల గ్రంధములును ముఖ్య సాధకములు. పురాణపఠనము వలన గలుగు లాభములు కడుమెండు. ఇంతియగాక పట్టణములందలి విద్యాధికులు మ్యాజికులాంతరు సహాయముతో నిమ్న సోదరులకు ఉపన్యాసము తీయవలసిఉన్నది. మ్యాజికులాంతరులు మ్యూనిసిపాలివారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకు వారు కొనునట్లు జేయవచ్చును. విద్యాశాఖ వద్ద కూడ అరువునకుదొరకును. వీలయినప్పు ప్రముఖులచే ఉపన్యాసము లిప్పించవలయును . విద్యాధికులును విద్యావిహీనులును,భాగ్యవంతులును పేద వాండ్లును, హిందువులుని, మహమ్మదీయులును, ఉద్యోగులును నిరుద్యోగులును, భూస్వాములును, రైతులును, ఏక సమావేశము గావలెనన్న మన సంఘము అట్టి వీలును గల్పించును. ఇంకనే ప్రతిష్ఠాపయందట్టి వీళ్ళు లేవు. అధికార భేదమును విద్యావ్యాపకమును జేయుటకు మన సంఘములే శరణ్యములు. విద్యాధికులు జనసామాన్యముతో గలసి తాము నూతనముగా గ్రహించిన సంగతులను వారికి బోధపరచి తాము దేశాభివృద్ధికొరకై చేయు పనులయందు వారికి విశ్వాసమును కల్పించుటకు ఈ సంఘములే సాధనములు. స్వార్థత్యాగము కట్టు దిట్టములకు లోబడి యుండుట జన సామాన్యము యొక్క క్షేమము కొరకు తమ యభిప్రాయమును ఇతరుల యభిప్రాయమునకు అవసరమయినంతవరకు లోబరచు కొనుట, నీతి ప్రవర్తన, జాతీయభావము, దేశాభిమానము, భాషాభిమానము మొదలగు తత్వములను జనసామాన్యమునందు వ్యాపింపజేయుటకు గ్రంధాలయములే ముఖ్యసాధకములు. కావున గ్రంధాల యోద్యమము ఆంధ్ర దేశమునందంతటను వ్యాపింపజేసి ప్రతిపట్టణమునందును పల్లెయందును గ్రంధాలయములను స్థాపించి తన్మూలమున జనసామాన్యమునకు జ్ఞానాభివృద్ధిని జేయుట ప్రతి ఆంధ్రదేశాభిమానికిని ముఖ్యకర్తవ్యము. •