పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ను బూను శిల్పి సౌధాకారమును ముందు కాగితముపై లిఖించి దాని యొక్క వివిధ భాగముల కెట్టెట్టి సంబంధము లుండవలనో ఎట్లునిర్ణయించునో ప్రతి యుద్యమము అవలంబించి పనిచేయు వారలు తామభిమానముతో పనిజేయు యుద్యమమునకును పౌరయుద్యమములకును గల మన్యోన్య సంబంధాలనములను బాగుగ గుర్తెరింగి ఇతర యుద్యముల సిద్ధాంతాంశములకు వ్యతిరేకము లేకుండునట్లు తమ యుద్యమమును నడపుచుండును.

ఇక నీ యుద్యమమును ప్రచారణ జేగంటయందు గమనింపవలసిన సూత్రములను గూర్చి ముచ్చటింపవలసి యున్నది. జనసామాన్యమునకు విద్య, వ్యాపకము చేయుటయందేశ భాషలే ముఖ్యసాధకములను యంశము మనము ముఖ్యముగా గమనించవలెను.

మొదటిసూత్రము. చతురక్షరసంయోగము వలననేగాక శ్రవణ మూలకముగను, చిత్రముల మూలకముగను జ్ఞానాభివృద్ధి జేయగలమని గ్రహించుట. రెండవ సూత్రము- చిరకాలము నుండి మనదేశమున జ్ఞానము పుస్తకరూపముననేగాక లిపివ్యాపకమునకు' పూర్వము నుండిగూడ, శృతిమూలకముగ నభివృద్ధి ఆగుచుండెననుట మనకు సుప్రసిద్ధముగ దెలిసిన యంశమే. శృతిమూలకమగు జ్ఞానము పురాతన కాలమందేగాక నేటికిని ధారణాశక్తి సహాయముతో వ్యాపింపజేయుట యావశ్యకమయియున్నది, చిత్రపటముల మూలమున విద్యావ్యాపకము జేయు మార్గము మనము పాశ్చాత్య దేశములనుండి నేర్చుకొన వలసియున్నది. ఇందునుగూర్చి ఆదేశములయందు జరుగు ప్రయత్నములు. బహు మహత్తరములు. బయోగ్రాఫు, సినిమోటాగ్రాఫు, మాజిక్కు లాంతరు మొదలగు యంత్ర సహాయముచే అక్షర రజ్ఞానములేని మన నిమ్న సోదరులకు జ్ఞానాభివృధ్ధి చేయుటకు ఎన్నియో సదుపాయములున్నవి. ఇది మూడవ సూత్రము -అధికారి భేదమునుబట్టి విద్యావ్యాపక సాధనములయందు భేదమును పాటింపవలెనను యంశము.నాలుగవ సూత్రము. వయస్సును బట్టియేమి,జ్ఞానమునుబట్టియేమి, వృత్తినిబట్టియేమి, అభిరుచులనుబట్టియేమి, చుట్టునుండు స్థితిగతులను బట్టియేమి ప్రజలు వివిధములుగా నున్నారు. వీరందరికిని ఎవరికితగినట్లు వారికి జ్ఞానాభివృద్ధి కరములగు పరికరములను అవసరము బట్టి వేరు వేరుగా కల్పించుట ఆవశ్యకమని మనము ముఖ్యముగా గమనించవలసియున్నది.

ఇక నీయుద్యమము యొక్క వ్యాప్తిని నిరూపించవలసియున్నది. ఈ యుద్యమమునకు పరమావధి జనసామాన్యముయొక్క జ్ఞానాభివృద్ధియని ఇదివరకే చెప్పబడియున్నది. జ్ఞానాభివృద్ధికి ముఖ్య సాధనము వాఙ్మయము; కావున వాఙ్మయాభివృద్ధితో కూడిన అన్ని యంశములును ఈ యుద్యమమునకు సంబంధము కలవియేయైయున్నవి. మన యాంధ్రవాఙ్మయము ఇదివరకే యేదారులనవలంబించి వృద్ధి బొందినది? ఎట్టి గ్రంథములీ భాషయందున్నవి? ఇందు లోపము లేమిగలవు? ఆలోపములను సవరించుటెట్లు? అన్ని తరగతుల జనులకు తగిన గ్రంధములు మనభాషయం దున్ననా? లేనిచో ఆగ్రంధములు వెలువడునట్లు చేయుటకు మన మేమి ప్రయత్న ములను జేయవలయును? అను యంశము లన్నియు ఈ యుద్యమమునకు సంబంధించినవియే యైయున్నవి.