పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

ఇందుకొరకై మన భాషయందున్న గ్రంధములన్నిటి యొక్క పట్టిక నొకదానిని తయారుపరచి అందుండి గ్రంధస్థాంశములను బట్టి గ్రంధములను విభాగము జేయవలసియున్నది. ఇందును గూర్చి ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘపక్షమున కొంతకృషి జరిగినది. ఎక్కువ సమర్ధతతో ఎక్కువ కాలమును వెచ్చించి ఈసంబంధమగు పనిని జరపిన శ్రీ వెలిదెండ శ్రీనివాసరావుగారు ఆంధ్రలోకముయొక్క కృతజ్ఞత కెంతయు పాత్రులు. అప్పుడప్పుడు దొరతనము వారిచే ప్రచురింపబడు ముద్రితగ్రంధముల పట్టికలనుండి ముఖ్యమైన గ్రంధముల నామములను విడదీసి గ్రంధాలయముల యుపయోగము కొరకు ప్రచురించుట కర్తవ్యము. వార్తాపత్రికలయందును మాసపత్రికలయందును ప్రచురింపబడు యుపన్యాసములను గూడ వాటియందలి యంశములను బట్టి విభజించుట ముఖ్యావశ్యకము. మఱియు ఆంధ్రభాషా గ్రంధములు పట్టికను పూర్తి జేసిన పిదప దానినుండి కొద్దిసొమ్ములో స్థాపింపబడు గ్రంధాలయముల కుపయోగముగా నుండునట్లు పండితులచే పరిష్కరింపబడిన 250, 500, 1000 ముఖ్య గ్రంధముల యొక్క నామావళిని తయారుచేయింప వలసియున్నది. ఇది గ్రంధాలయోద్యమము యొక్క ప్రధమవిధి.

పాఠశాలలలో విద్యనభ్యసించెడి వారలకు విద్యాభ్యాసమునకు సాధకమగు పరికరములను సంగ్రహించుటయు, పాఠశాలలను వదలిన వారికి వారిదివరకు సంపాదించిన విద్యను బలపరుచుటకు తగిన సాధనములను, గ్రంధములను చేర్చుటయు, అక్షర జ్ఞానము లేనివారికి చిత్రపటముల మూలముగను, ఉపన్యాసముల మూలముగను, పురాణపఠనము మూలముగను విద్యావ్యాపకము జేయుటయు మన రెండవ విధి. గ్రంధాలయములను స్థాపించుటతోడనేతృప్తి చెందక వానియొక్క యుపయోగముల గూర్చి జనసామాన్యమునకంతకును ప్రచారము చేయుట ఈ యుద్యమము యొక్క మూడవవిధి. ప్రతిసంఘమందున్న సామాజికులందరు ఇందులో వారు అన్యోన్య సహాయకులుగానుంటయేగాక వీలయినంతవరకు అందుబాటులోనున్న సంఘములన్నియు ఒక సమూహఃముగాగూడి అన్యోన్యాశ్రయభావము గలిగినందువలన గలిగెడు లాభములను బొందుటకు ప్రయత్నించుట మన నాలగవవిధి. జనసామాన్యమునకు మనయుద్యమమునం దభిమానము గలుగ జేసి ఈ యుద్యమమును ప్రతిపట్టణమందును ప్రతి పల్లెయందును వ్యాపింపజేయు మన మైదవ విధి. ఇంక నెన్నియో విధులు గలవు.

ఇక నీవిధులను నిర్వర్తించు మార్గములగూర్చి చర్చింపవలసియున్నది. ప్రతియుద్యమును నిర్వహించుటకు ధనమును, కార్యభారమును వహించెనువారును ఉండితీరవలయను. ఈ యుద్యమము మిక్కిలి జయప్రదముగా జరుగుచున్న పాశ్చాత్య దేశములయం దేనీ బరోడా దేశమం దేమి ఈయుద్యమమునకు దోరతనమువారి యాదరణ మెండుగాగలదు. ఆచటి ప్రభుత్వము వారలిందుకొరకై విశేషద్రవ్యమును బొక్కసమునుఁడి వ్యయపెట్టుచున్నారు. ఇంతియగాక ఆదేశములయంద విద్యాధికులును ద్రవ్యసంపన్నులు నెక్కువగానుండుట చేత అమూల్యములగు విరాళమలీయుద్యమము కొరకై వారలచే నివ్వబడుచున్నవి. మన దేశమునందట్టి సదుపాయనులులేవు. అయినను మనము ద్రవ్య లేమిడి