పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

నిరుత్సాహము కావలసిన యావశ్యకము లేదు.

మొట్టమొదట పల్లెటూండ్ల సంఘములను గూర్చి విచారింతము. ఈ సంఘములకు ముఖ్యముగా నాలుగు పనులకు ద్రవ్యముగావలసియున్నది. మొదటిది స్వంత భవననిర్మాణము, రెండవది సిబ్బందీఖర్చు. మూడవది పుస్తకములు వార్తాపత్రికలును తెప్పించుటకు వ్యయము. నాలుగవది దినచర్య కగు ఖర్చు.

మన పల్లెటూండ్లలో చాల గ్రామముల సందు దేవళములకు సంబంధించి సావళ్ళుని, రామభజన మందిరములుగాను ఉండిఉన్నవి. స్వంతభవనమును కట్టుకొను శక్తి సంఘమునకు కలుగువరకును గ్రామసంఘములీ కట్టడములను తమ కార్యస్థానములుగా మలుచుకొనవచ్చును. స్వంతభవనమును కట్టుకొవలచినవారలు దొరతనమువారికి దరఖాస్థును బంపుకొనినయెడల ఉచితముగా గ్రామములో గాని పోరంబోకలలో గాని ఖాళీస్థలములముల నిచ్చెదరు. ఇందుకు దొరతనమువారి యుద్యోగస్థులుకూడ సహాయభూతలగుదురు,

కార్యనిర్వాహకులను గూర్చి జర్చించునపుడు రెండవ యంశమగు సిబ్బందీని గూర్చి చెప్పవలయును. ఇకను దినచర్యకును, గ్రంధములు వార్తాపత్రికలు చెప్పించుకొనుటకును కావలసిన సొమ్మును సంపాదించుటను గూర్చి జెప్పవలసియున్నది. చాల పల్లెటూళ్ళ యందు ఏదోవిధముగ ఉమ్మడి సొమ్ముకొంత ఏర్పడుచున్నది. కొలగారపు పాటలమీద గడ్డి వేలంపాటమీద ఇంక నెన్ని యోవిధముల ప్రతిపల్లెటూరునందును ఎక్కువ సొమ్ము వసూలగుచున్నది. ఇందులో కొంతవరకు డెల్టా మొదలగు ఖర్చుల క్రింద పోయినను కొంత సొమ్ముయినను నిలువ యుండును.

ఈ ద్రవ్యమును జనసామాన్యాభివృద్ధి కొరకై వెచ్చించునట్లు గ్రామస్థులమనంబులు త్రిప్పుట కష్టసాధ్యమే యైనను ఈ యుద్యమావలంబకులు ఎక్కువ కృషి జేసి ఇందును గూర్చి ప్రయత్న ములు సఫలమగునటుల చేయవలెను. గ్రామముల యందు జరుగు శుభకార్యముల సందర్భమున చులకనగా కట్నములను వసూలు జేయవచ్చును. ఈ సొమ్మంతయు వసూలు పరచి ఉచితముగా వ్యయ పెట్టి అందుకు సరియైన లెక్కలనుంచి సంవత్సరమున కొకతూరి గ్రామస్థుల నందరిని జేర్చి ఆ లెక్కలను చదివి వినిపించిన యెడల జనసామాన్యమునకు ఈ యుద్యమ పక్షమున జరుగు పనియందు నమ్మకమును అభిమానమును కలుగక మానవు. దీనికి తోడు సామాజికులిచ్చు చందాలవలనను, విరాళములవలనను కార్యనిర్వాహకత్వమును కొనసాగింపవచ్చును. ఇంతేగాక మన దేశమునందిప్పుడు బయలు దేరుచున్న పరపతి సంఘములవల్ల వచ్చెడి లాభములో కొంతవరకు ఈయుద్యమము కొరకై వ్యయ పెట్టునట్లు చేయవచ్చును. ఇంకను కార్యనిర్వాహకులను గూర్చి చెప్పవలసియున్నది. చాల పల్లెటూళ్ళయందు ఆంగ్లవిద్యను కొంతవరకభ్యసించి పిదప విరమించి విశ్రాంతిగానున్న వారనేకులున్నారు. వీరిలో కొందరు స్థితిపరులు. మరికొందరు సామాన్యులు, వీరుగాక చాల చోట్లు ఆంధ్రమునందును గీర్వాణమునందును పరిచయము గలవార లున్నారు. వీరులందరకును ఈ యుద్యమమునం దభిమానముగలుగ జేసి పలుచోట్ల స్థాపింపబడు సంఘముల యాధిపత్యము క్రింద వీరలచే విద్యావ్యాపకము చేయించవలెను. వీరవలంబించవలసిన మార్గములను